• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • NOW YOUR WHATSAPP CHATS CAN BE EASILY MIGRATED TO ANDROID OR APPLE MK GH

WhatsApp Easy Migration: ఇక మీ వాట్సాప్ చాట్స్ ఆండ్రాయిడ్ అయినా ఆపిల్ అయినా సులువుగా మైగ్రేట్ చేయవచ్చు..

WhatsApp Easy Migration: ఇక మీ వాట్సాప్ చాట్స్ ఆండ్రాయిడ్ అయినా ఆపిల్ అయినా సులువుగా మైగ్రేట్ చేయవచ్చు..

(ప్రతీకాత్మక చిత్రం)

వాట్సాప్ సంస్థ తీసుకొచ్చిన వివాదాస్పద డేటా ప్రైవసీ పై ప్రస్తుతం ప్రపంచమంతా చర్చ జరుగుతోంది. చాలామంది యూజర్లు వాట్సాప్ ని వీడేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే తన యూజర్లను యాప్ వదలకుండా చేసేందుకు వాట్సాప్ చాలా ప్రయత్నాలు చేస్తోంది.

  • Share this:
వాట్సాప్ సంస్థ తీసుకొచ్చిన వివాదాస్పద డేటా ప్రైవసీ పై ప్రస్తుతం ప్రపంచమంతా చర్చ జరుగుతోంది. చాలామంది యూజర్లు వాట్సాప్ ని వీడేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే తన యూజర్లను యాప్ వదలకుండా చేసేందుకు వాట్సాప్ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చాలా అప్ డేట్స్ తీసుకొస్తోందీ యాప్. కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ యూజర్లను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆండ్రాయిడ్, ఐఫోన్ ల మధ్య చాట్ మైగ్రేషన్ ని సులభతరం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వాట్సాప్ తన యాప్ ని ఒకేసారి ఎక్కువ డివైజెస్ లో వాడేలా యూజర్లకు అవకాశాన్ని కల్పిస్తోంది. అందులో భాగంగానే ఈ ఆండ్రాయిడ్ ఐఫోన్ మైగ్రేషన్ చేయడానికి కూడా ప్రయత్నిస్తోందని టెక్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ప్రస్తుతం ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైజ్ లో ఉన్న వాట్సాప్ చాట్ ని కేవలం ఆ ఫోన్ లో మాత్రమే యాక్సెస్ చేసే వీలుంది. దీంతో పాటు ల్యాప్ ట్యాప్, డెస్క్ టాప్, ట్యాబ్ లలో యాక్సెస్ చేసే వెసులుబాటు ఉంది. అయితే ఇలా వేర్వేరు ఆపరేటివ్ సిస్టమ్స్ ఉన్న రెండు ఫోన్లలో ఒకే నంబర్ తో వాట్సాప్ ని ఉపయోగించడం ఇప్పటివరకు వీలయ్యేది కాదు. ఇప్పుడు తాజాగా వాట్సాప్ అందించనున్న అప్ డేట్ తో ఇది కూడా సాధ్యమవనుంది. ఇందుకోసం యూజర్ యాప్ స్టోర్ లేదా టెస్ట్ ఫ్లైట్ లో అందుబాటులో ఉన్న వాట్సాప్ కొత్త అప్ డేట్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసే యాప్ కాకుండా దీన్ని ఉపయోగించడం వల్ల కంపాటబిలిటీ సమస్యలు ఉండవని WABetaInfo లో ప్రచురితమైన రిపోర్ట్ వెల్లడిస్తోంది. వాట్సాప్ యూజర్ల నుంచి ఎక్కువగా వచ్చే సలహాలు, రిక్వెస్టుల్లో ఒకే అకౌంట్ ని ఎక్కువ డివైజ్ లలో ఉపయోగించే వీలు కల్పించడం అన్న పాయింట్ ఎక్కువగా వస్తుంటుంది. దీని తర్వాత ఇన్ స్టాగ్రామ్ ఐ ప్యాడ్ వర్షన్ కోసం ఎక్కువ రిక్వెస్టులు అందుతున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. అందుకే వినియోగదారులకు మెరుగైన సర్వీస్ అందించేందుకు వారి సలహాలను పరిగణనలోకి తీసుకున్నామని ప్రకటించింది.

ప్రస్తుతం వాట్సాప్ సంస్థకు 1.5 బిలియన్లకు పైగా మంత్లీ యాక్టివ్ యూజర్లున్నారు. వీరు రోజూ కనీసం 60 బిలియన్ల మెసేజ్ లను పంపడం, రిసీవ్ చేసుకోవడం చేస్తుంటారు. ఇందులో భారత్ కి చెందిన వారే దాదాపు 200 మిలియన్ యూజర్లు ఉండడం విశేషం. 2014, ఫిబ్రవరి 19న ఫేస్ బుక్ సంస్థ వాట్సాప్ ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు తర్వాతే వాట్సాప్ మరిన్ని కొత్త ఫీచర్లతో అందరికీ దగ్గరైంది.
First published:

అగ్ర కథనాలు