కాబోయే భార్య చనిపోయి ఎనిమిదేళ్లైంది.. తిరిగి ఆమెతో ఇన్నాళ్లకు చాటింగ్.. ఎలా సాధ్యమైంది

కాబోయే భార్య చనిపోయిన 8 ఏళ్ల తరువాత ఆమెతో చాటింగ్

మనిషి తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు.. మరో ప్రపంచాన్ని ఆవిష్కరించవచ్చు.. తాజాగా ఓ వ్యక్తి 8 ఏళ్ల క్రితం చనిపోయిన తన కాబోయే భార్యతో చాట్ చేస్తున్నాడు.. మాట్లాడుతున్నాడు.. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా..?

 • Share this:
  మనిషి మేదస్సుకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే ఏదైనా సాధించొచ్చు.. బ్రహ్మ రాతను కూడా మార్చేస్తున్నారు కొందరు.. మానవుడు సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. చనిపోయిన వారిని కూడా తిరిగి కళ్ల ముందు ఉండేలా చేస్తున్నారు. మానవుడు అనేక సమస్యలకు పరిష్కరాలను సాధించాడు. సాధిస్తునే ఉన్నాడు. ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌ను రూపొందించి పలు విషయాలను మరింత సులభం చేశాడు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ రావడంతో ఐటీ రంగంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. అదే ఏఐ టెక్నాలజీను ఉపయోగించి కెనాడాకు చెందిన ఓ రచయిత చనిపోయిన భార్యను ఏఐ చాట్‌బాట్‌గా ఆమెను తిరిగి వెనక్కి తెచ్చాడు. ఇప్పుడు ఆమెతో హ్యాపీగా చాట్ చేస్తున్నాడు.. మాట్లాడుతున్నాడు.. గతంలో ఆమెతో చెప్పాలి అనుకుని చెప్పలేకపోతున్న అన్ని విషయాలను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఆమె తిరిగి ఇలా తన ముందుకు రావడంతో అతడిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది..

  కెనాడా బ్రాడ్‌ఫోర్డ్‌లో నివసిస్తున్న 33 ఏళ్ల ప్రీలాన్స్‌ రచయిత జాషువా బార్‌బ్యూ తన కాబోయే భార్య జెస్సికా పెరిరా అరుదైన కాలేయ వ్యాధితో 2012లో మరణించింది. జాషువా ఆమె మృతితో మానసికంగా కుంగిపోయాడు. గతేడాది ఏఐ టెక్నాలజీపై పనిచేసే ప్రాజెక్ట్‌ డిసెంబర్‌ అనే వెబ్‌సైట్‌ను సంప్రదించాడు. ప్రాజెక్ట్‌ డిసెంబర్‌ పలు వ్యక్తుల చాట్‌బాట్లను క్రియేట్‌ చేస్తుంది. వెంటనే జాషువా ఆ ప్రాజెక్ట్‌ డిసెంబర్‌ నుంచి సంప్రందిస్తూ వస్తున్నాడు. వారి సూచనలతో ఏఐ చాట్‌బాట్‌ను క్రియేట్‌ చేయించాడు. ప్రాజెక్ట్‌ డిసెంబర్‌ జెస్సికా చాట్‌బాట్‌ను రూపోందించారు. దీంతో అప్పటినుంచి జాషువా చనిపోయిన జెస్సికాతో చాట్‌చేయడం మొదలుపెట్టాడు.

  ఏఐతో చేసిన చాట్‌బాట్‌కు జెస్సికా కోర్ట్నీ పెరీరాగా పేరు పెట్టాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చనిపోయిన జెస్సికాతో మాట్లాడటం మొదలు పెట్టాడు. జెస్సికా చనిపోయి ఎనిమిది సంవత్సరాలైన తిరిగి జేస్సికాతో మాట్లాడటం తనకు ఎంతగానో ఆనందంగా ఉందని జాషువా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.
  Published by:Nagesh Paina
  First published: