Home /News /technology /

OLA ADIRIPOE NEWS FIRST ELECTRIC CAR LAUNCH THE PRICE AND FEATURES WILL MAKE YOU LOSE YOUR MIND UMG GH

Ola Electric Car: ఓలా అదిరిపోయే న్యూస్.. మొదటి ఎలక్ట్రిక్ కార్ లాంఛ్.. ధర, ఫీచర్స్ చూస్తే మైండ్ పోతుంది !

 ఓలా అదిరిపోయే న్యూస్.. మొదటి  ఎలక్ట్రిక్ కార్ లాంఛ్.. ధర, ఫీచర్స్ చూస్తే మైండ్ పోతుంది !

ఓలా అదిరిపోయే న్యూస్.. మొదటి ఎలక్ట్రిక్ కార్ లాంఛ్.. ధర, ఫీచర్స్ చూస్తే మైండ్ పోతుంది !

ఓలా(Ola) కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ కారును ఆగస్టు 15న లాంచ్ చేయనుంది. కంపెనీ వ్యవస్థాపకుడు, CEO భవిష్ అగర్వాల్ కార్ లాంచింగ్‌ను ధ్రువీకరించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త ప్రొడక్ట్‌ను ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు ట్విట్టర్‌(Twitter) ద్వారా వెల్లడించారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ట్యాక్సీ(Taxi) సర్వీస్‌ కంపెనీగా ప్రయాణం మొదలుపెట్టి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది ఓలా (Ola) కంపెనీ. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) భారతదేశంలో విద్యుత్ బైక్స్‌(Bike)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదే ఉత్సాహంతో ఎలక్ట్రిక్ కార్(Electric car)ను కూడా తయారు చేస్తామని గతంలో ప్రకటించింది. కంపెనీ డిజైన్ చేసిన మొదటి ఎలక్ట్రిక్ కారును ఆగస్టు 15న లాంచ్ చేయనుంది. కంపెనీ వ్యవస్థాపకుడు, CEO భవిష్ అగర్వాల్ కార్ లాంచింగ్‌ను ధ్రువీకరించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త ప్రొడక్ట్‌ను ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ కారు పేరును భవిష్ ట్వీట్‌లో వెల్లడించనప్పటికీ, కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ కారును ఆగస్టు 15న దేశంలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఓలా ఎలక్ట్రిక్ ఈ కొత్త ఫోర్-వీలర్ లాంచింగ్‌పై గత కొద్ది కాలంగా అప్‌డేట్స్ ఇస్తోంది. ఫైనల్‌గా దీని లాంచింగ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. ఓలా ఈ-కారు లాంచింగ్ ఈవెంట్‌లో కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలను కూడా ప్రకటిస్తుంది. ‘కొత్త ప్రొడక్ట్‌ను ఈ ఆగస్టు 15న లాంచ్ చేస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది. ఆరోజు మా భారీ భవిష్యత్తు ప్రణాళికల గురించి కూడా వెల్లడిస్తాం.’ అని భవిష్ అగర్వాల్ ట్వీట్‌లో రాశారు. లాంచ్ ఈవెంట్ ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమ్ అవుతుందని చెప్పారు. ఈ లైవ్ ఈవెంట్‌ టైమింగ్స్ వివరాలు, లింక్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: Politicians Promises: దేశంలో ఉచిత పథకాల లిస్ట్ ఇదే..! కలర్ టీవీల నుంచి రోబోల వరకూ ఉచితంగా పంచినవే ఇవే..!!



డిజైన్ ఎలా ఉండవచ్చు..?
ఓలా ఎలక్ట్రిక్ ఈ ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ గురించి ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది జూన్‌లో ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీలో జరిగిన ఓలా కస్టమర్ డే సందర్భంగా.. కంపెనీ ఈ కారును మొదటిసారిగా టీజ్ చేసింది. ఎరుపు రంగులతో కూడిన సొగసైన LED DRLలతో కనిపిస్తున్న కారు టీజర్ వీడియోను కూడా షేర్ చేసింది. ఈ వీడియోలో.. కొత్త కారుకు రెండు వైపులా ఓలా లోగోతో పాటు, దాని ముందు, వెనుక డిజైన్‌ను కూడా కనిపించాయి. ఓలా నుంచి వచ్చే ఈ ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు కూపే లాంటి రూఫ్‌లైన్‌తో లో-స్లంగ్, వెడల్పాటి కారుగా ఉండే అవకాశం ఉంది. కంపెనీ దీన్ని 'స్పోర్టీయెస్ట్ కారు'గా టీజ్ చేసింది. ఇందులో పొడవైన బ్యాటరీ సెట్‌ ఉండవచ్చు. ఇది 4-డోర్ల సెడాన్ అని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ కారు లాంచ్ అయిన తర్వాతే దీని ఫీచర్లు, స్పెసిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.



ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఫేమస్
ఓలా ఎలక్ట్రిక్ తమ EV ఫోర్-వీలర్ ఫ్యాక్టరీ కోసం 1,000 ఎకరాల భూమిని సేకరించాలని చూస్తోంది. ఇది S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను నిర్మించే ప్రస్తుత ఫ్యూచర్‌ఫ్యాక్టరీ స్థలం కంటే దాదాపు రెట్టింపు. కంపెనీ ప్రస్తుతం ఇండియాలో ఓలా ఎస్1 (Ola S1), ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది.
Published by:Mahesh
First published:

Tags: Features, Ola, Ola Electric Car, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు