ONEPLUS 10 PRO LAUNCH OF ONEPLUS 10 PRO SMARTPHONE IN THE INDIAN MARKET TODAY 5 THOUSAND DISCOUNT GH VB
OnePlus 10 Pro: నేడే భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్.. రూ. 5 వేల డిస్కౌంట్ కూడా..
ప్రతీకాత్మక చిత్రం
చైనీస్ స్మార్ట్బ్రాండ్ వన్‌ప్లస్ భారత మార్కెట్లో వరుస స్మార్ట్ఫోన్ల లాంచింగ్‌తో దూసుకుపోతుంది. ఇందులో భాగంగానే నేడు (మార్చి 31)న వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. దీని లాంచింగ్‌కు ముందే వన్‌ప్లస్ ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది.
చైనీస్ స్మార్ట్బ్రాండ్(Smart Brand) వన్‌ప్లస్(OnePlus) భారత మార్కెట్లో వరుస స్మార్ట్ఫోన్ల లాంచింగ్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే భారత ప్రీమియం(Premium) స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను(Market) కైవసం చేసుకున్న వన్‌ప్లస్.. ఇటీవలి కాలంలో మిడ్‌రేంజ్ మార్కెట్‌పై దృష్టిసారించింది. ఇందులో భాగంగానే నేడు (మార్చి 31)న వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. దీని లాంచింగ్‌కు ముందే వన్‌ప్లస్ ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. వన్‌ప్లస్ 9(OnePlus 9), వన్‌ప్లస్ 9ప్రో(One Plus 9Pro) ఫోన్లపై రూ. 5,000 వరకు డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. వన్‌ప్లస్ 9 5G సిరీస్ గతేడాది భారతీయ మార్కెట్లోకి విడుదలైంది. దీనికి సక్సెసర్‌గా వన్‌ప్లస్ 10 మార్కెట్లోకి రానుంది.
వన్‌ప్లస్ 10 ప్రో మార్కెట్లోకి రానున్న నేపథ్యంలో వన్‌ప్లస్ 9 5G, వన్‌ప్లస్ 9 ప్రో వేరియంట్లపై రూ. 5,000 ధర తగ్గించింది కంపెనీ. వన్‌ప్లస్ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో కొత్త ధరకే ఫోన్లు అందుబాటులో ఉంటాయి. వన్‌ఫ్లస్ 9 5G 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 44,999 నుండి ప్రారంభమవుతుంది. ఇక, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 49,999 నుంచి ప్రారంభమవుతుంది. మరోవైపు, వన్‌ప్లస్ 9 ప్రో 5G బేస్ 8GB ర్యామ్ + 128GB బేస్ వేరియంట్ రూ. 59,999 వద్ద అందుబాటులో ఉంటుంది. 12GB + 256GB వేరియంట్ రూ. 64,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. భారత్‌లో విడుదలకు సిద్దమవుతోన్న వన్‌ప్లస్10 ప్రో ధరలు వన్‌ప్లస్ 9 ప్రో కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆన్లైన్లో లీకైన వివరాల ప్రకారం, వన్‌ప్లస్ 10 ప్రో రూ. 66,999 ధర నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ 10 ప్రో ఇండియా లాంచ్, ధర, స్పెసిఫికేషన్లు
వన్‌ప్లస్ 10 ప్రో లాంచింగ్ ఈవెంట్ మార్చి 31, గురువారం రాత్రి 7:30 PM IST ప్రారంభంకానుంది. ఈ లాంచింగ్ ఈవెంట్‌ను వన్‌ప్లస్ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా లైవ్‌లో చూడవచ్చు. వన్‌ప్లస్ 10 ప్రో వాస్తవానికి కొన్ని నెలల క్రితమే చైనాలో విడుదలైంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన క్వాడ్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 48 -మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50 -మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 8 -మెగాపిక్సెల్ సెన్సార్ గల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ 10 ప్రో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000mAh బ్యాటరీతో వస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.