మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ పే యాప్ ఉందా? అయితే ఇకపై మీరు గూగుల్ పే యాప్ నుంచే ఐఆర్సీటీసీ రైలు టికెట్లు బుక్ చేయొచ్చు. క్యాన్సిల్ కూడా చేయొచ్చు. ఇందుకోసం మీరు గూగుల్ పే యూపీఐ నుంచి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదనంగా ప్రాసెసింగ్ ఫీజ్ లేదా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. గూగుల్ పేలో కొత్తగా మొదలైన సేవలు ఇవి.
రైలు టికెట్ బుక్ చేయడానికి మీ ఫోన్లో ఐఆర్సీటీసీ యాప్ లేకపోయినా గూగుల్ పే యాప్ ఉంటే చాలు. టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, ట్రెయిన్ స్టేటస్ లాంటి సేవల్ని పొందొచ్చు. అయితే మీకు ముందుగానే ఐఆర్సీటీసీ అకౌంట్ ఉండాలి. గూగుల్ పే యాప్‌లో ఐఆర్సీటీసీ అకౌంట్ క్రియేట్ చేయడం మాత్రం సాధ్యం కాదు.
Read this:
IRCTC TikTok Contest: టిక్‌టాక్ యాప్ ఉందా? పాట పాడితే ఐఆర్సీటీసీ బహుమతి

గూగుల్ పేలో రైలు టికెట్ ఎలా బుక్ చేయాలి?
ముందుగా మీ గూగుల్ పే యాప్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో కిందకు స్క్రోల్ చేస్తే 'Businesses' సెక్షన్ కనిపిస్తుంది.
'Businesses' సెక్షన్లో 'Trains' ఐకాన్ పైన క్లిక్ చేయాలి.
తర్వాతి పేజీలో 'Book train tickets' క్లిక్ చేయాలి.
మీరు రైలు ఎక్కాల్సిన స్టేషన్, గమ్యస్థానం, తేదీ, కోటా వివరాలు ఎంటర్ చేయాలి.
రైలు ఎంచుకొని ఆ తర్వాత మీ ఐఆర్సీటీసీ యూజర్ నేమ్, పేరు, ఫోన్ నెంబర్, వయస్సు లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
తర్వాతి పేజీలో ఐఆర్సీటీసీ అకౌంట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాలి.
Holi 2019: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు... కలర్‌ఫుల్ ఫోటోలు చూడండి
ఇవి కూడా చదవండి:
దేవుడికి నైవేద్యంగా 101 రమ్ము బాటిళ్లు... ఆ ఆలయంలో వింత ఆచారం
Redmi Go: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... 'రెడ్మీ గో' ధర రూ.4,499 మాత్రమే
WhatsApp 2019 Features: ఈ ఏడాది వాట్సప్‌లో ఆకట్టుకుంటున్న 12 ఫీచర్లు ఇవే...Published by:Santhosh Kumar S
First published:March 20, 2019, 21:37 IST