NUBIA LAUNCHED NUBIA Z30 PRO SMARTPHONE WITH THREE 64 MEGAPIXEL CAMERAS KNOW PRICE AND SPECIFICATIONS SS
Nubia Z30 Pro: ఈ స్మార్ట్‌ఫోన్‌లో మూడు 64 మెగాపిక్సెల్ కెమెరాలున్నాయి... ధర ఎంతంటే
Nubia Z30 Pro: ఈ స్మార్ట్‌ఫోన్‌లో మూడు 64 మెగాపిక్సెల్ కెమెరాలున్నాయి... ధర ఎంతంటే
(ప్రతీకాత్మక చిత్రం)
Nubia Z30 Pro | ఒక స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువ మెగాపిక్సెల్ ఉన్న కెమెరాలు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది కదా? న్యుబియా జెడ్30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో మూడు 64 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి.
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ న్యుబియా సంచలనం సృష్టించింది. ఏకంగా మూడు 64 మెగాపిక్సెల్ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసి హాట్ టాపిక్‌గా నిలిచింది. సాధారణంగా స్మార్ట్ఫోన్లలో ఒకే కెమెరా ఎక్కువ మెగాపిక్సెల్‌తో ఉంటుంది. 48 మెగాపిక్సెల్, 64 మెగాపిక్సెల్, 108 మెగాపిక్సెల్ స్మార్ట్ఫోన్లు చాలానే ఉన్నాయి. ఒక కెమెరా మాత్రమే ఎక్కువ మెగాపిక్సెల్ ఉంటి మిగతా కెమెరాలు 2 మెగాపిక్సెల్ లేదా 5 మెగాపిక్సెల్ లేదా 8 మెగాపిక్సెల్ ఉంటాయి. కానీ న్యుబియా మాత్రం ఏకంగా స్మార్ట్‌ఫోన్‌లో మూడు 64 మెగాపిక్సెల్ కెమెరాలను ఏర్పాటు చేయడం విశేషం. న్యుబియా లేటెస్ట్గా రిలీజ్ చేసిన న్యుబియా జెడ్30 ప్రో మోడల్లో మూడు 64 మెగాపిక్సెల్ కెమెరాలున్నాయి. న్యుబియా జెడ్30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 64మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 120డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 64 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 64 మెగాపిక్సెల్‌తో మరో సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 8 మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్ ఉన్నాయి. సాధారణంగా ఇతర స్మార్ట్ఫోన్లలో అల్ట్రావైడ్ యాంగిల్, టెలీఫోటో సెన్సార్లు 2 మెగాపిక్సెల్ లేదా 5 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటాయి.
న్యుబియా జెడ్30 ప్రో స్మార్ట్‌ఫోన్ చైనాలో రిలీజ్ అయింది. ఇక న్యుబియా జెడ్30 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 4,200ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో 15 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ అవుతుంది. 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ, 16జీబీ+512జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ప్రారంభ ధర సుమారు రూ.56,800. న్యుబియా జెడ్30 ప్రో సేల్ చైనాలో మే 25న ప్రారంభం అవుతుంది. మరి ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ అవుతుందో లేదో తెలియదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.