హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Ola Electric Car: ఓలా అద్భుతమైన ఎలక్ట్రిక్ కారు.. త్వరలోనే లాంచింగ్

Ola Electric Car: ఓలా అద్భుతమైన ఎలక్ట్రిక్ కారు.. త్వరలోనే లాంచింగ్

భారతదేశంలో ఓలా త్వరలో ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేయబోతోంది.

భారతదేశంలో ఓలా త్వరలో ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేయబోతోంది.

మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicle) హవా నడుస్తోంది. వీటిపై ప్రభుత్వాలు రాయితీలు ఇస్తుండటంతో కొత్త స్టార్టప్ కంపెనీలు వరుసగా ప్రొడక్ట్స్‌ లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బెంగళూరు బేస్డ్ EV స్టార్టప్ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఫోర్ వీల్ ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ తయారీపై దృష్టి పెట్టింది.

ఇంకా చదవండి ...

మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. వీటిపై ప్రభుత్వాలు రాయితీలు ఇస్తుండటంతో కొత్త స్టార్టప్ కంపెనీలు వరుసగా ప్రొడక్ట్స్‌ లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బెంగళూరు బేస్డ్ EV స్టార్టప్ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఫోర్ వీల్ ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ తయారీపై దృష్టి సారించింది. ఇప్పటికే ఈ సంస్థ ఈ-స్కూటర్లతో కస్టమర్ల దృష్టిని ఆకర్షించింది. ఇండియన్ మార్కెట్లోకి తమ బ్రాండ్ నుంచి మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ S1ను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ ఎలక్ట్రిక్ 4-వీలర్ ప్రొడక్షన్‌ను ఇండియాలో ప్రారంభించేందుకు కృషి చేస్తోంది.

ఈ కంపెనీ జూన్ 19, ఆదివారం నాడు ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో ‘ఓలా కస్టమర్ డే’ని నిర్వహించింది. ఈ సందర్భంగా కొత్త ‘MoveOS 2’ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రిలీజ్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యూజర్లకు మరిన్ని ఫీచర్లు అందించేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ ఈవెంట్ సందర్భంగా రాబోయే రోజుల్లో లాంచ్ చేయనున్న ప్రొడక్ట్స్‌కు సంబంధించి ఓలా ఒక చిన్న వీడియో రిలీజ్ చేసింది. దీంట్లో ఎలక్ట్రిక్ కారు గురించి కూడా వివరాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: ఆ మూడు బ్యాంక్‌ల పోటీతో.. ఖాతాదారులకు లాభాల పంటే..! భారీగా పెరిగిన ఎఫ్‌డీ వడ్డీ రేట్లు


ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ సెడాన్ తయారీపై దృష్టి సారిస్తోందని వీడియో ద్వారా గుర్తించవచ్చు. ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ఈ కారు డిజైన్ మాక్-అప్స్‌ గురించి ట్వీట్ చేశారు. ఈ కారు ఫోటోలను గమనిస్తే.. ఎక్స్‌టీరియర్ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. ఫ్రంట్ వీల్స్ హబ్స్ వద్ద ఓలా బ్యాడ్జ్‌ ఉన్నట్లు ఫోటోల్లో కనిపిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్‌కు నాలుగు ఫ్లష్-ఫిట్టింగ్ డోర్లు, డోర్ హ్యాండిల్స్ లేని ఫినిషింగ్, ఏరో-ఆప్టిమైజ్డ్ వీల్స్, బ్లాక్ కలర్ రూఫ్, కారు బాడీ చుట్టూ ఎల్‌ఈడీ లైట్ బార్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఓలా నుంచి రానున్న ఈ ఫస్ట్ ఆల్-ఎలక్ట్రిక్ కారులో 70-80 kWh కెపాసిటీతో పెద్ద బ్యాటరీ ఉంటుంది. S1, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే ఈ ఎలక్ట్రిక్ కారు కూడా మంచి రేంజ్ ఇవ్వాలని బ్రాండ్ లక్ష్యంగా పెట్టుకుంది. ధరల పరంగా చూస్తే.. ఓలా ఎలక్ట్రిక్ సెడాన్ ధర సుమారు రూ. 25 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హై డ్రైవింగ్ రేంజ్‌తో పాటు ఈ కారు లేటెస్ట్ టెక్ ఫీచర్లతో రానున్నట్లు తెలుస్తోంది.

ఎప్పుడు లాంచ్ కావచ్చు?

ఓలా ఇప్పటి వరకు ఈ ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ లాంచ్ గురించి సమాచారం వెల్లడించలేదు. అయితే రాబోయే రెండు నెలల్లో ఈ కారు గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తానని ఓలా సీఈఓ ప్రకటించారు. కంపెనీ ఈ కారు గురించి ఆగస్టు 15న పూర్తి వివరాలు బహిర్గతం చేసే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు వచ్చే ఏడాది మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై కంపెనీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

First published:

Tags: Auto News, Electric Car, Ola, Ola Electric Car

ఉత్తమ కథలు