హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Nothing Smart Phone: స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లోకి నథింగ్​ కంపెనీ.. త్వరలోనే తొలి స్మార్ట్​ ఫోన్ లాంచ్.. వివరాలిలా..

Nothing Smart Phone: స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లోకి నథింగ్​ కంపెనీ.. త్వరలోనే తొలి స్మార్ట్​ ఫోన్ లాంచ్.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటికే మార్కెట్లో ఉన్న కంపెనీలతో పాటు ప్రస్తుతం నథింగ్(Nothing) కంపెనీ కూడా తన స్మార్ట్ ఫోన్​ను రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తోంది. ఇటీవల నథింగ్ నుంచి వస్తున్న సంకేతాలను చూస్తుంటే ఈ కంపెనీ త్వరలోనే స్మార్ట్​ ఫోన్​ను రిలీజ్ చేయనుందని ఇట్టే అర్థమవుతోంది.

ఇంకా చదవండి ...

మార్కెట్లోఇప్పటికే అనేక స్మార్ట్​ ఫోన్లు(Smart Phone) ఉన్నాయి. ఇప్పుడు స్మార్ట్​ ఫోన్లదే ప్రపంచం. ఎవరి చేతిలోనైనా(Hand) సరే చూస్తే స్మార్ట్ ఫోన్ తప్పక దర్శనమిస్తుంది. చాలా మంది స్మార్ట్ ఫోన్ లేకుండా బెడ్(Bed) దిగడం లేదు.స్మార్ట్ ఫోన్​తో ఎన్ని రకాల ఉపయోగాలున్నాయో.. అన్నే దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయినా కూడా చాలా మంది స్మార్ట్ ఫోన్లను వాడుతూ ఉంటారు. టెకీలు (Techie) మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కంపెనీలతో పాటు ప్రస్తుతం నథింగ్(Nothing) కంపెనీ కూడా తన స్మార్ట్ ఫోన్​ను రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తోంది. ఇటీవల నథింగ్ నుంచి వస్తున్న సంకేతాలను చూస్తుంటే ఈ కంపెనీ త్వరలోనే స్మార్ట్​ ఫోన్​ను రిలీజ్ చేయనుందని ఇట్టే అర్థమవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్(Smartphone) ఈ నెలలోనే విడుదల అవుతుందని తెలుస్తుంది. ఈ ఫోన్ గురించి అనేక మంది టెకీలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నెలలోనే ఎప్పుడు స్మార్ట్ ఫోన్ వస్తుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు.

Work From Home: పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పెరిగిన పాపులారిటీ.. రిమోట్ కల్చర్‌పై ఆసక్తి చూపుతున్న కంపెనీలు ఇవే..!


క్వాల్​కామ్​ చిప్​సెట్​తో..

ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్​కమ్(Qualcomm) చిప్​ను ఉపయోగించనుందని అందరూ భావిస్తున్నారు. ఇటీవల క్వాల్​కమ్, నథింగ్ కంపెనీలు సన్నిహితంగా ఉంటున్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​నుPDA (పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్)తో డిజైన్​ చేయనుంది.ఈ వారంలోనే బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్​ కాంగ్రెస్ (MWC 2022) నథింగ్ కంపెనీ ఫౌండర్ కార్ల్​ పీతో క్వాల్​కామ్ నుంచి వచ్చిన ఎన్రికో సాల్వటోరితో కలిసి కనిపించాడు. ఈ విషయం టెక్ వర్గాల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ త్వరలోనే రాబోతుందని అంతా అనుకుంటున్నారు.

నథింగ్​ ఇయర్​బడ్స్​కు ఫుల్​ డిమాండ్​..

నథింగ్ నుంచి వచ్చే మొదటి స్మార్ట్ ఫోన్ క్వాల్ కామ్ ప్రాసెసర్​తో వస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12తో పనిచేయనుందని కార్ల్​పీ చిన్న హింట్ ఇచ్చాడు. నథింగ్ నుంచి వచ్చిన ఇయర్ 1 ఇయర్ బర్డ్స్​లో గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, యాపిల్ ఫోన్ సిరి సపోర్ట్ కూడా లభించనుంది. ఇందుకు సంబంధించి ఈ బడ్స్​ను కంపెనీ రీసెంట్​గా అప్​డేట్ చేసింది. వన్​ ప్లస్ సహవ్యవస్థాపకుడిగా ఉన్న కార్ల్ అనేక మార్కెటింగ్ వ్యూహాలతో కంపెనీని అభివృద్ధి పథంలో నడిపాడు.

ఇక ఇతడే ప్రస్తుతం నథింగ్ మొబైల్ కంపెనీని లాంచ్ చేయడం వలన అందరి దృష్టి దీని మీద పడింది. ఆండీ రూబిన్ నుంచి కంపెనీ ఏ ఎసెన్షియల్​ను కొనుగోలు చేయలేదు. కంపెనీ ఫోన్​ను త్వరలోనే విడుదల చేసేందుకు ఇది సహాయపడుతుందని అంతా భావిస్తున్నారు. కానీ ఈ నెలలో నథింగ్ నుంచి కేవలం ఈ స్మార్ట్ ఫోన్ మాత్రమే విడుదలయ్యే అవకాశం లేదు. ఇక ఈ నెల చివరలో నథింగ్ పవర్ బ్యాంక్ సరసన నథింగ్ స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ అవుతుందని అంతా భావిస్తున్నారు. నథింగ్ వన్ ఇయర్ బర్డ్స్ విషయంలో ఇంకా మార్కెట్లో లాంచ్ చేయలేదు.

Published by:Veera Babu
First published:

Tags: Nothing, Smart phone, Technology

ఉత్తమ కథలు