OnePlus 10 Pro: రిలీజ్​కు ముందే లీకైన వన్​ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు... కొత్త డిజైన్​, కళ్లు చెదిరే ఫీచర్లు

OnePlus 10 Pro: రిలీజ్​కు ముందే లీకైన వన్​ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు... కొత్త డిజైన్​, కళ్లు చెదిరే ఫీచర్లు (Image Credit: OnLeaks via Zouton)

OnePlus 10 Pro | వన్‌ప్లస్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నారు వన్‌ప్లస్ ఫ్యాన్స్. ఇప్పుడు వన్‌ప్లస్ 10 ప్రో (OnePlus 10 Pro) పూర్తి స్పెసిఫికేషన్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

  • Share this:
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్​ప్లస్​కు భారత మార్కెట్​లో ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిడ్​రేంజ్​ ధరలోనే ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను రిలీజ్​ చేస్తూ మార్కెట్​లో మంచి మార్కెట్​ ఏర్పర్చుకుంది. తన మార్కెట్​ను మరింత విస్తరించేందుకు వరుసగా స్మార్ట్​ఫోన్లను లాంచ్​ చేస్తుంది. ఇప్పటివరకు వన్‌ప్లస్ నుంచి 9 సిరీస్​లు విడుదలవ్వగా.. ఇప్పుడు 10వ సిరీస్​ను లాంచ్​ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని వారాల నుంచి వన్​ప్లస్​ 10 ప్రో (OnePlus 10 Pro) స్మార్ట్‌ఫోన్ లాంచింగ్​పై పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఫీచర్లు ఆన్​లైన్​లో లీకయ్యాయి.

Amazon Fab Phones Fest: అమెజాన్‌లో డిస్కౌంట్ సేల్... ఈ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్

లీకైన ఫీచర్లను బట్టి చూస్తే.. ప్రాసెసర్​, బ్యాటరీ విషయంలో వన్​ప్లస్​ 9 ప్రో కంటే మెరుగ్గా ఈ ఫోన్​ ఉండనుంది. దీనిలో క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 1 చిప్​సెట్​ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ ట్రిపుల్​ రియర్​ కెమెరా సెటప్‌తో రానున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. 2022లో ఈ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లోకి రానుండగా.. విడుదలకు ముందే స్పెసిఫికేషన్లు లీకవ్వడం విశేషం. @OnLeaks పేరుతో టిప్‌స్టర్ స్టీవ్ హెమర్‌స్టోఫర్ ఈ ఫీచర్లను ఒక ట్వీట్​లో పంచుకున్నారు. అయితే దీని ధరను మాత్రం వెల్లడించలేదు.

WhatsApp Chat Leaks: మీ వాట్సప్ ఛాట్స్ లీక్ అవుతున్నాయని డౌటా? ఈ టిప్స్ పాటించండి

కొత్త తరహా డిజైన్​తో వన్​ప్లస్​ 10 ప్రో


91మొబైల్స్‌ కథనం ప్రకారం.. వన్​ప్లస్ 10 ప్రోలో 6.7 -అంగుళాల క్వాడ్ హెచ్​డీ ప్లస్​ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 1 ప్రాసెసర్​పై పనిచేయనుంది. దీనిలో 12 జీబీ ఎల్పీడీడీఆర్​ 5 ర్యామ్​, 256 జీబీ స్టోరేజ్​ను అందించనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000mAh ఉండనుంది. ఇది 125W సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. ఆప్టిక్స్ పరంగా చూస్తే.. వన్​ప్లస్​10 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఇందులో 48- మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 50- మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 8 -మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలను చేర్చనుంది.

Xiaomi 11 Lite 5G NE: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు ఇవే

ఈ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 32 -మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌ కెమెరాను చేర్చనుంది. ఇది IP68 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది. కాగా, వన్​ప్లస్​ 10 ప్రోలో కొత్త తరహా డిజైన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పటికే వైరల్​ అయ్యాయి. ఈ లీకైన ఫోటోల ప్రకారం.. వాల్యూమ్​ బటన్లు ఫోన్​కు ఎడమవైపు ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఫోన్​ ముందుగా చైనాలో లాంచ్​ అయ్యి, ఆ తర్వాత భారత్​తో సహా ఇతర గ్లోబల్​ మార్కెట్​లోకి రానుంది.
Published by:Santhosh Kumar S
First published: