వాట్సప్ తమ యూజర్లను ఆకట్టుకోవడానికి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ని రిలీజ్ చేస్తోంది. యూజర్ల అవసరాలను గుర్తించి వారికి ఉపయోగపడే ఫీచర్స్‌ని (WhatsApp Features) అందిస్తోంది. తాజాగా మెసేజ్ యువర్సెల్ఫ్ (Message Yourself) ఫీచర్ రూపొందించింది. అంటే మీకు మీరే మెసేజ్ చేసుకోవచ్చు. మనకు మనమే మెసేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏం ఉంటుంది అనుకుంటున్నారా? చాలామందికి ముఖ్యమైన సమాచారం ఎక్కడ దాచుకోవాలో తెలియదు. ఎక్కడెక్కడో సేవ్ చేసుకొని మర్చిపోతుంటారు. కొందరికి నోట్స్‌లో సేవ్ చేసుకోవడం అలవాటు. అయితే వాట్సప్‌లో కూడా నోట్స్ లాంటి ఫీచర్ ఉంటే బాగుంటుందని యూజర్లు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
మొత్తానికి వాట్సప్ కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. ఇక యూజర్లు తమకు తామే మెసేజ్ చేసుకోవచ్చు. ముఖ్యమైన నోట్స్, రిమైండర్స్, షాపింగ్ లిస్ట్, ఫోటోలు, వీడియోలు లాంటివన్నీ తమ ఛాట్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేకుండా తమ ఛాట్ ఓపెన్ చేస్తే చాలు. అందులో తాము దాచుకున్న వివరాలన్నీ కనిపిస్తాయి. మరి మీరు కూడా ఈ ఫీచర్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
Whatsapp Polls Feature: వాట్సప్‌లో పోల్ సింపుల్‌గా క్రియేట్ చేయండి ఇలా
ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేయండి.
కొత్త ఛాట్ క్రియేట్ చేసేందుకు క్రియేట్ న్యూ ఛాట్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
ఆ తర్వాత కాంటాక్ట్స్‌లో మీ పేరు టాప్‌లో కనిపిస్తుంది. ఓపెన్ చేయండి.
మీ పేరుతో ఛాట్ ఓపెన్ అవుతుంది. అందులో మెసేజ్ చేస్తే చాలు.
కావాలనుకుంటే మీ ఛాట్‌ను టాప్‌లో పిన్ చేసి పెట్టుకోండి. ముఖ్యమైన మెసేజెస్, ఫోటోలు, వీడియోలు మీ ఛాట్‌లోకి ఫార్వర్డ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఏదైనా విషయాన్ని నోట్ చేసుకోవాలనుకుంటే మీ ఛాట్ ఓపెన్ చేసి టైప్ చేస్తే చాలు. ఇలా మెసేజ్ యువర్సెల్ఫ్ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ అందరికీ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ ఫీచర్‌ని వాట్సప్ రోల్ అవుట్ చేస్తోంది కాబట్టి యూజర్లందరికీ త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
SBI Safety Tips: లోన్ యాప్స్‌తో జాగ్రత్త... ఈ 6 టిప్స్ పాటించమంటున్న ఎస్బీఐ
ఇక వాట్సప్ ఇటీవల మరిన్ని ఫీచర్స్ వచ్చాయి. వాట్సప్ గ్రూప్స్ అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు కమ్యూనిటీస్ ఫీచర్ రిలీజ్ చేసింది. వాట్సప్ గ్రూప్‌లో పోల్స్ క్రియేట్ చేయడానికి పోల్స్ ఫీచర్ రిలీజ్ చేసింది. వీడియో కాల్లో 32 మంది ఒకేసారి పార్టిసిపేట్ చేయడంతో పాటు, వాట్సప్ గ్రూప్‌లో 1024 మంది సభ్యుల్ని చేర్చడానికి లిమిట్ కూడా పెంచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Whatsapp