iPhone 12: ఐఫోన్ 12 లాంచింగ్ డేట్ ఫిక్స్.. ఫీచర్స్ ఇవేనా?

యాపిల్ సంస్థ తీసుకొచ్చే ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మంది వినియోగదారుల్లో ఉంటుంది. త్వరలో విడుదల కానున్న ఐఫోన్ 12కు సంబంధించి కూడా చాలా మంది వినియోగదారులు అలానే ఎదురుచూస్తున్నారు.

news18-telugu
Updated: October 8, 2020, 10:20 AM IST
iPhone 12: ఐఫోన్ 12 లాంచింగ్ డేట్ ఫిక్స్.. ఫీచర్స్ ఇవేనా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యాపిల్ సంస్థ తీసుకొచ్చే ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మంది వినియోగదారుల్లో ఉంటుంది. త్వరలో విడుదల కానున్న ఐఫోన్ 12కు సంబంధించి కూడా చాలా మంది వినియోగదారులు అలానే ఎదురుచూస్తున్నారు. అయితే ఆ నిరీక్షణకు ముగింపు పలికే సమయం వచ్చింది. తాజాగా ఐఫోన్-12 విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 13న భారత కాలమానం ప్రకారం 10.30 గంటలకు జరగనున్న డిజిటల్ ఈవెంట్‌లో ఐఫోన్ 12 సిరీస్‌ను విడుదల చేయనున్నారు.

నాలుగు మోడల్స్‌లో ఐఫోన్ 12..!

ఐఫోన్ 12లో ఉండే సరికొత్త, ఫాస్టెస్ట్ నెట్ వర్కింగ్ సామర్థ్యాలను యాపిల్ సంస్థ ఈవెంట్ ఇన్విటేషన్‌లో సూత్రప్రాయంగా పేర్కొంది. అయితే ఐఫోన్ 12 ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కానీ, నాలుగు మోడల్స్‌లో ఐఫోన్ 12ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్టుగా తెలుస్తోంది. ఐఫోన్ 12 మిని-5.4 ఇంచులు, ఐఫోన్ 12- 6.1 ఇంచులు, ఐఫోన్ 12 ప్రో- 6.1 ఇంచులు, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ -6.7 ఇంచుల స్క్రీన్‌లతో కూడిన నాలుగు మోడల్స్ విడుదల కానున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఐఫోన్ 12 లాంచింగ్ ఈవెంట్‌లో 5G కనెక్టివిటీతో కూడిన సరికొత్త ఐఫోన్ వర్షన్‌ను ప్రదర్శించనున్నట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఐఫోన్ 12 ప్రారంభ ధర 699 డాలర్ల నుంచి 799 డాలర్ల(భారత కరెన్సీలో దాదాపు రూ. 51 వేల నుంచి 59 వేలు ) మధ్య ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, ఐఫోన్ 12 మ్యాక్స్ ప్రారంభ ధర 799 డాలర్ల నుంచి 849 డాలర్ల మధ్య(భారత కరెన్సీలో దాదాపు రూ. 58 వేల నుంచి 62.5 వేలు) , ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ధర 1,100 డాలర్ల నుంచి 1,200 డాలర్ల(భారత కరెన్సీలో దాదాపు రూ. 80 వేల నుంచి 88 వేలు) మధ్య ఉండనున్నట్టుగా కథనాలు వెలువడ్డాయి.

ఇక, ఐఫోన్ 12 ప్రోలో 120 హెడ్జ్ ప్రోమోషన్ డిస్‌ప్లే వాడుతున్నారు. ఈ నాలుగు ఐఫోన్ మోడల్స్ కూడా OLED డిస్‌ప్లేతో పాటుగా, 5G సపోర్ట్ చేయనున్నట్టుగా ఫారిన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంట్రీ లేవల్ ఐఫోన్ 12.. 64 జీబీ స్టోరేజీతో పాటు.. బ్లాక్, వైట్, రెడ్, బ్లూ, యెల్లో, కోరల్ కలర్స్‌లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
Published by: Sumanth Kanukula
First published: October 8, 2020, 10:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading