Home /News /technology /

NOW COVID 19 VACCINE SLOTS CAN BOOK VIA GOOGLE SEARCH AND GOOGLE MAPS ON COWIN APP KNOW HOW TO DO SS GH

Covid 19 Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేయాలా? గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే చాలు

Covid 19 Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేయాలా? గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే చాలు
(ప్రతీకాత్మక చిత్రం)

Covid 19 Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేయాలా? గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే చాలు (ప్రతీకాత్మక చిత్రం)

Covid 19 Vaccination | కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్నారా? కోవిడ్ 19 వ్యాక్సిన్ (Covid 19 Vaccine) కోసం స్లాట్ బుక్ (Slot Booking) చేయాలనుకుంటున్నారా? గూగుల్ సెర్చ్ (Google Search) లేదా గూగుల్ మ్యాప్స్ (Google Maps) ఓపెన్ చేస్తే చాలు. ఎలాగో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
కరోనా వైరస్ థర్డ్​ వేవ్​ (Covid 19 Third Wave) హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్​పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రజలు ఇంట్లోనే కూర్చొని కోవిడ్ 19 వ్యాక్సిన్ స్లాట్ బుక్​ (Covid 19 Vaccine Slot Booking) చేసుకునేందుకు కోవిన్​ యాప్​ను (Cowin App) అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు వాట్సాప్​ వంటి సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ల ద్వారా స్లాట్​ బుక్​ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. తాజాగా గూగుల్​ సెర్చ్​తోనూ (Google Search) వ్యాక్సిన్​ అపాయింట్​మెంట్​ బుక్​ చేసుకునే వీలు కల్పించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్​ మాండవీయ ట్విట్టర్​ వేదికగా బుధవారం వెల్లడించారు.

ఆయన ట్వీట్​ చేస్తూ ‘‘కొవిడ్​ టీకాల సమాచారాన్ని సులభంగా ప్రజలకు తెలియజేసేలా మరో ముఖ్యమైన సుదుపాయం తీసుకొచ్చాం. గూగుల్​ సెర్చ్​ ఇంజిన్​లో ‘కోవిడ్​ వ్యాక్సిన్​ నియర్​ మి’ అని సెర్చ్​ చేయండి. టీకా స్లాట్ల లభ్యత, ఇతర వివరాలు క్షణాల్లో తెలుసుకోండి. అక్కడే ఉన్న బుక్​ అపాయింట్​మెంట్​పై క్లిక్​ చేసి మీ టీకా స్లాట్ బుక్​ చేసుకోండి.” అని పేర్కొన్నారు.​

Samsung Galaxy M32 5G: కాసేపట్లో సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ సేల్... రూ.2,000 డిస్కౌంట్

గూగుల్​ ద్వారా కోవిన్​ యాప్​లో అపాయింట్‌మెంట్ బుక్ చేయండి ఇలా


Step 1- గూగుల్ సెర్చ్ లేదా గూగుల్ మ్యాప్స్‌ను ఓపెన్ చేయండి.

Step 2- గూగుల్‌ సెర్చ్ బార్‌లో ‘కోవిడ్ వ్యాక్సిన్ నియర్ మి’ అని సెర్ఛ్ చేయండి.

Step 3- స్లాట్ల లభ్యత, మరిన్ని వివరాలను తనిఖీ చేయండి.

Step 4- 'బుక్ అపాయింట్‌మెంట్'పై క్లిక్ చేయండి.

Step 5- మీ దగ్గర్లోని టీకా కేంద్రాన్ని ఎంపిక చేసుకొని స్లాట్‌ బుక్ చేసుకోండి.

Samsung Galaxy A52s 5G: సాంసంగ్ నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... ధర ఎంతంటే

గూగుల్​ కూడా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. గూగుల్ సెర్చ్, మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్ ద్వారా.. దేశ వ్యాప్తంగా 13 వేలకుపైగా ప్రాంతాల్లో టీకా లభ్యత, అపాయింట్​మెంట్​ వివరాలను వినియోగదారులు తెలుసుకోవచ్చని వెల్లడించింది. కోవిన్​ యాప్​​ నుంచి తీసుకున్న రియల్​ టైం డేటా సహకారంతో ఈ సమాచారాన్ని అందిస్తున్నట్లు తెలిపింది.

ప్రతి వ్యాక్సిన్​ కేంద్రంలో అందుబాటులో ఉన్న స్లాట్లు, టీకాలు, డోసులు ఉచితంగానే అందిస్తున్నారా? లేదా? వంటి వివరాలను గూగుల్​ సెర్చ్​ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది. కేవలం ఇంగ్లీష్​లోనే కాకుండా హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, గుజరాతీ, మరాఠీతో సహా ఎనిమిది భారతీయ భాషలలో టీకా సమాచారం అందిస్తున్నట్లు గూగుల్​ వెల్లడించింది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Corona vaccination centres, Corona Vaccine, COVID-19 vaccine, Cowin Portal, Google Maps, Google search

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు