• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • NOW RELIANCE JIO USERS CAN RECHARGE THEIR JIO NUMBER ON WHATSAPP KNOW HOW SS

Jio Recharge via WhatsApp: వాట్సప్‌లో జియో సిమ్‌కు రీఛార్జ్ చేయండి ఇలా

Jio Recharge via WhatsApp: వాట్సప్‌లో జియో సిమ్‌కు రీఛార్జ్ చేయండి ఇలా

Jio Recharge via WhatsApp: వాట్సప్‌లో జియో సిమ్‌కు రీఛార్జ్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Jio Recharge via WhatsApp | వాట్సప్ యాప్ ద్వారా మీ జియో మొబైల్ నెంబర్‌కు రీఛార్జ్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
    మీరు రిలయెన్స్ జియో కస్టమరా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇకపై మీరు వాట్సప్‌లోనే మీ సిమ్ రీఛార్జ్ చేయొచ్చు. మీ జియో సిమ్ మాత్రమే కాదు మీ కుటుం సభ్యులు, స్నేహితుల నెంబర్లకు కూడా వాట్సప్ నుంచే రీఛార్జ్ చేయొచ్చు. రిలయెన్స్ జియో కొత్తగా 'రీఛార్జ్ వయా వాట్సప్' సర్వీస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రీఛార్జ్ కోసం వేరే యాప్స్ ఉపయోగించకుండా వాట్సప్ ద్వారా చేయొచ్చు. ఇందుకోసం మీరు రిలయెన్స్ జియో వాట్సప్ నెంబర్ సేవ్ చేసుకుంటే చాలు. వాట్సప్ ద్వారా పలు సేవల్ని అందించేందుకు జియో 70007 70007 నెంబర్‌ను కేటాయించింది. యూజర్లు ఈ నెంబర్ ద్వారా జియో సేవల్ని పొందొచ్చు. రీఛార్జ్ మాత్రమే కాదు కొత్త జియో సిమ్, జియోకు పోర్ట్ కావడం, జియో సిమ్ సపోర్ట్, జియో ఫైబర్ సపోర్ట్, ఇంటర్నేషనల్ రోమింగ్ సపోర్ట్, జియో మార్ట్ సపోర్ట్ సేవలు జియో వాట్సప్ నెంబర్ ద్వారా లభిస్తాయి. అంతే కాదు మీకు దగ్గర్లో కోవిడ్ 19 వ్యాక్సిన్ ఎక్కడ అందుబాటులో ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి సేవలన్నింటినీ వాట్సప్ ద్వారా అందించేందుకు జియో ఈ సర్వీస్ ప్రారంభించింది. మరి మీ జియో నెంబర్‌కు వాట్సప్ ద్వారా ఎలా రీఛార్జ్ చేయాలో తెలుసుకోండి.

    Best Smartphones Under Rs 20,000: కొత్త మొబైల్ కొంటున్నారా? రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

    Poco M3 Pro 5G: పోకో ఇండియా సంచలనం... రూ.13,999 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్


    Jio Recharge via WhatsApp: వాట్సప్ ద్వారా జియో నెంబర్ రీఛార్జ్ చేయండి ఇలా


    ముందుగా మీ ఫోన్‌లో 70007 70007 నెంబర్ సేవ్ చేయండి.
    ఆ తర్వాత వాట్సప్‌లో ఆ నెంబర్ ఓపెన్ చేసి HI అని మెసేజ్ పంపండి.
    జియో నెంబర్ నుంచి రిప్లై వచ్చిన తర్వాత వాట్సప్‌లో జియో అందించే సేవలు పొందొచ్చు.
    జియో నెంబర్‌లో కనిపించే మెయిన్ మెనూ పైన క్లిక్ చేయండి.
    అందులో కొన్ని ఆప్షన్స్ వస్తాయి.
    ఆ ఆప్షన్స్‌లో Jio SIM Recharge సెలెక్ట్ చేసి Send పైన క్లిక్ చేయాలి.
    ఆ తర్వాత వాట్సప్‌లో జియో నుంచి మెసేజ్ వస్తుంది.
    అందులో Jio Mobile Recharge పైన క్లిక్ చేయాలి.
    View All Plans సెలెక్ట్ చేసి Send పైన క్లిక్ చేయాలి.
    ఆ నెంబర్ పైన ఉన్న ప్లాన్స్ వివరాలన్నీ వస్తాయి.
    Explore plans పైన క్లిక్ చేస్తే జియో సైట్ లింక్ ఓపెన్ అవుతుంది.
    లింక్ క్లిక్ చేస్తే జియో వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.
    అందులో ప్లాన్ ఎంచుకొని పేమెంట్ చేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు