OFFER AVAILABLE ON APPLE THE IPHONE SE 3 PRICED DROPED DISCOUNT UP TO 28900 CHECK FULL DETAILS HERE GH VB
Apple iPhone: యాపిల్ ఐస్టోర్‌లో అదిరిపోయే ఆఫర్.. ఆ ఫోన్ పై ఏకంగా రూ. 28,900 వరకు డిస్కౌంట్..
ప్రతీకాత్మక చిత్రం
యాపిల్ లవర్స్‌కు అదిరిపోయే శుభవార్త. మార్చి 8న విడుదలైన ఐఫోన్ ఎస్ఈ మోడల్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. యాపిల్ కంపెనీకి చెందిన ఐస్టోర్‌లలో ఈ డిస్కౌంట్ ప్రయోజనాలను పొందవచ్చు.
యాపిల్ లవర్స్‌కు(Apple iPhone) అదిరిపోయే శుభవార్త. మార్చి 8న విడుదలైన ఐఫోన్ ఎస్ఈ మోడల్‌పై భారీ డిస్కౌంట్(Discount) ప్రకటించింది కంపెనీ. యాపిల్ కంపెనీకి చెందిన ఐస్టోర్‌లలో ఈ డిస్కౌంట్ ప్రయోజనాలను పొందవచ్చు. తాజా, ఆఫర్(Offer) ప్రకారం, ఐఫోన్ ఎస్ఈ(iPhone SE) 64 జీబీ ర్యామ్ మోడల్‌పై ఏకంగా రూ. 28,900 తగ్గింపు లభిస్తుంది. దీనిలో ఇన్స్టంట్ డిస్కౌంట్(Instant Discount) కింద రూ. 2,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ICICI బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లపై ఈ క్యాష్‌బ్యాక్ బెనిఫిట్ పొందవచ్చు. ఇంకా, ఐస్టోర్‌లో ఐఫోన్ 8 64 జీబీని ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా మొత్తం మీద రూ.15,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్లు ఐఫోన్ SE 3 128 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ వేరియంట్లపై కూడా చెల్లుబాటు అవుతాయి.
కాగా, మార్చి 8న థర్డ్ జనరేషన్ ఐఫోన్ SE 64GB వేరియంట్ మార్కెట్లోకి రిలీజైంది. ఇది రూ. 43,900 ధర వద్ద అందుబాటులోకి వచ్చింది. ఇది యాపిల్ కంపెనీకి చెందిన అత్యంత 'సరసమైన' 5G స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఈ కొత్త ఫోన్ బయటి నుండి 2014 ఐఫోన్ 6 డిజైన్ లాగానే కనిపిస్తుంది. అయితే, లోపల మాత్రం అనేక మార్పులు చేసింది. ఈ ఫోన్ వేగవంతమైన A15 బయోనిక్ చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. యాపిల్ తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 13 సిరీస్‌లోనూ ఇదే చిప్‌సెట్‌ను అందించింది. 3వ తరం ఐఫోన్ ఎస్ఈలో 64GB, 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్లు గల వేరియంట్లు మార్కెట్లో లభిస్తాయి. అయితే, వీటి ఎగువన, దిగువన ఉన్న భారీ బెజెల్స్ ఈ ఫోన్‌ను ఐఫోన్ మినీ కంటే పెద్దదిగా కనిపించేలా చేస్తాయి. కానీ, వీటి డిస్ప్లే సైజ్ కేవలం 4.7 అంగుళాలు మాత్రమే ఉంటుంది.
యాపిల్ నుంచి అత్యంత సరసమైన 5జీ ఫోన్
ఐఫోన్ ఎస్ఈ 3 స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే అత్యంత కఠినమైన గాజు" (సిరామిక్ షీల్డ్)తో తయారైంది. దీనిలో స్క్రీన్ క్రింద టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ రీడర్‌ను కూడా అందించింది. ఐఫోన్ 13- సిరీస్‌లో సెన్సార్-షిఫ్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 12MP యూనిట్‌ను అందించినందున, దీనిలోని కెమెరాతో మరింత క్లారిటీ ఫోటోలు తీయవచ్చు. ఇది కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీకి కూడా మద్దతిస్తుంది. అలాగే, దీనిలోని కెమెరా స్మార్ట్ హెచ్డీఆర్ 4, ఫోటోగ్రాఫిక్ స్టైల్స్, డీప్ ఫ్యూజన్ ఫీచర్లను కలిగి ఉంటుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.