Home /News /technology /

ONEPLUS 10 PRO 5G SMARTPHONE LAUNCHED IN INDIA WITH QUALCOMM SNAPDRAGON 8 GEN 1 PROCESSOR KNOW PRICE AND SPECIFICATIONS SS

Oneplus 10 Pro: ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్‌తో ఇండియాలో లాంఛైన వన్‌ప్లస్ 10 ప్రో 5జీ

Oneplus 10 Pro: ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్‌తో ఇండియాలో లాంఛైన వన్‌ప్లస్ 10 ప్రో 5జీ
(image: OnePlus India)

Oneplus 10 Pro: ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్‌తో ఇండియాలో లాంఛైన వన్‌ప్లస్ 10 ప్రో 5జీ (image: OnePlus India)

Oneplus 10 Pro 5G | వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాకు వచ్చేసింది. ఏప్రిల్ 5న సేల్ ప్రారంభం కానుంది. ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

వన్‌ప్లస్ ఇండియా మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. ఇప్పటికే చైనాలో రిలీజైన వన్‌ప్లస్ 10 ప్రో 5జీ (OnePlus 10 Pro 5G) స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో రిలీజ్ చేసింది. చైనాలో వన్‌ప్లస్ 10 ప్రో రిలీజ్ అయినప్పటి నుంచి వన్‌ప్లస్ ఫ్యాన్స్ ఈ మొబైల్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ ఫ్యాన్స్ కోసం తీసుకొచ్చింది వన్‌ప్లస్ ఇండియా. వన్‌ప్లస్ 10 ప్రో 5జీ ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్‌తో రిలీజ్ అయింది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో LTPO 2.0 అమొలెడ్ డిస్‌ప్లే, 48మెగాపిక్సెల్ Sony IMX789 సెన్సార్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్1 (Qualcomm Snapdragon 8 Gen 1) లాంటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్ ఉన్నాయి.

వన్‌ప్లస్ 10 ప్రో 5జీ ధర


వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.66,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.71,999. ఏప్రిల్ 5న సేల్ ప్రారంభం అవుతుంది. ఎస్‌బీఐ కార్డుతో కొంటే రూ.4,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. వోల్కానిక్ బ్లాక్, ఎమరాల్డ్ ఫారెస్ట్ కలర్స్‌లో కొనొచ్చు. వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ జెడ్2 కూడా రిలీజైంది. ధర రూ.1,999. ఏప్రిల్ 5న సేల్ ప్రారంభం అవుతుంది. మ్యాజికో బ్లాక్, బీమ్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. దీంతో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రో రేడియంట్ సిల్వర్ కలర్ కూడా లాంఛైంది. ధర రూ.9,990.

Oppo K10: ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో కే10 సేల్... ఆ బ్యాంకు కార్డులపై డిస్కౌంట్


వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్స్...


వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల LTPO అమొలెడ్ క్యూహెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్యానెల్ ప్రొటెక్షన్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐకూ 9 ప్రో, మోటో ఎడ్జ్ 30 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో ఇదే ప్రాసెసర్ ఉంది.

Poco X4 Pro: రూ.18,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.6,549 ధరకే... ఆఫర్ కొద్దిరోజులే

వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా ఫీచర్స్ చూస్తే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 48మెగాపిక్సెల్ Sony IMX789 ప్రైమరీ సెన్సార్ + 50 మెగాపిక్సెల్ Samsung ISOCELL JN1 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో హాసిల్‌బ్లేడ్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ Sony IMX615 కెమెరా ఉంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 80వాట్ సూపర్ ఫ్లాష్ ఛార్జ్, 50 వాట్ వైర్‌లస్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది.

వన్‌ప్లస్ 10 ప్రో ఆండ్రాయిడ్ 12 + ఆక్సిజన్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మూడేళ్ల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ లభిస్తాయి. బ్లూటూత్ 5.2, వైఫై, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. డ్యూయెల్ నానో సిమ్ సపోర్ట్ లభిస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండటం విశేషం.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Oneplus, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు