ప్రముఖ మొబైల్ కంపెనీ నథింగ్ (Nothing) నుంచి విడుదల కానున్న తొలి ఫోన్‌పై ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1)ను తొలి స్మార్ట్‌ఫోన్‌గా(Smartphone) లాంచ్ చేస్తామని కంపెనీ తెలిపింది. అయితే లాంచ్ డేట్(Launch Date) ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే మరో కీలక ప్రకటన చేసింది. జూలై 12న నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ (Launch) చేయనున్నట్లు తాజాగా నథింగ్(Nothing) ప్రకటించింది. నథింగ్ వ్యవస్థాపకుడు కార్ల్ పీ (Carl Pei) కొంతకాలంగా ఫోన్ గురించి ప్రమోషన్లు చేస్తున్నారు. ఫోన్ పేరును అధికారికంగా ప్రకటించడానికి ఒక ఈవెంట్(Event) కూడా నిర్వహించారు. అలా హైప్ పెంచిన కంపెనీ రీసెంట్‌గా యూఐ లాంచర్‌ను కూడా పరిచయం చేసింది. వచ్చే నెలలో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయడానికి సన్నద్ధం అవుతోంది.
నథింగ్ ఫోన్ 1 స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను ఉపయోగించనుంది. కార్ల్ పీ రిఫ్రెష్ డిజైన్‌ను అందిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ తరుణంలో నథింగ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్లు, ధర వంటి వివరాలు లీకయ్యాయి. నథింగ్ ఫోన్ 1 మొబైల్ లాంచ్ ఈవెంట్ లండన్‌లో జూలై 12న, రాత్రి 8.30 గంటలకు ఆరంభమవుతుంది. ఆ సమయంలో ఫోన్ ఫీచర్లన్నీ అధికారికంగా ప్రకటిస్తారు. ఇప్పటికే నథింగ్ ఫోన్ 1 వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ కానుందని తెలిసింది. ఇతర స్పెసిఫికేషన్లు జూలై 12న తెలుస్తాయి. అప్పటివరకు లీకైన ఫీచర్‌లపై ఓ లుక్కేద్దాం.
నథింగ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్లు
నథింగ్ ఫోన్ 1 ఫ్లాగ్‌షిప్ మొబైల్ అని చాలా మంది చెబుతున్నారు కానీ ఈ ఫోన్ మిడ్-రేంజ్ (Mid-Range) మొబైల్‌గానే లాంచ్ అవుతుందని తెలుస్తోంది. నథింగ్ ఫోన్ 1 హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్‌తో 6.43-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 90Hz అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్‌తో వస్తుందని లీకులు పేర్కొంటున్నాయి.
Smart Phone: అదిరిపోయే ఫీచర్.. నిమిషాల్లో ఫుల్ చార్జింగ్.. వన్ ప్లస్ నుంచి కొత్త మోడల్
అయితే ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఫెసిలిటీ ఉందా లేదా అనేది తెలియాలి. ఈ బ్రాండ్ న్యూ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత నథింగ్ఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతుంది. ఇంటర్‌ఫేస్ కస్టమైజేషన్స్ నథింగ్ లాంచర్ ప్యాక్‌లో అందించి ఉండొచ్చని సమాచారం. ట్రాన్స్‌పరెంట్ డిసైజ్‌తో ఈ ఫోన్ చాలా కొత్తగా ఆకర్షణీయంగా ఉండనుందని సమాచారం.
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చే నథింగ్ ఫోన్ (1)లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెన్సార్ ఉండే అవకాశముంది. 32-మెగాపిక్సెల్ షూటర్‌ని ఫ్రంట్ కెమెరాగా అందించొచ్చు. ఈ ఫీచర్లను బట్టి చూస్తే, నథింగ్ ఫోన్ 1 ధర మార్కెట్‌లో రూ. 25,000 - రూ. 28,000 మధ్య ఉండవచ్చని చెప్పవచ్చు. మరికొన్ని టెక్ రిపోర్ట్స్ మాత్రం దీని ధర రూ.30 వేలకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Nothing, Nothing mobile, Technology