Home /News /technology /

NOTHING PHONE 1 VS ONEPLUS NORD 2T 5G CHECK HERE FOR COMPARISON AND KNOW ABOUT WHICH IS THE BEST SMARTPHONE SS

Nothing vs OnePlus: నథింగ్ ఫోన్ 1, వన్‌ప్లస్ నార్డ్ 2టీ... ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

Nothing vs OnePlus: నథింగ్ ఫోన్ 1, వన్‌ప్లస్ నార్డ్ 2టీ... ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

Nothing vs OnePlus: నథింగ్ ఫోన్ 1, వన్‌ప్లస్ నార్డ్ 2టీ... ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

Nothing Phone 1 vs OnePlus Nord 2T 5G | లేటెస్ట్‌గా రిలీజైన వన్‌ప్లస్ నార్డ్ 2టీ కొనాలా? లేక నథింగ్ ఫోన్ 1 కొనాలా అన్న డైలమాలో ఉన్నారా? ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల మధ్య తేడాలు గమనిస్తే క్లారిటీ వస్తుంది.

వన్‌ప్లస్ కో-ఫౌండర్ కార్ల్ పెయి స్థాపించిన నథింగ్ బ్రాండ్ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్‌తో పాటు ఇతర బ్రాండ్ల ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇస్తుందన్న చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల రిలీజైన వన్‌ప్లస్ నార్డ్ 2టీ (OnePlus Nord 2T) మొబైల్‍‌తో నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్‌ను కంపేర్ చేసి చూస్తున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు దాదాపు ఒకే బడ్జెట్ రేంజ్‌లో ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 2టీ వన్‌ప్లస్ నుంచి రిలీజైన లేటెస్ట్ మోడల్ కావడం, కొన్ని రోజుల గ్యాప్‌లోనే నథింగ్ ఫోన్ 1 రిలీజ్ కావడంతో ఈ రెండు మొబైల్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. మరి వన్‌ప్లస్ నార్డ్ 2టీ, నథింగ్ ఫోన్ 1 మధ్య తేడాలేంటీ తెలుసుకోండి.


























































 స్పెసిఫికేషన్స్ నథింగ్ ఫోన్ 1 వన్‌ప్లస్ నార్డ్ 2టీ
 డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓలెడ్ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే
 ర్యామ్, స్టోరేజ్ 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ
 ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ+మీడియాటెక్ డైమెన్సిటీ 1300
 రియర్ కెమెరా 50 మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్ + 50 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ Samsung JN1 సెన్సార్ 50 మెగాపిక్సెల్ Sony IMX766 ప్రైమరీ సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్
 ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ Sony IMX471 సెన్సార్32 మెగాపిక్సెల్ Sony IMX615 సెన్సార్
 బ్యాటరీ 4,500ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 15వాట్ వైర్‌లైస్ ఛార్జింగ్, 5వాట్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్) 4,500ఎంఏహెచ్ (80వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
 ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 12 + నథింగ్ ఓఎస్ ఆక్సిజన్ ఓఎస్ 12.1 + ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌
 సిమ్ సపోర్ట్ డ్యూయెల్ సిమ్ డ్యూయెల్ సిమ్
 కలర్స్ వైట్, బ్లాక్ గ్రే షాడో, జేడ్ ఫాగ్
 ధర

8జీబీ+128జీబీ- రూ.32,999,

8జీబీ+256జీబీ- రూ.35,999,

12జీబీ+256జీబీ- రూ.38,999


8జీబీ+128జీబీ- రూ.28,999,

12జీబీ+256జీబీ- రూ.33,999

ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల మధ్య తేడాలు చూస్తే నథింగ్ ఫోన్ 1 మొబైల్‌లో డిస్‌ప్లే పెద్దగా ఉంది. రిఫ్రెష్ రేట్ కూడా ఎక్కువ. నథింగ్ ఫోన్ 1 మూడు వేరియంట్లలో లభిస్తే, వన్‌ప్లస్ నార్డ్ 2టీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే వన్‌ప్లస్ నార్డ్ 2టీ మొబైల్‌లో ప్రాసెసర్ పెర్ఫామెన్స్ ఎక్కువగా ఉంటుంది. రెండు మొబైల్స్‌లో మెయిన్ కెమెరా సెన్సార్ ఒకటే ఉంది. నథింగ్ ఫోన్ 1 లో సెకండరీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కావడం విశేషం.

Samsung Price Cut: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గించిన సాంసంగ్... 8GB ర్యామ్, 5,000mAh బ్యాటరీ, 48MP కెమెరా

ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వన్‌ప్లస్ నార్డ్ 2టీ మొబైల్‌దే పైచేయి. ఇందులో 32 మెగాపిక్సెల్ Sony IMX615 సెన్సార్‌తో ఫ్రంట్ కెమెరా ఉంది. నథింగ్ ఫోన్ 1 ‌స్మార్ట్‌ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రెండు మొబైల్స్‌లో బ్యాటరీ కెపాసిటీ ఒకేలా ఉంది. కానీ వన్‌ప్లస్ నార్డ్ 2టీ మొబైల్‌లో 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం విశేషం. ఇక ధర విషయానికి వస్తే నథింగ్ ఫోన్ 1 ‌కన్నా వన్‌ప్లస్ నార్డ్ 2టీ 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.4,000 తక్కువకు, 12జీబీ+256జీబీ వేరియంట్ రూ.5,000 తక్కువకు లభిస్తోంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Nothing, Oneplus, Smartphone

తదుపరి వార్తలు