ప్రపంచానికి సరికొత్త టెక్ బ్రాండ్ కొద్ది రోజుల క్రితం పరిచయం అయింది. నథింగ్ (Nothing) పేరుతో కొత్త బ్రాండ్‌ను వన్‌ప్లస్ నుంచి తప్పుకున్న కో-ఫౌండర్ కార్ల్ పెయ్ నథింగ్ బ్రాండ్‌ను ఆవిష్కరించారు. నథింగ్ ఇయర్ 1 టీడబ్ల్యూఎస్‌ని (Nothing Ear 1) కూడా పరిచయం చేశారు. నథింగ్ ఇయర్ 1 టీడబ్ల్యూఎస్ డిజైన్ అందర్నీ ఆకట్టుకుంది. ఇక నథింగ్ బ్రాండ్ నుంచి స్మార్ట్‌ఫోన్ కూడా రాబోతోంది. వన్‌ప్లస్ కో-ఫౌండర్ స్థాపించిన బ్రాండ్ కావడంతో నథింగ్ స్మార్ట్‌ఫోన్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల నథింగ్ లాంఛర్ కూడా అందుబాటులోకి వచ్చింది. నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) తీసుకొచ్చేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. సమ్మర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయబోతున్నట్టు కంపెనీ ట్వీట్ చేసింది.
నథింగ్ నుంచి రాబోతున్న తొలి స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ గురించి అధికారికంగా ఎలాంటి వివరాలు లేవు. ఫ్లిప్‌కార్ట్‌లో టీజర్ పేజీ అందుబాటులో ఉన్నా అందులో ఎలాంటి డీటెయిల్స్ లేవు. కానీ నథింగ్ ఫోన్ 1 మొబైల్ ఫీచర్స్ గురించి లీక్స్ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. నథింగ్ ఫోన్ 1 మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో రాబోతోందన్నది ఆ లీక్స్ సారాంశం.
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ సేల్... రూ.25,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
Let there be light.
Nothing phone (1). Coming summer 2022. pic.twitter.com/sBeuLHbaEI
— Nothing (@nothing) May 4, 2022
ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న లీక్స్ ప్రకారం నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వరకు సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ పెంచుకునే అవకాశం ఉందో లేదో తెలియదు.
నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + మరో 2మెగాపిక్సెల్ సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇందులో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. నథింగ్ ఓఎస్ + ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. నథింగ్ లాంఛర్ ప్యాక్‌ను కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు.
Smartphone Offer: ఎస్‌బీఐ కార్డ్ ఉందా? ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్
ఈ వివరాల ప్రకారం నథింగ్ ఫోన్ 1 మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో అడుగుపెట్టబోతోందని అర్థం చేసుకోవచ్చు. ధర రూ.22,000 నుంచి రూ.28,000 మధ్య ఉంటుందని అంచనా. ఇక నథింగ్ ఇయర్ 1 టీడబ్ల్యూఎస్ లాగానే నథింగ్ ఫోన్ 1 డిజైన్ కూడా ఆకట్టుకోబోతుందన్న చర్చ జరుగుతోంది. మరి ఇంత హైప్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఎలా రాబోతుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Nothing, Smartphone