ONEPLUS 10 PRO 5G LAUNCHES IN INDIA ON MARCH 31 PRICE AND FEATURES ARE DETAILED HERE GH VB
OnePlus 10 Pro 5G: మార్చి 31న భారత్‌లోకి వన్‌ప్లస్ 10 ప్రో 5జీ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే!
ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ వరుస స్మార్ట్ఫోన్ల లాంచింగ్‌తో దూసుకుపోతుంది. వన్‌ప్లస్ మార్చి 31న మరో స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు సిద్దమవుతోంది. మార్చి 31న జరగనున్న లాంచ్ ఈవెంట్లో వన్‌ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్‌ను విడుదల చేయనుంది.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్(One Plus) వరుస స్మార్ట్ఫోన్ల లాంచింగ్‌తో(Launching) దూసుకుపోతుంది. వన్‌ప్లస్ మార్చి 31న మరో స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు సిద్దమవుతోంది. మార్చి 31న జరగనున్న లాంచ్ ఈవెంట్లో వన్‌ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్‌ను విడుదల చేయనుంది. అదే రోజున కంపెనీ భారతదేశం, యూరప్, ఉత్తర అమెరికాలో(North America) వన్‌ప్లస్ బడ్స్ ప్రో రేడియంట్ సిల్వర్ ఎడిషన్‌ను కూడా పరిచయం చేయనుంది. దీనితో పాటు వేగవంతమైన ఛార్జింగ్(Charging), లాంచ్ బ్యాటరీ లైఫ్, మెరుగైన సౌండ్ క్వాలిటీ, బాస్ కోసం పెద్ద డ్రైవర్లతో నిండిన వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జెడ్2ని కూడా కంపెనీ విడుదల చేయనుంది. వన్‌ప్లస్ గ్లోబల్ లాంచింగ్ ఈవెంట్ కోసం వన్‌ప్లస్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఈవెంట్ లైవ్‌ను వన్‌ప్లస్ 10 ప్రో లాంచ్ పేజీ లేదా వన్‌ప్లస్ యూట్యూబ్ ఛానెల్లో చూడవచ్చు.
కాగా, వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 SoC ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో ప్రారంభమైంది. దాదాపు మూడు నెలల తర్వాత భారత మార్కెట్లోకి వస్తుంది. ఈ ఫోన్ భారత్‌లో మోటరోలా ఎడ్జ్ 30 ప్రో, గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 సిరీస్, ఐక్యూ 9 ప్రో వంటి ఆండ్రాయిడ్ ఫోన్లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ అనుభవం మినహా మిగతా ఫీచర్లన్నీ చైనా మోడల్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ 10 ప్రో 5G స్పెసిఫికేషన్లు
వన్‌ప్లస్ 10 ప్రో 6.7 -అంగుళాల QHD+ LTPO డిస్ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,300 nits పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. గరిష్టంగా 12GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీనిలోని 5,000mAh బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. దీని వెనుకవైపు, హాసల్బ్లేడ్ -ఆధారిత బ్యాక్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇది 48 -మెగాపిక్సెల్ సోనీ IMX789 ప్రైమరీ షూటర్, 50 -మెగాపిక్సెల్ శామ్సంగ్ ISOCELL JN1 సెన్సార్, 8- మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ కెమెరాలను అందించింది. సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 32- మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్ కెమెరాను చేర్చింది.
IRCTC:తిరుపతి వెళ్తున్నారా? ఐఆర్సీటీసీలో హోటల్ రూమ్ బుక్ చేయండి ఇలా
ఇక, మార్కెట్లోకి వరుసగా స్మార్ట్ఫోన్లను లాంచింగ్ చేసేందుకు కంపెనీ సిద్దమవుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 లైట్, వన్‌ప్లస్ నార్డ్ 2టీ ఫోన్లను రిలీజ్ చేయనుంది. మరోవైపు, మే నెలలో వన్‌ప్లస్ 10ఆర్, జూలైలో వన్‌ప్లస్ నార్డ్ 3 లేదా వన్‌ప్లస్ నార్డ్ ప్రోని లాంచ్ చేయనుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.