IPL 2019: హాట్‌స్టార్‌లో క్రికెట్ చూస్తూ... ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు

IPL 2019 Swiggy-Hotstar Deal | గత టీ20 క్రికెట్ టోర్నమెంట్ సీజన్‌లో స్విగ్గీ ఆర్డర్లు 25 శాతం పెరిగాయి. అంటే క్రికెట్ ఫ్యాన్స్ ఓవైపు మ్యాచ్‌ చూస్తూ మరోవైపు ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారని అర్థమైంది. అందుకే హాట్‌స్టార్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది.

news18-telugu
Updated: March 25, 2019, 5:44 PM IST
IPL 2019: హాట్‌స్టార్‌లో క్రికెట్ చూస్తూ... ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు
IPL 2019: హాట్‌స్టార్‌లో క్రికెట్ చూస్తూ... ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు
news18-telugu
Updated: March 25, 2019, 5:44 PM IST
ఐపీఎల్ సీజన్‌ని క్యాష్ చేసుకునేందుకు బడాబడా కంపెనీలన్నీ కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే టెలికామ్ కంపెనీలు రీఛార్జ్ ఆఫర్లు ప్రకటించాయి. ఇప్పుడు ఫుడ్ ఆర్డరింగ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ... స్ట్రీమింగ్ సర్వీస్ హాట్‌స్టార్‌తో ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. క్రికెట్ ఫ్యాన్స్ హాట్‌స్టార్‌ యాప్‌లో క్రికెట్ చూస్తే అదే యాప్‌లోంచి ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. ఇందుకోసం స్విగ్గీ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. హాట్‌స్టార్‌ యాప్‌ ఓపెన్ చేస్తే స్విగ్గీకి ఆర్డర్ వెళ్తుంది. మీకు స్విగ్గీ యాప్‌లో కనిపించే రెస్టారెంట్స్ అన్నీ హాట్‌స్టార్ యాప్‌లో కనిపిస్తాయి. క్రికెట్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా కుదుర్చుకున్న ఒప్పందం ఇది. ఇలాంటి ఒప్పందం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. గతేడాది ఐపీఎల్ సీజన్ డేటాను స్విగ్గీ విశ్లేషించింది. టీ20 క్రికెట్ టోర్నమెంట్ సీజన్‌లో స్విగ్గీ ఆర్డర్లు 25 శాతం పెరిగాయి. అంటే క్రికెట్ ఫ్యాన్స్ ఓవైపు మ్యాచ్‌ చూస్తూ మరోవైపు ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారని అర్థమైంది. అందుకే హాట్‌స్టార్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది.

క్రికెట్‌తో పాటు ఫుడ్‌ను ప్రేమించే భారతీయులకు మరిన్ని సేవలు అందించడమే హాట్‌స్టార్‌తో మా ఒప్పందం లక్ష్యం. క్రికెట్ సీజన్‌లో ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్ చూస్తూ మంచి ఫుడ్ ఎంజాయ్ చేయడం మంచి కాంబినేషన్ అని మేము నమ్ముతున్నాం.
శ్రీవాత్స్ టీఎస్, స్విగ్గీ వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్


స్విగ్గీ భారతదేశంలో 100 పట్టణాల్లో 75,000 రెస్టారెంట్లతో కార్యకలాపాలు సాగిస్తోంది. గతేడాది ఐపీఎల్ సీజన్ డేటాను పరిశీలిస్తే బెంగళూరువాసులు ఎక్కువగా పిజ్జా, చండీగఢ్‌వాసులు కడాయ్ పన్నీర్, దాల్ మఖ్నీ, బటర్ నాన్, చెన్నైవాసులు చికెన్, మటన్ బిర్యానీ ఎక్కువగా ఆర్డర్ చేశారని తేలింది.



Photos: సముద్రంలో రెస్టారెంట్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:
Loading...
WhatsApp: ఒక మెసేజ్ ఎన్నిసార్లు ఫార్వర్డ్ చేశారు? ఇక లెక్క తేల్చనున్న వాట్సప్

Photos: భారత వైమానిక దళంలోకి కొత్త హెలికాప్టర్లు... ప్రత్యేకతలు ఇవే

IRCTC-SBI Offer: రివార్డ్ పాయింట్స్‌తో రైలు టికెట్ కొనొచ్చు... ప్రాసెస్ ఇదే
First published: March 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...