హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

హైదరాబాద్ లో One Moto ఎలక్ట్రిక్ హబ్ ప్రారంభం.. అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే

హైదరాబాద్ లో One Moto ఎలక్ట్రిక్ హబ్ ప్రారంభం.. అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే

ప్రారంభిస్తున్న దృశ్యం

ప్రారంభిస్తున్న దృశ్యం

భారతదేశంలో సొగసైన, ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే మొట్టమొదటి బ్రిటిష్ బ్రాండ్ వన్ మోటో దేశంలో తన మొదటి ఎక్స్ పీరియన్స్ హబ్ ను తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో నెలకొల్పింది.

భారతదేశంలో సొగసైన, ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే మొట్టమొదటి బ్రిటిష్ బ్రాండ్ వన్ మోటో దేశంలో తన మొదటి ఎక్స్ పీరియన్స్ హబ్ ను తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో నెలకొల్పింది. ఉత్పత్తులు, సాంకేతికత, దూకుడుగా పురోగమిస్తున్న ఈవీ జీవనశైలికి సంబంధించిన మరింత సమాచారాన్ని కస్టమర్లు తెలుసుకునేందుకు బ్రాండ్ ఏర్పాటు చేసిన ఈ ఎక్స్ పీరియన్స్ హబ్ ఉపయోగపడుతుంది. ఈ హబ్ ను M Cube ఆటోమోటివ్స్ నిర్వహిస్తోంది. ప్రతిష్ఠాత్మక ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ బ్యాంకులు, ప్రత్యేకమైన బ్రాండెడ్ కార్ షోరూమ్స్, జనాలు తరచూ వచ్చే ఆహార కేంద్రాలకు నెలువుగా ఉన్న హైదరాబాద్ లోని మణికొండ-రాయదుర్గం రోడ్ లో ఈ హాబ్ వ్యూహాత్మకంగా కొలువుదీరింది. తెలంగాణలో ఈవీల కోసం విశేష కృషి చేస్తున్న ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం I&C, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ISL 2022 ఛాంపియన్స్ హైదరాబాద్ FC ప్రిన్సిపాల్ ఓనర్ శ్రీ వరుణ్ త్రిపురనేని సమక్షంలో ఈ ఎక్స్ పీరియన్స్ హబ్ ప్రారంభించబడింది. Mcube ఆటోమోటివ్స్ ప్రైవేట్ డీలర్ షిప్ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఎక్స్ పీరియన్స్ హబ్ దిగువ పేర్కొన్నవి సహ అన్ని ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శిస్తుంది.

-కమ్యూటా-టాప్ స్పీడ్-75 కేఎంపీహెచ్; రేంజ్-సింగిల్ ఛార్జ్ పై 100 కిమీ; ధర రూ.1,30,000 (9 రంగుల్లో లభ్యం)

-బైకా-టాప్ స్పీడ్-75 కేఎంపీహెచ్; రేంజ్ సింగిల్ ఛార్జ్ పై 100 కిమీ; ధర-రూ.1,91,000(9 రంగుల్లో లభ్యం)

-ఎలక్ట్రా-టాప్ స్పీడ్-కేఎంపీహెచ్; రేంజ్-సింగిల్ ఛార్జ్ పై 150 కిమీ: ధర రూ.1,99,999 (9 రంగుల్లో లభ్యం)

బ్రాండ్ మొదటి ఎక్స్ పీరియన్స్ హబ్ ప్రారంభించిన సందర్భంగా వన్ మోటో ఇండియా వ్యవస్థాపకుడు & ప్రమోటర్ మహమ్మద్ ముజమ్మిల్ రియాజ్ మాట్లాడుతూ.. బ్రాండ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది చాలా వేగంగా ప్రయాణించింది. ఇప్పుడు మరింత దూకుడుగా ముందుగా సాగనుందని అన్నారు

First published:

Tags: Electric bike, Electric Scooter

ఉత్తమ కథలు