OLA S1 PRO SWITCHES ON REVERSE MODE AUTOMATICALLY USER COMPLAINS OLA THROUGH SOCIAL MEDIA GH SK
Ola S1 Pro: ఆటోమేటిక్‌గా రివర్స్ మోడ్‌లోకి స్కూటర్.. ఓలా..! ఇలా అయితే ఎలా.?
ప్రతీకాత్మక చిత్రం (image: Ola Electric)
OLA electric Scooter: ఓలా స్కూటర్స్‌లో సాంకేతిక సమస్యలు బయటపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓలా ఎలక్ట్రిక్ బైక్ కాలిపోవడం ఎవరూ మర్చిపోలేరు. అంతలోనే మరో డేంజరస్ సాఫ్ట్వేర్ గ్లిచ్ (Software Glitch) బయటపడింది.
Ola S1 Pro : ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్స్ (Electric Scooters) తయారీదారు ఓలా (Ola electric scooter) కంపెనీకి ప్రత్యేక ఇంట్రో అవసరం లేదు. ఇది రివర్స్ మోడ్‌లో ఓలా స్కూటర్లను అన్బిలీవబుల్ స్పీడ్‌తో నడపొచ్చు అంటూ కొన్ని నెలల క్రితం ఓ టీజర్‌ను రిలీజ్ చేసి అందరిలో హైప్ పెంచింది. ఐతే కొన్ని రోజులుగా ఓలా స్కూటర్స్‌లో సాంకేతిక సమస్యలు బయటపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓలా ఎలక్ట్రిక్ బైక్ కాలిపోవడం ఎవరూ మర్చిపోలేరు. అంతలోనే మరో డేంజరస్ సాఫ్ట్వేర్ గ్లిచ్ (Software Glitch) బయటపడింది. సాఫ్ట్వేర్ లోపం వల్ల ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) ఆటోమేటిక్‌గా రివర్స్ మోడ్‌లో వెళ్లినట్లు ఒక రైడర్ ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. ఈ ట్వీట్ థ్రెడ్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ట్వీట్ చేసి నాలుగు రోజులు గడుస్తున్నా దీనిపై ఓలా స్పందించకపోవడం గమనార్హం. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఇది చాలా డేంజరస్ అంటూ ఓలాపై విమర్శలు గుప్పిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే, ఏప్రిల్ 5న @Themangofellow అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓలా ఎస్1 ప్రో రైడర్ వరుస ట్వీట్స్ చేశాడు. "వారం రోజులుగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతున్నాను. అయితే ఒకరోజు నేను వెళ్తున్న రోడ్డు మధ్యలో ఓ కారు అడ్డంగా పార్క్ చేసి ఉంది. దీంతో నేను నా ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్త వెనక్కి లాగాను. అంతే అది వెంటనే రివర్స్ మోడ్ ఆన్ చేసింది. ఆ తర్వాత నేను రైసింగ్ ఇలా ఇచ్చానో లేదో అది రివర్స్ డైరెక్షన్ లో దూసుకెళ్ళింది. దీంతో నేను కింద పడ్డాను. నాకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ అది బిజీ రోడ్డు కాదు. ఈ సమస్య గురించి ఓలా సంస్థకి చెబితే.. వారం రోజుల తర్వాత దాన్ని బాగు చేసి ఇచ్చారు. కానీ ఇలాంటి ప్రాణాంతకమైన లోపాలున్న స్కూటర్ ని మళ్లీ రైడ్ చేసేంత ధైర్యం నాకు లేదు. ఇదే ప్రమాదం నా భార్య, పిల్లలు ఉన్నప్పుడు జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకే దీన్ని అమ్మేశాను. అయ్యా భవిష్ అగర్వాల్ గారు, సైక్లింగ్, డాగ్ పిక్చర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసే బదులు ఎవరి ప్రాణాలు పోకముందే ఇలాంటి సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వండి" అని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.
Used @OlaElectric scooter for a week. Then one day,there was a car parked haphazardly in the middle of the road. I just pulled the scooter back and it activated Reverse mode.. When I accelerated further, it went in reverse direction (1/n)
అయితే ఈ ట్వీట్ పై స్పందిస్తూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఓలా కంపెనీ స్కూటర్లలో ఇలాంటి డెడ్లీ సాఫ్ట్వేర్ గ్లిచెస్ ఉండటం చాలా దురదృష్టకరం. ఓలా కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుందని కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే ఈ విషయంపై ఓలా ఎలక్ట్రిక్ రీజినల్ సర్వీస్ హెడ్ స్పందించారని.. సమస్య గురించి పూర్తిగా వారికి వివరించినట్లు ఆ వ్యక్తి మరో అప్డేట్ని ట్వీట్ చేశాడు. అనంతరం తన స్కూటర్లోని సమస్యను పరిష్కరించినట్లు తెలిపాడు. ఐతే ఇలాంటి సమస్యలు రాకుండా ఓలా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఓలాలో రోజురోజుకో సమస్య బయటపడుతోందని..వాటిపై దృష్టించాలని సూచిస్తున్నారు.
సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లలో రివర్స్ మోడల్ స్పీడ్ లిమిట్ గంటకి మూడు నుంచి ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుంది. స్పీడ్ లిమిట్ ఎంత తక్కువగా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం అంత తక్కువగా ఉంటుందని వాహన తయారీ దారులు భావిస్తారు. అయితే ఒక యూట్యూబ్ వీడియో ప్రకారం, ఓ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ స్పీడ్ లిమిట్ ప్రమాదకర స్థాయిలో ఉంది. ఈ విషయంపై కూడా ఓలా కామెంట్ చేసిన దాఖలాలు లేవు. ఇక ఇటీవల ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో దగ్ధమయిన విషయం తెలిసిందే. అందులో ఏం సమస్యలు ఉన్నాయో ఇప్పటివరకు ఓలా వివరించలేదు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.