ONEPLUS 10 PRO SMARTPHONE LAUNCHED WITH SNAPDRAGON 8 GEN 1 FLAGSHIP PROCESSOR KNOW PRICE AND SPECIFICATIONS SS
OnePlus 10 Pro: భారీ స్పెసిఫికేషన్స్‌తో వన్‌ప్లస్ 10 ప్రో రిలీజ్... ధర ఎంతంటే
OnePlus 10 Pro: భారీ స్పెసిఫికేషన్స్‌తో వన్‌ప్లస్ 10 ప్రో రిలీజ్... ధర ఎంతంటే
(image: Oneplus)
OnePlus 10 Pro | వన్‌ప్లస్ మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. వన్‌ప్లస్ 10 ప్రో (OnePlus 10 Pro) మోడల్‌ను రిలీజ్ చేసింది. ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.
వన్‌ప్లస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్వన్ప్లస్ 10 ప్రో (OnePlus 10 Pro) రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్‌ని గతంలోనే వన్‌ప్లస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అధికారికంగా రిలీజ్ చేసింది కంపెనీ. క్వాల్కమ్ ఇటీవల రిలీజ్ చేసిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్తో వన్‌ప్లస్ 10 ప్రో రిలీజ్ అయింది. ఇదే ప్రాసెసర్‌తో రియల్మీ జీటీ 2 ప్రో (Realme GT 2 Pro) స్మార్ట్‌ఫోన్ చైనాలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వన్‌ప్లస్ 10 ప్రో పోటీ ఇవ్వబోతోంది. వన్‌ప్లస్ 10 ప్రో ప్రస్తుతం చైనాలో రిలీజ్ అయింది. ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు.
వన్‌ప్లస్ 10 ప్రో ధర ఎంతంటే...
వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.54,500 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.58,000, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.61,400. ఈ స్మార్ట్‌ఫోన్‌ను వోల్కానిక్ బ్లాక్, ఎమరాల్డ్ ఫారెస్ట్ కలర్స్‌లో కొనొచ్చు. జనవరి 13న చైనాలో సేల్ ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రో మిత్రిల్ ఎడిషన్ కూడా లాంఛ్ అయింది. ఇంట్రడక్టరీ ధర సుమారు రూ.8,100 కాగా, రీటైల్ ధర రూ.9,300.
వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 48మెగాపిక్సెల్ Sony IMX789 ప్రైమరీ సెన్సార్ + 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సాంసంగ్ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ టెర్టియరీ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది స్వీడన్‌కు చెందిన కెమెరా తయారీ సంస్థ హాసిల్బ్లేడ్ పార్ట్నర్షిప్తో కెమెరా సెటప్ రూపొందించింది వన్‌ప్లస్. ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ Sony IMX615 కెమెరా ఉంది. వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 80వాట్ సూపర్ ఫ్లాష్ ఛార్జ్, 50 వాట్ వైర్‌లస్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండటం విశేషం.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.