• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • OLA ELECTRIC SCOOTER EXPECTED TO LAUNCH IN INDIA IN THE SECOND HALF OF 2021 NS GH

Ola electric scooter: ప్రారంభమైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్టింగ్.. ఇండియాలో లాంచింగ్ ఎప్పుడంటే..

Ola electric scooter: ప్రారంభమైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్టింగ్.. ఇండియాలో లాంచింగ్ ఎప్పుడంటే..

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (Image source: Shifting Gears)

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరికొన్ని రోజుల్లో భారత్‌లో విడుదల కానుంది. ఓలా క్యాబ్స్ కంపెనీ నుంచి రానున్న ఈ పర్యావరణహితమైన స్కూటర్‌ టెస్టింగ్ ఇటీవల ప్రారంభమైంది.

  • Share this:
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరికొన్ని రోజుల్లో భారత్‌లో విడుదల కానుంది. ఓలా క్యాబ్స్ కంపెనీ నుంచి రానున్న ఈ పర్యావరణహితమైన స్కూటర్‌ టెస్టింగ్ ఇటీవల ప్రారంభమైంది. మన దేశంలో ఇలాంటి ఎలక్ట్రిక్ బైక్‌లను తయారు చేయడానికి ఓలా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. ఈ సంస్థ నెదర్లాండ్స్‌లో తయారు చేసిన ఎటర్గో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధారంగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-స్కూటర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఓలా ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే సిమెన్స్ కంపెనీతో కలిసి తమిళనాడులో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.2,400 కోట్ల వరకు పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్లాంట్ నుంచి ప్రతి సంవత్సరం 20 లక్షల మేడ్ ఇన్ ఇండియా ఓలా స్కూటర్లను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకోవడం విశేషం.

ఓలా ఎలక్ట్రిక్ సూటర్‌ ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి. ఇది చూడటానికి ఎటెర్గొ యాప్‌ స్కూటర్ మాదిరిగానే ఉంది. సింగిల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో దీన్ని తయారు చేశారు. మంచి బాడీవర్క్, ఫినిషింగ్, కాంపాక్ట్ సైజుతో ఆకట్టుకుంటోంది. ఎక్విప్‌మెంట్, స్టైలింగ్ పరంగా ఇంటర్నేషనల్ ఎడిషన్‌ మాదిరిగానే ఉంది.

ఎటెర్గో మాదిరిగానే...
భారత్‌లో విడుదలయ్యే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటర్గో యాప్ స్కూటర్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇండియన్ మార్కెట్‌కు తగ్గట్టు ఎటర్గో యాప్ స్కూటర్‌కు కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. దీంట్లో బనానా షేప్డ్ రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ధరల ఆధారంగా వివిధ రకాల బ్యాటరీ సామర్థ్యాలతో, ప్రత్యేకమైన వేరియెంట్లను ఓలా తయారు చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై గంటకు 100కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, అత్యధికంగా 240 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ వివరాలను ఓలా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసే అవకాశం ఉంది. దీని ధర రూ.1లక్ష లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అథర్ 450ఎక్స్, బజాజ్ చేతక్, టివిఎస్ ఐక్యూబ్ వంటి స్కూటర్లతో కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పోటీ పడనుంది.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు