Robbery: దోపిడీ దొంగల కాల్పులు... బుల్లెట్‌ను అడ్డుకున్న మోటోరోలా స్మార్ట్‌ఫోన్

Robbery: దోపిడీ దొంగల కాల్పులు... బుల్లెట్‌ను అడ్డుకున్న మోటోరోలా స్మార్ట్‌ఫోన్ (Image for representation/Shutterstock )

Robbery | తుపాకీతో కాల్పులు జరిపితే ప్రాణాలు పోయే ఘటనలే ఎక్కువ. కానీ బ్రెజిల్‌లో జరిగిన ఓ కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి జేబులో ఉన్న స్మార్ట్‌ఫోన్ అతని ప్రాణాలు కాపాడింది.

  • Share this:
    స్మార్ట్‌ఫోన్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. దోపిడీ దొంగలు ఫైరింగ్ చేస్తే బుల్లెట్ శరీరంలోకి దిగకుండా స్మార్ట్‌ఫోన్ అడ్డుకుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ వ్యక్తి వాడే స్మార్ట్‌ఫోన్ (Smartphone) ఆ సమయంలో బుల్లెట్ ప్రూఫ్‌లా పనిచేసింది. బ్రెజిల్‌లో జరిగిన ఘటన ఇది. ఓ వ్యక్తి వెళ్తుండగా దోపిడీ దొంగలు అడ్డుకున్నారు. అతడిని దోచుకోవడానికి (Robbery) కాల్పులు జరిపారు. మామూలుగా అయితే ఆ కాల్పుల్లో అతని ప్రాణాలు పోవాలి. కానీ బుల్లెట్ శరీరంలోకి దిగకుండా అతని దగ్గర ఉన్న స్మార్ట్‌ఫోన్ అడ్డుకోవడం విశేషం. దోపిడీ దొంగలు పారిపోయిన తర్వాత జేబులోంచి స్మార్ట్‌ఫోన్ తీసి చూస్తే బుల్లెట్‌ తగిలి ఆ స్మార్ట్‌ఫోన్ బాగా దెబ్బతిన్నది. ఆ స్మార్ట్‌ఫోన్‌ను అతను ఐదేళ్ల క్రితం కొన్నాడు.

    Xiaomi 11 Lite 5G NE: రూ.26,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.8299 ధరకే కొనండి ఇలా

    ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ఫోన్ మోడల్ చూస్తే అది మోటోరోలా జీ5 మొబైల్. ఐదేళ్ల క్రితం కొన్నాడు. మొబైల్ పాతబడిపోయినా ఐదేళ్లుగా అదే స్మార్ట్‌ఫోన్ వాడుతున్నాడు. అంతేకాదు... ఆ స్మార్ట్‌ఫోన్‌కు మార్వెల్ కామిక్స్‌లో సూపర్ హీరో, ఫిక్షనల్ క్యారెక్టర్ హల్క్ క్యారెక్టర్‌తో ఉన్న మొబైల్ కవర్ ఉండటం విశేషం. సూపర్ హీరో హల్క్ అతని ప్రాణాలు కాపాడాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    WhatsApp Tricks: వాట్సప్‌లో ఈ మార్పులు కనిపించాయా? అయితే మిమ్మల్ని ఎవరో బ్లాక్ చేసినట్టే

    బ్రెజిల్‌లో జరిగిన ఈ దోపిడీ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటనలో బుల్లెట్ తగిలి స్మార్ట్‌ఫోన్ బాగానే డ్యామేజ్ అయింది. స్క్రీన్ మొత్తం పగిలిపోయింది. స్మార్ట్‌ఫోన్ యూజర్‌కు ప్రాణాపాయం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బాధితుడిని చికిత్స కోసం పెట్రోలినాలోని యూనివర్సిటీ ఆస్పత్రిలో చేర్చారు. ఇటీవల మోటోరోలా మాత్రమే కాదు... ఇతర కంపెనీలు రిలీజ్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే మోటో జీ5 చాలా లావుగా ఉంటుంది.

    WhatsApp: అలర్ట్... ఈ తప్పు చేస్తే వాట్సప్ బ్లాక్ అయిపోతుంది జాగ్రత్త

    స్మార్ట్‌ఫోన్లు మనుషుల ప్రాణాలు కాపాడిన ఘటనలు చూస్తే ఇదే కొత్త కాదు. కొన్నేళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు నోకియా స్మార్ట్‌ఫోన్ కాల్పుల్లో బుల్లెట్‌ను అడ్డుకుంది. మరో ఘటనలో హాంగ్ కాంగ్‌లో గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ కూడా బుల్లెట్‌ను అడ్డుకొని ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది.
    Published by:Santhosh Kumar S
    First published: