Home /News /technology /

NOW UNLOCK IPHONE WITH MASK ON WITHOUT APPLE WATCH AS IOS BETA BRINGS HIGHLY REQUESTED FACE ID FEATURE MK GH

Apple Face ID: మాస్క్​ ఉన్నా ఫేస్ ​ఐడీతో ఫోన్ అన్​లాక్.. ఐఫోన్ న్యూ ఫీచర్స్​ లీక్!

Apple Face ID

Apple Face ID

ఫేస్​ మాస్క్ ధరించినప్పటికీ ఫోన్ అన్​లాక్ అయ్యే ఫీచర్(Apple new features)​ కోసం యాపిల్ సంస్థకు ఐఫోన్ యూజర్స్ నుంచి భారీఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. దీనికి అనుగుణంగా iOS 15.4 బీటా ఫేస్ ఐడీ(Apple Face ID) ఫీచర్‌ని టెక్ దిగ్గజం అందుబాటులోకి తీసుకురానుంది.

ఇంకా చదవండి ...
మనలో చాలామంది ఫేస్​ ఐడీని(Face ID) ఉపయోగించి ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుంటాం. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా బయటకు వెళ్లిన సమయాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి అయింది. ఇలాంటప్పుడు ఫోన్‌ను అన్‌లాక్ చేయడం అంటే కాస్త ఇబ్బందే. ఎందుకంటే మాస్క్ ఉంటే ఫోన్‌ను అన్‌లాక్ చేయలేం. యాపిల్ వాచ్​ను(Apple Watch) ఉపయోగించి అన్​లాక్ చేయగలిగినప్పటికీ వైరస్​ భయాలతో ఈ మధ్య చాలామంది వాచ్​లను ధరించట్లేదట. దీంతో ఫేస్​ మాస్క్ ధరించినప్పటికీ ఫోన్ అన్​లాక్ అయ్యే ఫీచర్(Apple new features)​ కోసం యాపిల్ సంస్థకు ఐఫోన్ యూజర్స్ నుంచి భారీఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. దీనికి అనుగుణంగా iOS 15.4 బీటా ఫేస్ ఐడీ(Apple Face ID) ఫీచర్‌ని టెక్ దిగ్గజం అందుబాటులోకి తీసుకురానుంది. వాచ్ అవసరం లేకుండానే మాస్క్‌తోనే ఫేస్ ఐడీని ఉపయోగించగల సామర్థ్యాన్ని యాపిల్ పరీక్షిస్తున్నట్లు సమాచారం.

WhatsApp: వాట్స‌ప్ వాడుతున్నారా.. అయితే ఈ ఫీచ‌ర్స్‌.. జాగ్ర‌త్త‌లు తెలుసుకోండి!

ఫేస్ ఐడీ అనేది అత్యంత కచ్చితమైన భద్రతా ప్రమాణం. ప్రస్తుత ఫీచర్(Iphone new features) గురించి యాపిల్ వెబ్​సైట్ సమాచారం ప్రకారం.. ఓ ఐఫోన్ యూజర్ మాస్క్ ధరించి ఉన్నప్పుడు ఫేస్ ఐడీని సెట్ చేసుకునేందుకు వారి కంటి చుట్టూ ఉన్న ప్రత్యేక లక్షణాలను ఫోన్ గుర్తించగలదు. ఈ సామర్థ్యం విజయవంతంగా పరీక్షించిన అనంతరం వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. ఫలితంగా మాస్క్‌ ధరించి, ఫేస్ ఐడీని ఉపయోగించి తమ ఫోన్‌లను అన్‌లాక్ చేయగలరు.

ఇక ఒక యూజర్ మాస్క్ ధరించి ఫేషియల్ రికగ్నిషన్‌ని ఎంచుకున్నప్పటికీ, ఫేస్ ఐడీని సెటప్ చేసుకునేటప్పుడు వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని సమాచారం. ఈ ఫీచర్ ప్రారంభమైతే సెట్టింగ్‌ల్లో ఫేస్ ఐడీ, పాస్‌కోడ్ ట్యాబ్‌లో అందుబాటులో ఉండనుది. ఇక్కడ ఫేస్ ఐడీ విత్ మాస్క్‌ అనే ఆప్షన్​ను ఎంచుకోగలుగుతారు. ఈ ఫీచర్​ గురించి ఐఫోన్(iPhone) లవర్స్ ఎగ్జైట్​మెంట్​ ఫీల్​ అవుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం iOS వినియోగదారులు మాస్క్ ధరించి ఫేస్ ఐడీ ద్వారా అన్‌లాక్ చేయాలంటే యాపిల్ వాచ్ ద్వారా మాత్రమే సాధ్యం. చాలా మంది ఐఫోన్ వినియోగదారులు యాపిల్ వాచ్​( Apple Watch) లేదు.

Redmi Note 11 Series: రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్‌లు.. అదిరిపోయే ఫీచ‌ర్స్‌.. అందుబాటు ధ‌ర‌ల్లో!

కళ్లద్దాలతోనూ అన్​లాక్
ఈ ప్రయోగాత్మక వెర్షన్​ను విడుదల చేసిన యాపిల్.. ఫేస్ ఐడీ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచే చర్యల్లో భాగంగా iOS 15.4 వెర్షన్​తో అద్దాలు ధరించి సైతం తమ ఫోన్‌లను అన్‌లాక్ చేయవచ్చని సమాచారం. సన్ గ్లాసెస్ కాకుండా సాధారణ గ్లాసెస్ ధరించినప్పుడు కూడా ఫోన్ అన్‌లాక్ చేయొచ్చట. ఈ కొత్త ఫేస్ ఐడీ ఫీచర్ ఐఫోన్​ 12(iPhone 12)తో పాటు తర్వాతి వెర్షన్​లలో మాత్రమే పని చేస్తుంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Apple, Apple store, Iphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు