Ola Electric Scooter: ఓలా కొత్త ఆలోచన.. ఈ తరహా మోడల్ ను అమలు చేస్తున్న మొదటి కంపెనీగా ఓలా అవతరణ..

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (image: ola electric)

ప్రముఖ క్యాబ్​ సేవల సంస్థ ఓలా ఇటీవల ఎలక్ట్రిక్​ వాహన రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఓలా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్​ స్కూటర్​ను లాంచ్​ చేసి బుకింగ్స్​ను కూడా ప్రారంభించింది. ఇది మార్కెట్​లోకి రాకముందే అత్యంత ప్రజాదరణ కలిగిన ఎలక్ట్రిక్​ స్కూటర్​గా నిలిచింది. అయితే ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ను బుక్​ చేసుకున్న కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.

  • Share this:
ప్రముఖ క్యాబ్​ సేవల సంస్థ ఓలా ఇటీవల ఎలక్ట్రిక్​ వాహన రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఓలా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్​ స్కూటర్​ను లాంచ్​ చేసి బుకింగ్స్​ను కూడా ప్రారంభించింది. ఇది మార్కెట్​లోకి రాకముందే అత్యంత ప్రజాదరణ కలిగిన ఎలక్ట్రిక్​ స్కూటర్​గా నిలిచింది. బుకింగ్స్ ఓపెన్​ చేసిన కేవలం 24 గంటల్లోనే 1 లక్షకి పైగా ఆర్డర్లను స్వీకరించి రికార్డు సృష్టించింది. అయితే ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ను బుక్​ చేసుకున్న కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కంపెనీ. డీలర్​షిప్ సెంటర్ల ద్వారా కాకుండా నేరుగా కస్టమర్ల ఇంటికే వాహనాలను డెలివరీ చేస్తామని తెలిపింది. ఈ వాహనాల హోమ్​ డెలివరీ కోసం ‘డైరెక్ట్​ టు కన్స్యూమర్​ సేల్స్​ మోడల్​’ను ఉపయోగించనుంది. దీని ప్రకారం, కంపెనీకి కస్టమర్లకు మధ్య డీలర్​షిప్​ సెంటర్ల ప్రస్తావనే ఉండదు. కొనుగోలు ప్రక్రియ అంతా కంపెనీ, కస్టమర్​కు మధ్య మాత్రమే జరుగుతుంది. డీలర్​షిప్​ నెట్​వర్క్​ అవసరం లేకుండానే నేరుగా కస్టమర్లకు ఈ స్కూటర్లను డెలివరీ చేస్తుంది. ఇందుకోసం ఓలా కంపెనీ కొన్ని వేర్వేరు లాజిస్టిక్స్​ డిపార్ట్​మెంట్లను ఏర్పాటు చేసింది.

దీని ద్వారా ఈ-స్కూటర్​ కొనుగోళ్లను ప్రాసెస్​ చేయనుంది. కస్టమర్లు తమ డాక్యుమెంట్లు, లోన్​ అప్లికేషన్​ సంబంధిత అన్ని పత్రాలను ఆన్​లైన్​లోనే సమర్పించాల్సి ఉంటుంది.లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్​ బెంజ్​, జాగ్వార్​, లాండ్​ రోవర్​ సంస్థలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇవి నేరుగా తమ వాహనాలకు కస్టమర్ల ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నాయి. అయితే ద్విచక్ర వాహన రంగంలో ఈ తరహా మోడల్​ను అమలు చేస్తున్న మొదటి కంపెనీగా ఓలా అవతరించింది.

రూ. 499లతో ప్రీ​ బుకింగ్​..
ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఎస్​ 1 రేంజ్​ టాపింగ్​, ఎస్​1 ప్రో అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్కూటర్​ మాటే బ్లాక్​, మాటే పింగ్​, మాటే బ్లూ, వైట్​ సహా మరిన్ని కలర్​ ఆప్షనల్లో అందుబాటులో ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే.. ఇది రూ.80 వేల నుంచి రూ.1.1 లక్షల మధ్య అందుబాటులో ఉంటుంది. కంపెనీ జూలై 15న ఓలా సిరీస్​ ఎస్​ కోసం​ బుకింగ్స్​ ప్రారంభించింది. కేవలం రూ.499 చెల్లించి ఓలా అధికారిక వెబ్​సైట్​ ద్వారా ఈ-స్కూటర్​ను బుక్​​ చేసుకోవచ్చు. మీ బుకింగ్​ను ఎప్పుడైనా రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. బుకింగ్​ కోసం http: //olaelectric.com వెబ్​సైట్​లోకి వెళ్ళి మీ ఫోన్ నంబర్​తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ / డెబిట్ కార్డులు, యుపిఐ, ఈ–వాలెట్లు లేదా ఓలా మనీ ఉపయోగించి రూ. 499 బుకింగ్​ ఫీజు చెల్లించవచ్చు. అనంతరం మీ బుకింగ్​ను ప్రాసెస్​ చేసి నేరుగా మీ ఇంటి వద్దకే వాహనాన్ని డెలివరీ చేస్తారు.
Published by:Veera Babu
First published: