Ola Electric Scooter: ఇదిగో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. టీజర్ విడుదల.. మీరు కూడా ఓ లుక్కేయండి

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్

ఓలా కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్​ స్కూటర్​ను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించిన టీజర్​ను కంపెనీ సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్​ విడుదల చేశారు.

  • Share this:
దేశంలో ఎలక్ట్రిక్​ వాహనాల వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. ఓవైపు రాకెట్​ వేగంతో దూసుకుపోతున్న పెట్రోల్​, డీజిల్​ ధరలు, మరోవైపు కాలుష్యం కారణంగా వాహనదారుల చూపు ఎలక్ట్రిక్​ వాహనాలపై పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను శరవేగంగా మార్కెట్​లోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రముఖ టాక్సీ సేవల సంస్థ ఓలా కూడా ఇటీవల ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్​ స్కూటర్​ను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. దీనికి సంబంధించిన టీజర్​ను కంపెనీ సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్​ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా త్వరలోనే ఓలా మొదటి ఎలక్ట్రిక్​ స్కూటర్​ను లాంచ్​ చేయనున్నట్లు టీజర్​లో పేర్కొన్నారు. బెంగళూరు వీధుల్లో ఓలా స్కూటర్​పై చక్కర్లు కొడుతున్న వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. స్కూటర్​కు సంబంధించిన పలు ఫీచర్లను కూడా వీడియోలో తెలియజేశారు. ‘‘మా మొట్టమొదటి ఈ–స్కూటర్​ను త్వరలోనే లాంచ్​ చేయనున్నాం. ఈ బైక్ 0–60 Kmph వేగాన్ని మీరు ట్వీట్​ చదివేంత సమయంలోనే అందుకోగలదు. ఈ స్కూటర్​ లాంచింగ్​తో భారత ఎలక్ట్రిక్​ వాహన రంగంలో విప్లవం రాబోతుంది. సిద్దంగా ఉండండి. ” అని పేర్కొన్నారు. కాగా,ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారు లక్ష రూపాయలు ఉండే అవకాశం ఉంది.
Ola Electric Scooter: ఈ నెలలోనే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎన్నో ప్రత్యేకతలు.. తెలుసుకోండి

గంటకు 90 కి.మీ వేగంతో..
ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. రాబోయే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒకే ఛార్జీ చేస్తే సుమారు 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. దీనిలో బ్యాటరీ మార్చుకునేందుకు వీలుగా ఉండే లిథియం అయాన్​ బ్యాటరీ చేర్చనున్నారు. ఇక, స్కూటర్​ కింది భాగంలో రెండు హాఫ్​ హెల్మెట్లు పట్టేంద ఖాళీ ప్రదేశం కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హోమ్ ఛార్జర్ కూడా ఉంటుంది. దీనికి ఎటువంటి ఇన్‌స్టాలేషన్ అవసరం లేదు. రెగ్యులర్ వాల్ సాకెట్‌లోకి ప్లగ్ చేయడం ద్వారా కస్టమర్లు తమ వాహనాన్ని ఇంట్లోనే సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.


ఇక, ఈ–స్కూటర్ల తయారీ కోసం ఓలా సంస్థ తమిళనాడులో ఇప్పటికే ఫ్యూచర్​ ఫ్యాక్టరీ నిర్మాణ పునులు చేపట్టింది. రూ. 2,400 కోట్లతో దీన్ని నిర్మిస్తుంది. రానున్న కొన్ని నెలల్లోనే ఇక్కడ ఈ–స్కూటర్ల తయారీ ప్రారంభం కానుంది. ఏటా కోటి స్కూటర్లను తయారు చేసేలా ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నారు. తద్వారా రెండు సెకన్లకు ఒక స్కూటర్​ తయారీ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణంతో పాటు హైపవర్​ ఛార్జర్​ నెట్​వర్క్​ని కూడా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ఓలా ప్రకటించింది. ఇందుకోసం హై స్పీడ్​ ఛార్జింగ్ ఆప్షన్లతో పాటు హోం ఛార్జర్లు కూడా అందుబాటులోకి తేనుంది. బజాజ్​ చేతక్​ (ఎలక్ట్రిక్​), అథేర్​ ఎనర్జీ స్కూటర్లకు ఓలా గట్టి పోటీనివ్వనుంది.
Published by:Nikhil Kumar S
First published: