Home /News /technology /

NOTHING PHONE 1 VS MOTOROLA EDGE 30 KNOW ABOUT WHICH IS THE BEST SMARTPHONE WITH QUALCOMM SNAPDRAGON 778G PLUS PROCESSOR SS

Nothing Phone 1 vs Motorola Edge 30: ఒకే ప్రాసెసర్‌తో నథింగ్ ఫోన్ 1, మోటోరోలా ఎడ్జ్ 30... వీటిలో ఏది బెస్ట్?

Nothing Phone 1 vs Motorola Edge 30: ఒకే ప్రాసెసర్‌తో నథింగ్ ఫోన్ 1, మోటోరోలా ఎడ్జ్ 30... వీటిలో ఏది బెస్ట్?

Nothing Phone 1 vs Motorola Edge 30: ఒకే ప్రాసెసర్‌తో నథింగ్ ఫోన్ 1, మోటోరోలా ఎడ్జ్ 30... వీటిలో ఏది బెస్ట్?

Nothing Phone 1 vs Motorola Edge 30 | నథింగ్ ఫోన్ 1 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్‌తో రిలీజైంది. ఇప్పటికే ఇండియాలో మోటోరోలా ఎడ్జ్ 30 (Motorola Edge 30) మొబైల్ కూడా ఇదే ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. దీంతో ఈ రెండు మొబైల్స్‌ని యూజర్లు కంపేర్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో ఒకేసారి ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. కొన్ని నెలలుగా వస్తున్న లీక్స్‌కు తెరపడింది. నథింగ్ ఫోన్ 1 మొబైల్ ఫీచర్స్ అన్నీ అధికారికంగా తెలిసిపోయాయి. ఏ స్మార్ట్‌ఫోన్ పనితీరునైనా డిసైడ్ చేసేది ప్రాసెసర్. నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్ ఉంది. ఇప్పటికే ఇండియాలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో చాలా మొబైల్స్ ఉన్నాయి. కానీ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌తో మోటోరోలా ఎడ్జ్ 30 (Motorola Edge 30) మోడల్ ఉంది. మరి నథింగ్ ఫోన్ 1, మోటోరోలా ఎడ్జ్ 30 మధ్య తేడాలు ఏంటీ? వీటిలో ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్? తెలుసుకోండి.


























































 స్పెసిఫికేషన్స్ నథింగ్ ఫోన్ 1 మోటోరోలా ఎడ్జ్ 30
 డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓలెడ్ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓలెడ్ డిస్‌ప్లే
 ర్యామ్, స్టోరేజ్ 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ
 ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ+క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ+
 రియర్ కెమెరా 50 మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్ + 50 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ Samsung JN1 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 50మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ అండ్ మ్యాక్రో విజన్ సెన్సార్ + 16మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
 ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ Sony IMX471 సెన్సార్ 32మెగాపిక్సెల్
 బ్యాటరీ 4,500ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 15వాట్ వైర్‌లైస్ ఛార్జింగ్, 5వాట్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్) 4,020ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్)
 ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 12 + నథింగ్ ఓఎస్ ఆండ్రాయిడ్ 12
 సిమ్ సపోర్ట్ డ్యూయెల్ సిమ్ డ్యూయెల్ సిమ్
 కలర్స్ వైట్, బ్లాక్ అరోరా గ్రీన్, మెటియార్ గ్రే
 ధర

8జీబీ+128జీబీ- రూ.32,999,

8జీబీ+256జీబీ- రూ.35,999,

12జీబీ+256జీబీ- రూ.38,999


6జీబీ+128జీబీ- రూ.27,999,

8జీబీ+128జీబీ- రూ.29,999

Realme GT Neo3 Thor Edition: రియల్‌మీ జీటీ నియో3 థార్ ఎడిషన్ సేల్ ఈరోజే... ఆఫర్ వివరాలివే

డిస్‌ప్లే విషయానికి వస్తే ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల డిస్‌ప్లే దాదాపు ఒకే సైజ్‌లో ఉండటం విశేషం. మోటోరోలా ఎడ్జ్ 30 మొబైల్‌లో 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది. నథింగ్ ఫోన్ 1 లో డ్యూయెల్ కెమెరా ఉంటే, మోటోరోలా ఎడ్జ్ 30 మోడల్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే నథింగ్ ఫోన్ 1 లో 16 మెగాపిక్సెల్ Sony IMX471 కెమెరా ఉంటే, మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. నథింగ్ ఫోన్ 1 కన్నా మోటోరోలా ఎడ్జ్ 30 మోడల్‌లో బ్యాటరీ తక్కువగా ఉంది. ధర విషయానికి వస్తే నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అందుబాటులో లేదు. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర చూస్తే మోటోరోలా ఎడ్జ్ 30 రూ.3,000 తక్కువకే లభిస్తోంది. అయితే నథింగ్ ఫోన్ 1 ట్రాన్స్‌పరెంట్ డిజైన్, గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌తో ఆకట్టుకుంటోంది. ఈ డిజైన్ కోసం అదనంగా డబ్బులు చెల్లించడానికి కూడా యూజర్లు రెడీగా ఉన్నారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Nothing, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు