Home /News /technology /

NOW YOUTUBE WILL PAY IN INDIA FOR TIKTOK RIVAL YOUTUBE SHORTS VIDEOS HERE IS DETAILS SK GH

YouTube: యూట్యూబ్‌ బంపర్ ఆఫర్.. 'షార్ట్స్' వీడియోలకూ డబ్బులు.. త్వరపడండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గతంలో టిక్‌టాక్‌, స్నాప్‌ఛాట్‌ లాంటివి ఇలా ఫండ్‌ను ఏర్పాటు చేసి క్రియేటర్లకు ఇచ్చాయి. టిక్‌టాక్‌ 200 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ క్రియేట్‌ చేయగా, స్నాప్‌చాట్‌ తన టిక్‌టాక్ తరహా సర్వీసు స్పాట్‌లైట్‌ ద్వారా రోజుకి ఒక మిలియన్‌ డాలర్లు ఇచ్చాయి. ఇప్పుడు యూట్యూబ్‌ అదే పని చేస్తోంది.

ఇంకా చదవండి ...
టిక్‌ టాక్‌ మన దేశంలో యువతపై చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ప్రైవసీ కారణాలతో కేంద్ర ప్రభుత్వం ఆ యాప్‌ను బ్యాన్‌ చేసింది. దీంతో చాలా సంస్థలు అలాంటి యాప్‌లను సిద్ధం చేశాయి. అయితే ఇవేవీ ఆ స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. గూగుల్‌ కూడా ఆ ఉద్దేశంలో యూట్యూబ్‌ షార్ట్స్‌ అని సెక్షన్‌ ఇచ్చింది. టిక్ టాక్‌ తరహా సర్వీసే ఇది. అయితే ఇందులో కంటెంట్‌ పెంచడానికి ఇప్పుడో ఆలోచన చేసింది. అదే డబ్బులివ్వడం. ఇప్పుడు షార్ట్‌ వీడియోలు చేసే క్రియేటర్లకు యూట్యూబ్ డబ్బులిస్తుందట. షార్ట్‌ వీడియో క్రియేటర్లకు ప్రోత్సాహకంగా 100 మిలియన్‌ డాలర్లను వెచ్చించడానికి సంస్థ సిద్ధమైంది. భారత్‌, యూఎస్‌లో ఈ ఫండ్‌ను క్రియేటర్లకు ఇవ్వనున్నారు.

ఆసక్తికరమైన, యూజర్లను ఆకట్టుకునే కంటెంట్‌ చేసే క్రియేటర్లకు ఈ ఫండ్‌ నుంచి ప్రతి నెలా డబ్బులు ఇవ్వనున్నారు. అయితే ఎంత మొత్తం ఇస్తారనేది మాత్రం చెప్పలేదు. ప్రతి నెలా జీతం తరహాలో డబ్బులు వస్తాయనేది టాక్‌. అలా అని అందరికీ ఇవ్వరు. ఒరిజినల్‌ కంటెంట్‌.. అందులోనూ ఇంట్రస్టింగ్‌ కంటెంట్‌ చేస్తేనే డబ్బులు ఇస్తారు. ఆ కంటెంట్‌కి వచ్చే వ్యూస్‌ను కూడా ఇందుకు పరిగణనలోకి తీసుకుంటారు. త్వరలో ఈ విధానం మొదలుపెట్టి... వచ్చే ఏడాది వరకు అమలు చేయనున్నారు. దీని వల్ల యూట్యూబ్‌ షార్ట్స్‌లో ఆసక్తికరమైన కంటెంట్‌ వస్తుందని గూగుల్‌ ఆశిస్తోంది.

నిజానికి ఇదే కొత్త విధానం గతంలో టిక్‌టాక్‌, స్నాప్‌ఛాట్‌ లాంటివి ఇలా ఫండ్‌ను ఏర్పాటు చేసి క్రియేటర్లకు ఇచ్చాయి. టిక్‌టాక్‌ 200 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ క్రియేట్‌ చేయగా, స్నాప్‌చాట్‌ తన టిక్‌టాక్ తరహా సర్వీసు స్పాట్‌లైట్‌ ద్వారా రోజుకి ఒక మిలియన్‌ డాలర్లు ఇచ్చాయి. ఇప్పుడు యూట్యూబ్‌ అదే పని చేస్తోంది. మరి యూట్యూబ్‌కి ఎంత మేరకు కొత్త కంటెంట్‌ క్రియేట్‌ అవుతుందో చూడాలి. ఇప్పటికప్పుడు అయితే మన దేశంలో టిక్‌ టాక్‌ తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మన దేశంలో ఉన్న టిక్‌టాక్‌ తరహా యాప్స్‌ పుంజుకోవాలని చూస్తున్నాయి. జోష్‌, మోజ్‌, ఎంఎక్స్‌ టకాటక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇప్పటికే చాలామంది యూట్యూబ్‌ షార్ట్స్‌లో కంటెంట్‌ పోస్ట్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫండింగ్‌ మొదలైతే ఇంకొంతమంది ఇటువైపు వస్తారు. లేదంటే ఇప్పటికే ఉన్నవాళ్లు కంటెంట్‌ ఎక్కువగా క్రియేట్‌ చేయడానికి ఇష్టపడతారు. ఆ లెక్కన టిక్‌టాక్‌ స్టార్లు తరహాలో షార్ట్స్‌ స్టార్లు త్వరలో కనిపిస్తారేమో.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Technology, Youtube, Youtube channel

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు