చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ మొబైల్ మార్కెట్‌లో గట్టి పోటీ ఎదుర్కొంటోంది. టాప్ కంపెనీలతో కాంపిటీషన్ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ సంస్థతో కొత్త ప్లాన్లను రెడీ చేసింది. త్వరలో వన్‌ప్లస్ 11 (OnePlus 11) సిరీస్ లాంచింగ్‌కు రెడీగా ఉండటంతో, ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోడల్స్ సేల్స్ పెంచే ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వన్‌ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్‌పై బెస్ట్ డీల్ అందిస్తోంది. డిస్కౌంట్ ప్రైస్‌తో వన్‌ప్లస్ 10 ప్రో అమెజాన్‌లో అందుబాటులో ఉంది.
OnePlus 10 Pro 5G ఇండియన్ మార్కెట్‌లోకి 2022 మార్చి 23న లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై కొంతమంది కొనుగోలుదారులు ఇప్పుడు రూ.6000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. దీంతోపాటు రూ.1000 డిస్కౌంట్ కూపన్‌ను కూడా పొందవచ్చు. మరింత తక్కువ ధరకు ఫోన్ సొంతం చేసుకునేలా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
ఆఫర్లు ఇవే
వన్‌ప్లస్ 10 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB వేరియంట్ ధర రూ.66,900. 12GB వేరియంట్ ధర రూ.71,900గా ఉంది. అయితే ఇప్పుడు 8GB వేరియంట్ రూ.61,999కు, 12GB వేరియంట్ రూ.66,999కు అమెజాన్‌లో లిస్ట్ అయ్యాయి. ICICI బ్యాంక్ కస్టమర్లు అయితే, డివైజ్ కొనుగోలుపై రూ.6000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ ఆఫర్లతో 12GB స్మార్ట్‌ఫోన్ వేరియంట్ ధర రూ.59,999కి తగ్గుతుంది. అదనంగా కొనుగోలుదారులు రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.15,000 వరకు ధర తగ్గే అవకాశం ఉంది. ఈ ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది, కస్టమర్లు ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
స్పెసిఫికేషన్స్ ఇవే
వన్‌ప్లస్ 10 ప్రో ఫోన్‌లో 48-మెగాపిక్సెల్ Sony IMX789 సెన్సార్ ఉంది. అల్ట్రా-వైడ్ కెమెరా 50-మెగాపిక్సెల్ Samsung ISOCELL JN1 సెన్సార్‌ను ఉపయోగిస్తుంది. టెలిఫోటో కెమెరా 8-మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో సోనీ IMX615 సెన్సార్‌తో 32-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ డివైజ్ బ్యూటిఫుల్ నేచురల్ కలర్స్‌తో 8K వీడియోను రికార్డ్ చేయగలదు.
65W ఫాస్ట్ ఛార్జింగ్‌కి, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీతో ఫోన్ వస్తుంది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో ఒకరోజుపాటు ఫోన్‌ను సాధారణ అవసరాలకు ఉపయోగించవచ్చు.
వన్‌ప్లస్ 10 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ వోల్కానిక్ బ్లాక్, ఎమరాల్డ్ బ్లాక్ ఫారెస్ట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. 6.7-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది P3 కలర్స్‌కు సపోర్ట్ చేసే LTPO టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది 1Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.
వన్‌ప్లస్ 10 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్‌తో పని చేస్తుంది. గరిష్టంగా 12GB RAM, 256GB స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఆక్సిజన్‌ఓఎస్‌పై రన్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g smart phone, Amazon, ONE PLUS