Home /News /technology /

NOW YOU CAN BOOK COVID 19 VACCINE SLOTS ON WHATSAPP KNOW HOW EVK

Covid 19 Vaccine: వాట్సప్‌లో వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్‌.. వినియోగించుకోండి

(image: MyGovIndia)

(image: MyGovIndia)

మీరు కోవిడ్ 19 వ్యాక్సిన్(Vaccine) తీసుకోలేదా? వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక మీరు వాట్సప్‌లో కూడా కోవిడ్ 19 వ్యాక్సిన్ స్లాట్ బుక్(Slot Book) చేసుకోవచ్చు. వాట్సప్ ద్వారా వ్యాక్సిన్ సర్టిఫికెట్ను ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారని కేంద్రం గుర్తించి.. వాట్సాప్‌(Whatsapp) ద్వారా వ్యాక్సిన్‌ స్లాట్‌ బుకింగ్‌కి అవకాశం కల్పించింది.

ఇంకా చదవండి ...
    మీకు వాట్స‌ప్ ఉందా.. అయితే ఇక సుల‌భంగా కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవ‌చ్చు. కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ కోసం కోవిన్ యాప్‌, వెబ్ పోర్ట‌ల్ వినియోగించ‌కుండానే సుల‌భంగా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకొనే స‌దుపాయాన్ని కేంద్రం ప్ర‌వేశ పెట్టింది. ముఖ్యంగా వాట్స‌ప్ వినియోగం దేశంలో అధికంగా ఉంది. ప‌ల్లెల్లో సైతం చాలా మంది వాట్స‌ప్ వినియోస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అంద‌రూ కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవాల‌నే ఉద్దేశంలో వాట్స‌ప్ ద్వారా వ్యాక్సినేషన్ స్లాట్ బుకింక్ ప్ర‌క్రియ‌ను కేంద్రం అమలు లోకి తీసుకొచ్చింది.

    Whatsapp Color Feature: వాట్స‌ప్‌లో కొత్త ఫీచ‌ర్ వ‌స్తోంది..


    బుక్ చేయ‌డం ఎలాగో తెల‌సుకుందామా..
    Step 1 - ముందుగా మీరు ప్ర‌భుత్వం అందించిన 9013151515 నంబ‌ర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి
    Step 2 - అనంత‌రం మీ మొబైల్ నంబ‌ర్ నుంచి BOOK SLOT అని మెసెజ్ పెట్టాలి.
    Step 3 - అప్పుడు మీరు మెసేజ్ పంపిన నంబ‌ర్‌కు ఓటీపీ వస్తుంది.
    Step 4 - మీకు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేయాలి.
    Step 5 - ఆ తర్వాత మీకు దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్, వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్న తేదీ, పిన్ కోడ్, వ్యాక్సిన్ టైప్ సెలెక్ట్ చేయాలి.
    Step 6 - మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
    Step 7 - ఆ తర్వాత మీరు స్లాట్ బుక్ చేసిన సమయానికి వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చు.

    ఇప్పటికే వ్యాక్సిన్ స్లాట్స్‌ని ప్రభుత్వానికి చెందిన కోవిన్ పోర్టల్, ఆరోగ్య సేతు యాప్, ఉమాంగ్ మొబైల్ యాప్‌లో బుక్ చేసే అవకాశం ఉంది. పేటీఎం యాప్‌లో కూడా వ్యాక్సిన్ స్లాట్స్ బుక్ చేయొచ్చు. ఇప్పుడు వాట్సప్‌లో కూడా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ సదుపాయం రావడంతో ఈ పద్ధతి ఇంకా సులువైంది. వ్యాక్సిన్ తీసుకోవడం మాత్రమే కాదు... వాట్సప్ ద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ ఆగస్ట్ 5న మొదలైంది. ఇప్పటికే 32 లక్షల సర్టిఫికెట్స్‌ని వాట్సప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొన్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Corona vaccination centres, Whatsapp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు