ఫేస్‌బుక్ హ్యాక్: ఆ అమ్మాయి ఎవరు?

రాజస్తాన్‌లోని జైసల్మేర్‌లో ఫేస్‌బుక్ అకౌంట్ల హ్యాకింగ్ కలకలం రేపింది. హ్యాక్ అయిన అకౌంట్లలో ఓ అమ్మాయి ఫోటో కామన్‌గా కనిపించింది.

news18-telugu
Updated: September 4, 2018, 6:20 PM IST
ఫేస్‌బుక్ హ్యాక్: ఆ అమ్మాయి ఎవరు?
రాజస్తాన్‌లోని జైసల్మేర్‌లో ఫేస్‌బుక్ అకౌంట్ల హ్యాకింగ్ కలకలం రేపింది. హ్యాక్ అయిన అకౌంట్లలో ఓ అమ్మాయి ఫోటో కామన్‌గా కనిపించింది.
  • Share this:
రాజస్తాన్‌లోని జైసల్మేర్‌లో వందల సంఖ్యలో ఫేస్‌బుక్‌ అకౌంట్లు హ్యాకయ్యాయి. ఎవరు చేశారో... ఎందుకు చేశారో అంతు చిక్కట్లేదు. హ్యాక్ అయిన ఫేస్‌బుక్ అకౌంట్లలో ఓ విదేశీ సైనికురాలి ఫోటో కనిపించింది. జిల్లియన్ క్లారెన్స్ పేరుతో ప్రొఫైల్ మారిపోయింది. ప్రొఫైల్ ఫోటో, కవర్ ఫోటో, పేరు, ఫోన్‌ నెంబర్లు, ఇ-మెయిల్ ఐడీలన్నీ మారిపోవడంతో యూజర్లు షాకయ్యారు. ఈ స్థాయిలో ఫేస్‌బుక్ అకౌంట్ల హ్యాకింగ్ ఇదే తొలిసారి.

number of facebook accounts hacked in jaisalmer rajasthan, ఫేస్‌బుక్ హ్యాక్: ఆ అమ్మాయి ఎవరు?

ఈ హ్యాకింగ్ వార్తలు షికార్లు చేయడంతో అనేక మంది తమ ఫేస్‌బుక్‌ అకౌంట్ల పరిస్థితేంటో తెలుసుకునేందుకు ఇంటర్నెట్ సెంటర్లకు క్యూకట్టారు. అకౌంట్లు హ్యాకైన యూజర్లు తిరిగి తమ ఐడీని పొందలేకపోతున్నారంటే ఎంత పక్కాగా హ్యాకింగ్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సరిహద్దు ప్రాంతంలో లేదా పాకిస్తాన్ తీవ్రవాద సంస్థల పనే కావచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తోంది సైబర్ సెల్. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందేమో అని అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

కరెన్సీ నోట్లతో రోగాలొస్తాయా?

Photos: రూపాయి విలువ పతనానికి కారణమేంటీ?

ఏటీఎంలో డబ్బులు రాకపోతే ఇలా చేయండి!థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌కి కొత్త రూల్స్

యాపిల్ ఈవెంట్‌కు కౌంట్‌డౌన్ షురూ!

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://telugu.news18.com/technology/
Published by: Santhosh Kumar S
First published: September 3, 2018, 1:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading