Home /News /technology /

OFFERS ON TABLETS AT AMAZON SUMMER SALE THESE ARE THE BEST TABS AVAILABLE ON A LOW BUDGET GH VB

Amazon Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో టాబ్లెట్లపై ఆఫర్లు.. తక్కువ బడ్జెట్‌లో లభిస్తున్న బెస్ట్ టాబ్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అదిరిపోయే ఆఫర్లతో ‘అమెజాన్ సమ్మర్‌ సేల్‌-2022’ పేరుతో భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ సేల్ మే4 నుంచి మే7 వరకు మాత్రమే నిర్వహించనుంది. బ్యాంక్‌ల క్రెడిట్‌ కార్డ్‌లతో అదనంగా మరికొన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు అమెజాన్ తెలిపింది.

ఇంకా చదవండి ...
ఈ కామర్స్‌(E Commerce) దిగ్గజం అమెజాన్‌(Amazon) అదిరిపోయే ఆఫర్లతో ‘అమెజాన్ సమ్మర్‌ సేల్‌-2022’ పేరుతో భారీ డిస్కౌంట్లు(Discounts) ప్రకటించింది. ఈ సేల్ మే4 నుంచి మే7 వరకు మాత్రమే నిర్వహించనుంది. బ్యాంక్‌ల క్రెడిట్‌ కార్డ్‌లతో(Credits) అదనంగా మరికొన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు అమెజాన్ తెలిపింది. శామ్‌సంగ్, లెనోవా, షియోమి వంటి ప్రముఖ తయారీ కంపెనీలకు చెందిన టాబ్లెట్‌లు అమ్మకానికి ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా కస్టమర్లు కొత్త టాబ్లెట్‌పై రూ.13,200 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. మరి ఎందుకు ఆలస్యం అందుబాటులో ఉన్న బెస్ట్ టాబ్లెట్స్ డీల్స్‌పై ఓ లుక్కెద్దాం..

* శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ A8
యూట్యూట్ స్ట్రీమింగ్, వెబ్ బ్రౌజింగ్ వంటి ప్రాథమిక అవసరాలను తీర్చే టాబ్లెట్ కావాలంటే Samsung Galaxy Tab A8ను ఎంపిక చేసుకోవచ్చు. స్టోరేజ్ కెపాసిటీతో 4GB RAM- 64GB. SD కార్డ్ ద్వారా దీన్ని మరింత పెంచుకోవచ్చు. ఈ టాబ్లెట్ Wi-Fi-మాత్రమే కనెక్షన్ ఎంపికను మాత్రమే అనుమతిస్తుంది. ప్రస్తుతం అమెజాన్‌లో 29 శాతం డిస్కౌంట్స్‌‌తో రూ.16,999కు అందుబాటులో ఉంది.

* లెనోవా యోగా స్మార్ట్ టాబ్లెట్
ఇళ్లు లేదా ఆఫీస్ కంటెంట్ కోసం ఈ టాబ్లెట్ బాగా సూట్ అవుతుంది. ప్రత్యేక డిజైన్‌తో తయారు చేయడం వల్ల దీన్ని గొడకు వేలాడదీయవచ్చు లేదా టెబుల్‌పై కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ టాబ్లెట్ 10.1-అంగుళాల FHD డిస్‌ప్లే కలిగి ఉంది. దీంతో వైడ్ వ్యూ యాంగిల్ కూడా చూడవచ్చు. స్మార్ట్ పవర్ యాంప్లిఫైయర్‌తో ఒక జత JBL స్పీకర్‌లను ఏర్పాటు చేశారు. 7000mAh బ్యాటరీతో Qualcomm Snapdragon 439 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఈ టాబ్లెట్‌పై అమెజాన్ 48% భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ.18,499కి అందుబాటులో ఉంది.

* షియోమి MI PAD
శక్తివంతమైన క్వాడ్ స్పీకర్‌ల సెట్,120Hz అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో షియోమి ప్యాడ్ 5 ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇది మీడియా అవసరాలకు బాగా ఉపయోగపడుతుంది. Qualcomm Snapdragon 860 SoCతో ఈ ప్యాడ్ శక్తిని పొందుతూ వివిధ రకాల వర్క్‌లోడ్‌లను నిర్వహించగలదు. అంతేకాకుండా 8720mAh బ్యాటరీని కలిగి ఉంది. 6GB RAM, 128GB స్టోరేజ్‌ కెపాసిటీలో Xiaomi Mi ప్యాడ్ ప్రస్తుతం 34% తగ్గింపుతో రూ. 24,999కు అందుబాటులో ఉంది.

Exam Calendar: గుడ్ న్యూస్.. ఎగ్జామ్ క్యాలెండర్-2023 విడుదల.. ఏ పరీక్ష ఏ తేదీన ఉందో తెలుసుకోండి..


* టీసీఎల్ ట్యాబ్ 10S
తక్కువ బడ్జెట్‌లో టాబ్లెట్ కావాలంటే TCL ట్యాబ్ 10ఎస్ ఉత్తమైనది. 4G + Wi-Fi కాలింగ్ ఆప్షన్‌తో పాటు 3GB RAM అండ్ 32GB స్టోరేజ్ కెపాసిటీ, 10.1-అంగుళాల WUXGA డిస్‌ప్లేను 930 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్ కోసం సపోర్ట్ చేస్తుంది. శక్తివంతమైన Helio P22 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో దీన్ని రూపొందించారు. స్ట్రీమింగ్, బ్రౌజింగ్ వంటి ప్రాథమిక అవసరాలను దీని ద్వారా తీర్చుకోవచ్చు. TCL Tab 10s ప్రస్తుతం 61% తగ్గింపుతో కేవలం రూ.11,999కి అమెజాన్ లో అందుబాటులో ఉంది.

* శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ S6 లైట్
4GB RAM అండ్ 64GB ROM ఫీచర్లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ల్యాప్‌టాప్ Wi-Fiతోపాటు 4G కనెక్షన్‌ కు సపోర్ట్ ఇస్తుంది. ఎప్పుడూ ప్రయాణం చేసేవారికి ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ టాబ్లెట్ 7,040mAh లిథియం-అయాన్ బ్యాటరీ, 2000 X 1200 పిక్సెల్‌లతో 10.4-అంగుళాల TFT డిస్‌ప్లేతో ఆట్రాక్టీవ్‌గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో 17% తగ్గింపుతో రూ.29,999కు అందుబాటులో ఉంది.

* లెనోవా ట్యాబ్ M10
ఇది మల్టీమీడియా-ఫోకస్డ్ టాబ్లెట్. 8.1-అంగుళాల 1080p డిస్‌ప్లేతో వీడియోల స్ట్రీమింగ్, సినిమాలను చూడటానికి కంపర్ట్‌గా ఉంటుంది. 4GB మెమోరీతో ఉన్న దీన్ని 128GB వరకు స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవచ్చు. ల్యాప్‌టాప్ MediaTek Helio P22T ట్యాబ్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 9 బాక్స్ వెలుపల రన్ అవుతుంది. Lenovo Tab M10 ప్రస్తుతం 49% తగ్గింపుతో రూ.17,999కు అందుబాటులో ఉంది.
Published by:Veera Babu
First published:

Tags: 5g smart phone, Laptop, Mobile phones, Tablet

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు