హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Ola Test Rides: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరో ఘనత.. డెలివరీకి ముందే రికార్డులు

Ola Test Rides: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరో ఘనత.. డెలివరీకి ముందే రికార్డులు

ప్ర‌తీకాత్మ‌క చిత్రం (image: ola electric)

ప్ర‌తీకాత్మ‌క చిత్రం (image: ola electric)

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric Scooter) ఇటీవల ఎస్1, ఎస్1 ప్రో మోడళ్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ బుకింగ్స్లో (Ola Online Booking) ఈ రెండు మోడళ్లకు గణనీయమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇంకా చదవండి ...

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric Scooter) ఇటీవల ఎస్1, ఎస్1 ప్రో మోడళ్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ బుకింగ్స్లో (Ola Online Booking) ఈ రెండు మోడళ్లకు గణనీయమైన రెస్పాన్స్ వచ్చింది. తక్కువ సమయంలోనే 10 లక్షల బుకింగ్స్ నమోదు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా, ఓలా ఎలక్ట్రిక్ మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటివరకు 20,000 టెస్ట్ రైడ్‌లను పూర్తి చేసింది. మరోవైపు, ఈ–స్కూటర్ను అన్ని రకాల రోడ్లపై పరీక్షించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా 1,000 నగరాల్లో రోజుకు 10,000 టెస్ట్ రైడ్‌లను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓలా సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు.

ఆయన ట్వీట్ చేస్తూ ‘‘మేము ఇప్పుడే 20,000 టెస్ట్ రైడ్‌లను పూర్తి చేశాం. భారతదేశంలో, బహుశా ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక అరుదైన రికార్డు. నిజంగానే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద టెస్ట్ రైడ్ అవుతుంది.” అని పేర్కొన్నారు. #JoinTheRevolution @OlaElectric అనే హ్యాష్ట్యాగ్ను జోడించారు. ఓలా ఎలక్ట్రిక్ నవంబర్ 10న బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతాలో టెస్ట్ రైడ్‌లను ప్రారంభించింది, ఆపై నవంబర్ 19న చెన్నై, హైదరాబాద్, కొచ్చి, ముంబై, పూణే వంటి ఐదు నగరాల్లో టెస్ట్ రైడ్ చేసింది.

ఇది చదవండి: మైక్రోసాఫ్ట్ నుంచి స్పెషల్​ క్రిస్మస్ స్వెటర్​ లాంఛ్​.. దీని​ ప్రత్యేకత ఏంటో తెలుసా? ​​



సెమీ కండక్టర్ చిప్ల కొరతతో డెలివరీలు ఆలస్యం..

ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ విడుదలైంది. ఎస్1 , ఎస్1 ప్రో రెండు వేరియంట్లను ఓలా విడుదల చేసింది. వీటిని వరుసగా రూ. 99,999, రూ.1,29,999 ధరల వద్ద ఆవిష్కరించింది. అయితే, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు మొదటి బ్యాచ్ డెలివరీలను 2021 అక్టోబర్ 25, నవంబర్ 25 మధ్య ప్రారంభించాలని తొలుత భావించారు. కానీ, సెమీ కండక్టర్ చిప్ కొరత కారణంగా డెలివరీ ప్రక్రియ వాయిదా పడింది. డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 30 మధ్య డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఇది చదవండి: నేడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం.. దీని చరిత్ర, థీమ్ వివరాలివే..


ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్లను కలిగి ఉంటుంది. నార్మల్, స్పోర్ట్, హైపర్ మోడ్స్లో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 10 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇక, దేశంలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ నెట్‌వర్క్ను ఏర్పాటు చేయడంలో నిమగ్నమైంది. మొత్తం 400 నగరాల్లో 100,000 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

Published by:Purna Chandra
First published:

Tags: Ola e Scooter

ఉత్తమ కథలు