Home /News /technology /

OKINAWA OKHI 90 E SCOOTER LAUNCHED AT RS 1 22 LAKH TAKES AIM AT OLA S1 PRO NS GH

Okinawa Okhi 90: ఒకినావా నుంచి ఓఖి 90 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎన్ని కి.మీ వెళ్లొచ్చంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గురుగ్రామ్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్ ఒకినావా ఆటోటెక్ (Okiwana Autotech) గురువారం ఓఖి 90 (Okhi 90) అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. భారతీయ మార్కెట్లో ఈ సరికొత్త స్కూటర్ ప్రారంభ ధరను రూ.1.22 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

ఇంకా చదవండి ...
గురుగ్రామ్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్ ఒకినావా ఆటోటెక్ (Okiwana Autotech) గురువారం ఓఖి 90 (Okhi 90) అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌(Electric Scooter)ను ఇండియాలో లాంచ్ చేసింది. భారతీయ మార్కెట్లో ఈ సరికొత్త స్కూటర్ ప్రారంభ ధరను రూ.1.22 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఫేమ్ 2 (FAME II) సబ్సిడీ తరువాత ఓఖి 90 పాన్-ఇండియా ఎక్స్ షోరూమ్ స్టార్టింగ్ ధరను రూ.1.22 లక్షలుగా నిర్దేశించినట్లు కంపెనీ వెల్లడించింది. Okhi 90 అనేక ఆకర్షణీయమైన స్టైలింగ్ హైలైట్‌లు, న్యూ-ఏజ్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఒకినావా ఇప్పటికే iPraise+, Praise Pro వంటి స్ట్రాంగ్ పర్ఫామెన్స్ ఆఫర్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్‌ల మోడళ్లను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు లాంచ్ అయిన ఓఖి 90 స్కూటర్ Ola S1 Pro, Ather 450X, TVS iQube వంటి పాపులర్ స్కూటర్లకు గట్టిపోటీ ఇవ్వనుంది.

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ స్పేస్‌లోని దిగ్గజ ప్లేయర్‌లలో ఒకినావా ఆటోటెక్ ఒకటి. అయితే మరింత పెద్ద మార్కెట్ వాటాను సాధించే లక్ష్యంతో Okhi 90 స్కూటర్‌ను ప్రత్యేకంగా 18-45 ఏళ్ల కస్టమర్ల కోసం లాంచ్ చేసింది కంపెనీ.
Electric Vehicle: కేవలం 14 పైసలతో కిలోమీటరు వరకు వెళ్లొచ్చు.. ఆ కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. వివరాలిలా..

ఒకినావా ఓఖి 90 స్టైలింగ్:
Okhi 90 ఒకినావా ఇతర స్కూటర్ల కంటే బలమైన డిజైన్‌తో వచ్చింది. లైట్ సెన్సార్‌తో అమర్చిన LED హెడ్ ల్యాంప్‌ ఈ స్కూటర్ కి మంచి లుక్ ఇస్తుంది. ఈ మోడల్ ఇతర ఒకినావా వాహనాల కంటే కొంచెం పొడవుగా ఉంటుంది. ఇది కంప్లీట్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కలిగి ఉంది. వెనుక లేదా రియర్-సీటు ప్యాసింజర్ కోసం మందపాటి గ్రాబ్ రైలును ఇందులో అందించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ 16-ఇంచుల అల్యూమినియం అల్లాయ్ వీల్స్‌ అందించారు.
AC Offer: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్... వారికి ఒక్క రూపాయికే ఏసీ... త్వరపడండి

ఒకినావా Okhi 90 మోటార్, బ్యాటరీ, రేంజ్
Okhi 90 సెంటర్ లో మౌంటెడ్ 3800-వాట్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. కంపెనీ ప్రకారం, ఈ స్కూటర్ ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసి గంటకు 80-90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఛార్జ్ చేసిన ప్రతిసారి ఇది 160 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ చెప్పినప్పటికీ అన్ని ఎలక్ట్రిక్ వాహనాల మోడల్‌ల మాదిరిగానే వాస్తవ ప్రపంచంలో ఈ సంఖ్య మారొచ్చు. ముఖ్యంగా రైడింగ్ చేసే విధానం, ల్యాండ్, వాతావరణం, లోడ్ వంటి అనేక రకాల కారకాలపై ఆధారపడి రేంజ్ మారవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా ఫాస్ట్ గా వెళ్తుందని కంపెనీ చెబుతోంది. ఇది 10 సెకన్లలో సున్నా నుంచి 90 కి.మీ వేగాన్ని అందుకోగలదట. ఇది 40-లీటర్ బూట్ స్పేస్‌ను కూడా కలిగి ఉంది. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో అతిపెద్దది చెప్పచ్చు. స్కూటర్ రెండు రైడ్ మోడ్‌లను పొందుతుంది. ఎకో మోడ్ గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి అనుమతిస్తుంది. అయితే స్పోర్ట్స్ మోడ్ లో స్కూటర్ దాని ఫుల్ పొటెన్షియల్ అందుకొని 80 నుంచి 90 కిలో మీటర్ల వేగంతో దూసుకు వెళ్తుంది. నాబ్-స్టైల్ ఆటోమేటిక్ కీలెస్ స్టార్ట్ ఫీచర్ ఇందులో మరొక హైలెట్ అని చెప్పవచ్చు.

ఒకినావా Okhi 90 కనెక్టెడ్ ఫీచర్లు:
Okhi 90 ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక కనెక్టెడ్ ఫీచర్లను పొందుతుంది. మ్యూజిక్ ప్లే కంట్రోల్, వెహికల్ బ్యాటరీ ఛార్జ్ స్టేటస్, జియో-ఫెన్సింగ్, ఫైండ్ మై వెహికల్ ఆప్షన్, ట్రిప్ హిస్టరీ, డ్రైవర్ స్కోర్, స్పీడింగ్ అలర్ట్‌లు, నావిగేషన్, వెహికల్ స్టేటస్ మొదలైన కనెక్టెడ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. Okhi 90 నాలుగు కలర్ ఆప్షన్లతో లాంచ్ అయ్యింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెడ్, వైట్, బ్లూ, గ్రే కలర్స్ లో లభిస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Electric Car, Electric Scooter, Ola Electric Scooter

తదుపరి వార్తలు