Home /News /technology /

NOTHING WIRELESS EARBUDS INDIA PRICE CONFIRMED RS 5999 WITH ACTIVE NOISE CANCELLATION MK GH

Nothing Wireless Earbuds: త్వరలోనే నథింగ్ నుంచి తొలి వైర్​లెస్​ ఇయర్​బడ్స్.. ధర ఎంతంటే?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

భారత ఎలక్ట్రానిక్​ మార్కెట్​లోకి అడుగు పెట్టేందుకు నథింగ్​ కంపెనీ సిద్ధమవుతోంది. ఈ సంస్థ తన తొలి ప్రోడక్ట్ అయిన ‘ఇయర్​ 1’ వైర్​లెస్​ ఇయర్​ఫోన్​ను భారత మార్కెట్​లోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఇయర్​ బడ్స్​ ధరను వెల్లడించింది. ఇది రూ .5,999 ధర వద్ద లభించనుంది.

ఇంకా చదవండి ...
భారత ఎలక్ట్రానిక్​ మార్కెట్​లోకి అడుగు పెట్టేందుకు నథింగ్​ కంపెనీ సిద్ధమవుతోంది. ఈ సంస్థ తన తొలి ప్రోడక్ట్ అయిన ‘ఇయర్​ 1’ వైర్​లెస్​ ఇయర్​ఫోన్​ను భారత మార్కెట్​లోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఇయర్​ బడ్స్​ ధరను వెల్లడించింది. ఇది రూ .5,999 ధర వద్ద లభించనుంది. కాగా, గ్లోబల్ మార్కెట్​లో మాత్రం £ 99 వద్ద లభించనుంది. ప్రముఖ ఈ–కామర్స్​ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇది అమ్మకానికి రానుంది. ​ భారతదేశం అంతటా ఇయర్​ 1ను వినియోగదారులకు అందించడానికి ఈ–కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​తో ఒప్పందం చేసుకుంది. ఫ్లిప్​కార్ట్​ నోకాస్ట్ ఈఎంఐ, ఫ్రీ డెలివరీ వంటి ఆప్షన్లతో దీన్ని అందుబాటులోకి తేనుంది. యాక్టివ్​ నాయిస్​ క్యాన్సలేషన్​తో వస్తోన్న ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ ద్వారా వినియోగదారులకు సరికొత్త అనుభూతిని పంచాలని నథింగ్​ భావిస్తోంది.

ఇయర్​ 1 పారదర్శకత, ఐకానిక్​ ఫామ్​, నాణ్యమైన పనితీరు ఆకట్టుకుంటాయని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇయర్​ 1 లాంచింగ్​పై నథింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ మను శర్మ మాట్లాడుతూ ‘‘దేశం నలుమూలలా ఉత్పత్తులను సరఫరా చేయగల సామర్థ్యం ఉన్న ఫ్లిప్​కార్ట్​ ద్వారా వినియోగదారులకు తమ ఉత్పత్తులు చేరుకోవడం, అలాగే ఎండ్​ టు ఎండ్​ ఉత్పత్తి అనుభవాన్ని అందించడం మాకు చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నాం. అందుకే ఈ కామర్స్​ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో మా ఇయర్​ 1 వైర్​లెస్​ ఇయర్​ బడ్స్​ను విడుదల చేస్తున్నాం. గ్లోబల్​ మార్కెట్​లోకి లాంచ్ చేసే సమయంలోనే భారతీయ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నాం.’’ అని ఆయన అన్నారు.



ఆడియో డివైజెస్​కు పెరుగుతున్న ఆదరణ..

కాగా, ఈ ఒప్పందంపై ఫ్లిప్​కార్ట్​లోని ఎలక్ట్రానిక్స్ సీనియర్ డైరెక్టర్ రాకేశ్ కృష్ణన్ మాట్లాడుతూ ‘‘భారతదేశంలో​ ఆడియో డివైజ్​లకు ఆదరణ పెరుగుతోంది. మహమ్మారి కారణంగా వర్క్​ ఫ్రం హోమ్​, ఆన్​లైన్​ క్లాసెస్​ కల్చర్ పెరగడంతో నాణ్యత గల ఆడియో డివైజెస్​కు మంచి డిమాండ్​ ఏర్పడింది. అన్ని అవసరాలకు తగినట్లుగా అధిక పనితీరు గల పరికరాలను కోరుకునే కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది.’’ అని అన్నారు. కాగా, ప్రస్తుతం ఇదే ధర వద్ద భారత మార్కెట్​లో లభిస్తున్న వన్‌ప్లస్ బడ్స్, శామ్‌సంగ్ గెలాక్సీ బడ్స్ + వంటి ఉత్పత్తులకు నథింగ్ ఇయర్ (1) వైర్‌లెస్ ఇయర్‌బడ్స్​ గట్టి పోటీనివ్వనుంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Gadget, Latest Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు