హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Offers on Headphones: అమెజాన్‌లో హెడ్‌ఫోన్స్‌పై 50 శాతానికి పైగా డిస్కౌంట్.. వాటిపై ఓ లుక్కేయండి..

Offers on Headphones: అమెజాన్‌లో హెడ్‌ఫోన్స్‌పై 50 శాతానికి పైగా డిస్కౌంట్.. వాటిపై ఓ లుక్కేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రీమియం ఆడియో ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లను అందిస్తోంది ఈకామర్స్ దిగ్గజం అమెజాన్. సమ్మర్ సేల్‌లో వీటిపై 51% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఆఫర్లలో లభిస్తున్న ప్రొడక్ట్స్ ఏవో చూద్దాం.

మారుతున్న టెక్(Tech) యుగంలో కంపెనీలు అన్ని రకాల ప్రొడక్ట్స్‌ను(Products) కొత్త తరం టెక్నాలజీతో(Technology) అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. సరికొత్త టెక్నాలజీతో లేటెస్ట్ వెర్షన్‌ మోడల్స్‌ను(Models) అందుబాటులో ఉంచుతున్నాయి. హెడ్‌ఫోన్స్(Head Phones), ఇయర్‌బడ్స్(Earbuds), స్పీకర్‌లు(Speakers) కూడా ఎవరూ ఊహించని ఫీచర్లతో లభిస్తున్నాయి. వీటి ధరలు కూడా అదే రేంజ్‌లో ఉంటున్నాయి. ఇలాంటి ప్రీమియం ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లను అందిస్తోంది ఈకామర్స్ దిగ్గజం అమెజాన్. సమ్మర్ సేల్‌లో వీటిపై 51% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఆఫర్లలో లభిస్తున్న ప్రొడక్ట్స్ ఏవో చూద్దాం.

* Oneplus Buds Pro బ్లూటూత్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

వీటి దర రూ.11,990 కాగా, ఆఫర్‌లో రూ.9,990కే లభిస్తుంది. ఈ ఇన్-ఇయర్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఆటోమేటెడ్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ డిటెక్షన్, అడ్జస్ట్‌మెంట్‌తో 40 dB హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలింగ్ ఫీచర్‌ను అందిస్తాయి. ఇది 38 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. 10 నిమిషాల 'వార్ప్ ఛార్జింగ్'తో 10 గంటల ప్లేటైమ్‌ ఆస్వాదించవచ్చు.

* Sony WH-XB910N Extra BASS బ్లూటూత్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్

ఈ గాడ్జెట్ అసలు ధర రూ.19,990 కాగా, ఆఫర్‌లో రూ.14,990కే సొంతం చేసుకోవచ్చు. ఓవర్ ఇయర్, వైర్‌లెస్ డివైజ్‌గా కూడా ఈ ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది. అద్భుతమైన నాయిస్ క్యాన్సిలింగ్ ఫీచర్‌లతో వచ్చిన ఈ ప్రొడక్ట్.. రియల్ సౌండ్‌ప్రూఫ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, సిరి వంటి వాయిస్ అసిస్టెంట్‌ సపోర్ట్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 30 గంటల ప్లేటైమ్‌ను అందిస్తుంది. 10 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే 4.5 గంటల ప్లే బ్యాక్ టైమ్‌ను అందిస్తుంది.

Vivo Y01: కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన వివో.. Vivo Y01 ధర, స్పెసిఫికేషన్ల వివరాలు..


* Skullcandy Crusher Evo బ్లూటూత్ వైర్‌లెస్ ఓవర్ ఇయర్ హెడ్‌ఫోన్

దీని ధర రూ.27,999 ఉండగా, ఆఫర్‌లో దీన్ని రూ.13,699కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఓవర్-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లోని ఇయర్ కప్‌లలో 'క్రషర్ బాస్' టెక్నాలజీతో వచ్చిన బాస్ డ్రైవర్స్ ఉన్నాయి. ఇది బాస్ లెవల్‌ను ఎడ్జెస్ట్ చేసే ఆప్షన్‌ కూడా ఉంటుంది. మెలో బాస్ కోసం స్లైడర్‌ను కిందికి తిప్పితే చాలు. స్కల్‌క్యాండీ యాప్‌లోని ‘Audiodo’ టెక్నాలజీ, ఆడియోను ఆప్టిమం లెవల్‌లో ఉంచుతుంది. ఈ గాడ్జెట్ వేర్వేరు రంగుల్లో అందుబాటులో ఉంది.

* Sony HT-S40R Real 5.1ch డాల్బీ ఆడియో సౌండ్‌బార్ (TV కోసం)

ఈ సౌండ్‌బార్ అసలు ధర రూ.34,990 వరకు ఉంది. ప్రస్తుతం అమెజాన్‌ దీన్ని రూ.26,920కే అందిస్తోంది. ఈ సౌండ్‌బార్ సరౌండ్ సౌండ్ సిస్టమ్స్, టెలివిజన్‌, మ్యూజిక్ ప్లేయర్‌లకు అనువైనది. ఈ డివైజ్‌లో బార్ స్పీకర్, వెనుక స్పీకర్లు, సబ్‌ వూఫర్ వర్క్ వంటి మూడు ఛానల్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి పెద్ద, ఫుల్-ఫ్రీక్వెన్సీ సౌండ్‌ను అందిస్తాయి.

* Sony WF-1000XM4 వైర్‌లెస్ (TWS) బ్లూటూత్ 5.2 ఇయర్‌బడ్స్

ఈ సోనీ ఇయర్‌బడ్స్ అసలు ధర రూ.24,990. కానీ అమెజాన్‌లో ప్రస్తుతం రూ.19,990కే అందుబాటులో ఉంది. ఈ నాయిస్ క్యాన్సిలింగ్ బ్లూటూత్ ఇయర్‌బడ్స్ కొత్త ‘ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్ V1’తో వస్తాయి. ఇది కన్వర్జేషన్స్ సమయంలో ఆటోమెటిక్‌గా వాల్యూమ్‌ను తగ్గించే స్పీచ్-టు-చాట్ టెక్నాలజీ వంటి స్మార్ట్ ఫీచర్‌లతో వస్తుంది. 24 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.

First published:

Tags: Amazon, Earbuds, Google, Headphones

ఉత్తమ కథలు