మరికొన్ని రోజుల్లో వాలెంటైన్స్ డే (Valentine's Day) రాబోతుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వాలెంటైన్స్ డే హడావిడి ప్రారంభమైంది. కొందరు తమ మనసు దోచుకున్నవారికి బహుమతులు సెలక్ట్ చేస్తుంటే, మరికొందరు డేటింగ్ ప్రపోజల్‌కు రెడీ అవుతుంటారు. ఈ వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రముఖ డేటింగ్ యాప్ టిండర్(Tinder)తన యూజర్ల కోసం కొత్త సెక్యూరిటీ ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్స్ ద్వారా అవతలి వ్యక్తులతో ఎలా వ్యవహరించాలనే దానిపై మరింత నియంత్రణ లభించనుంది. డేటింగ్ యాప్ టిండర్ ప్రధానంగా ఇన్‌కాగ్నిటో(Incognito), ప్రొఫైల్ బ్లాక్, లాంగ్ ప్రెస్ రిపోర్టింగ్, అప్‌డేట్స్ టూ డస్ దిస్ బాదర్ యూ?, ఆర్ యూ ష్యూర్? వంటి సెక్యూరిటీ ఫీచర్స్‌ను అందిస్తోంది.
* ఇన్‌కాగ్నిటో
డేటింగ్ యాప్‌లోని తాజా ఫీచర్స్‌లో ఇన్‌కాగ్నిటో మోడ్ ఒకటి. ఇన్‌కాగ్నిటో మోడ్‌లో కూడా యూజర్లు లైక్, నోప్(Nope) చేయవచ్చు. అయితే యూజర్ లైక్ చేసిన వారికి మాత్రమే రెకమెండేషన్స్‌లో కనిపిస్తారు. ఈ ఫీచర్ టిండర్ యాప్‌లో ప్రొఫైల్స్‌ను స్క్రోల్ చేస్తున్నప్పుడు తమను ఎవరు చూడాలనే దానిపై యూజర్లకు కంట్రోల్ లభిస్తుంది.
* ప్రొఫైల్స్ బ్లాక్
డేటింగ్ యాప్ టిండర్‌లో తాజాగా ప్రొఫైల్‌లను బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా యూజర్లు ఎవరిని చూడాలనుకుంటున్నారో ఎంపిక కూడా చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌తో ప్రొఫైల్స్ మ్యాచ్ కాకముందు మెంబర్స్ వాటిని బ్లాక్ చేయవచ్చు. దీంతో ఆ ప్రొఫైల్స్ ఇక మళ్లీ కనిపించవు. కాంటాక్ట్‌లను బ్లాక్ చేయడం, రిపోర్ట్ క్రియేట్ చేయడాన్ని బ్లాక్ చేయడం వంటి వాటికి అదనంగా ఈ కొత్త ఫీచర్‌ను టిండర్ తీసుకొచ్చింది.
* లాంగ్ ప్రెస్ రిపోర్టింగ్
టిండర్‌లో వచ్చిన మరో సేఫ్టీ ఫీచర్ ‘లాంగ్ ప్రెస్ రిపోర్టింగ్’. యూజర్లు ఇప్పుడు చాట్‌లో అభ్యంతరకరమైన మెసేజస్‌ను ట్యాప్, హోల్డ్ చేసి నేరుగా రిపోర్ట్ చేయవచ్చు.
* మరిన్ని లాంగ్వేజ్ సపోర్ట్
డజ్ దిస్ బాదర్ యూ?(Does This Bother You?), ఆర్ యూ షూర్(Are You Sure?) అనే మరో రెండు సెక్యూరిటీ ఫీచర్స్‌ను టిండర్ పరిచయం చేసింది. డేటింగ్ యాప్ ఈ ఫీచర్‌లకు మరిన్ని లాంగ్వేజ్ సపోర్ట్‌తో తీసుకొచ్చింది. ఈ ఫీచర్ టిండర్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న విద్వేషపూరిత ప్రసంగం, లైంగిక వేధింపులకు సంబంధించిన పదాలను వర్గీకరిస్తుంది.
* ముందుగా అలర్ట్
Are You Sure? అనే ఫీచర్.. అవగాహన లేనివారు ఏదైనా అభ్యంతరకరమైన పదాలను మెసేజ్ ద్వారా ఇతరులకు పంపే ముందు ఇది అలర్ట్ చేస్తుంది. ఈ సందర్భంలో మెసేజ్‌లను పంపడాన్ని 10 శాతం కంటే ఎక్కువ తగ్గిస్తుంది. అదేవిధంగా.. ఇది మిమ్మల్ని బాధపెడుతుందా?(Does This Bother You?) అనే ఫీచర్ అనుచిత సంభాషణలను రిపోర్ట్ చేయమని సభ్యులను ప్రోత్సహిస్తుంది. నిబంధనలను ఉల్లంఘించిన సభ్యులపై చర్య తీసుకోవడంలో ఈ ఫీచర్ కీలకంగా మారుతుంది.
* నో మోర్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం
గృహ హింస, లైంగిక వేధింపులను తగ్గించడానికి, ఆరోగ్యకరమైన సిరీస్ డేటింగ్ గైడ్స్ విడుదల చేయడంలో అంకితమైన ఫౌండేషన్ ‘నో మోర్’తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు డేటింగ్ యాప్ టిండర్ వెల్లడించింది. డేటింగ్ ప్రయాణంలోని ప్రతి దశలో ఈ గైడ్స్ ఉపయోగపడతాయని పేర్కొంది. అంతేకాకుండా డేటింగ్‌లో హద్దులను పాటించేలా చేయడంలో కీలకంగా ఉంటాయని టిండర్ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dating, Dating App, Tech news, Valentines Day 2023