OLA S1 ELECTRIC SCOOTER 5 THINGS THAT YOU NEED TO KNOW BEFORE GETTING ONE JNK GH
Ola S1 Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తున్నారా?.. అయితే, ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
ఓలా బైక్ కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి..
ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఈ ఏడాది అక్టోబర్ 15న ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రో అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇవి భారీ ఎత్తున అమ్ముడై వాహన రంగ చరిత్రలో రికార్డు సృష్టించాయి. కేవలం 24 గంటల్లో లక్షకుపైగా బుకింగ్స్ వచ్చాయంటే ఓలా ఎస్ 1, ఎస్1 ప్రోలకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric Scooter) తయారీ సంస్థ ఓలా (Ola) ఎలక్ట్రిక్ ఈ ఏడాది అక్టోబర్ 15న ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రో అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇవి భారీ ఎత్తున అమ్ముడై వాహన రంగ (Automobile) చరిత్రలో రికార్డు సృష్టించాయి. కేవలం 24 గంటల్లో లక్షకుపైగా బుకింగ్స్ వచ్చాయంటే ఓలా ఎస్ 1, ఎస్1 ప్రోలకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ స్కూటర్ల ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓలా ఎస్ 1, ఎస్1 ప్రో కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన ఐదు అత్యంత ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.
1. డిజైన్, కలర్స్
ఓలా ఎస్ 1 స్కూటర్ ను ఎటెర్రా యాప్‌స్కూటర్ (Eterra Appscooter) ఆధారంగా రూపొందించారు. ఇది ఓలా కొంతకాలం కిందట తన ఆధీనంలోకి తీసుకున్న డచ్ కంపెనీ. ముందు వైపు ఉన్న ఓలా బ్యాడ్జ్, వెనుక ఉన్న ఎస్1 ప్రో బ్యాడ్జ్ తప్ప మిగతా డిజైన్ అంతా కూడా ఎటెర్రా యాప్‌స్కూటర్ ను పోలి ఉంటుంది. దీని డిజైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఓవర్ కర్వీ డిజైన్‌తో స్కూటర్‌లో కొన్ని క్రీజ్‌లు ఉంటాయి. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో పాటు టెయిల్‌లైట్‌లు కూడా ఉంటాయి. ఈ స్కూటర్ లో క్యూట్ గా కనిపించే 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ (alloy wheels) అందించారు. ఇది ముందువైపు నిలువుగా, వెనుకవైపు అడ్డంగా ఉండే మోనోషాక్స్ సాయంతో స్మూత్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఎస్ 1 స్కూటర్ మొత్తం 5 కలర్ ఆప్షన్‌లతో.. ఎస్ 1 ప్రో మొత్తం 10 కలర్ ఆప్షన్‌లతో వస్తుంది. స్కూటర్‌పై పెయింట్ ఫినిషింగ్ ఆకర్షణీయంగా ఉంటుంది.
భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా ఎస్1 సమగ్ర ఫీచర్స్ తో వస్తుంది. రైడింగ్ మోడ్‌లతో ప్రారంభించి, ఎస్ 1 నార్నల్, స్పోర్ట్ మోడ్‌ను పొందుతుంది. అయితే ఎస్1 ప్రో మాత్రం అదనంగా హైపర్ మోడ్‌ను పొందుతుంది. అంతేకాదు, కీ-లెస్(key less) ఫీచర్ తో ఈ స్కూటర్లను లాక్, అన్‌లాక్ చేయొచ్చు. ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసి స్కూటర్ ను ఆపరేట్ చెయ్యొచ్చు. మీరు దగ్గరికి రాగానే స్కూటర్ ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవుతుంది. దూరం వెళ్ళిపోగానే స్కూటర్ ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది. ఇక, ఎస్1 వివిధ సెటప్‌లతో మల్టీపుల్ డ్రైవర్ ప్రొఫైల్‌లను కూడా మెయింటైన్ చేయగలదు. భవిష్యత్తులో ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్‌లలో జియో-ఫెన్సింగ్, పేరెంటల్ కంట్రోల్స్ వంటి అదనపు ఫీచర్‌లను జోడిస్తామని ఓలా తెలిపింది. కనెక్టివిటీ, జీపీఎస్ ఫీచర్‌ల వంటివే కాకుండా ఇందులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.. బూట్ ఓపెన్, క్లోజ్ వంటి ప్రాథమిక విధులను ఆపరేట్ చేయగలదు.
ఎస్ 1 స్కూటర్ 2.97 kWh బ్యాటరీతో వస్తే.. ఎస్1 ప్రో 3.98kWh బ్యాటరీతో వస్తుంది. అయితే బ్యాటరీలో ఉండే సెల్స్ తప్ప మిగతావన్నీ భారతదేశంలో తయారు చేసినవే. హైపర్ మోడ్ సాయంతో ఓలా ఎస్ 1 ప్రో గంటకి 115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. హైపర్ మోడ్ లో టార్క్ అద్భుతంగా ఉంటుంది. ఎస్ 1 మాత్రం స్పోర్ట్స్ మోడ్ లో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
4. రేంజ్, ఛార్జింగ్
2.97kWh బ్యాటరీతో వచ్చే ఎస్1 స్కూటర్ సింగిల్ ఛార్జ్‌పై 121 కి.మీ వెళ్లగలదు. ఎస్1 ప్రో 181 కి.మీ వరకు వెళ్లగలదు.
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.