ట్రాన్సపరెంట్ డిజైన్ ఇయర్‌బడ్స్‌తో(Earbuds) కస్టమర్లను ఆకర్షించిన యూకే కంపెనీ నథింగ్(UK Company Nothing).. తన మొదటి స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ‘నథింగ్ ఫోన్ 1’ పేరుతో తీసుకొస్తున్న ఈ మొబైల్‌కు(Mobile) సంబంధించిన ధర, స్పెసిఫికేషన్లు(Specifications) ఇంటర్ నెట్లో లీక్ అయ్యాయి. లీక్ అయిన సమాచారం ఆధారంగా నథింగ్ ఫోన్ 1 జూలై 21న లాంచ్ కానుంది. ఇది మిడ్ - రేంజ్ ఆఫర్‌గా(Mid Range Offer) వస్తున్నట్లు తెలుస్తోంది. వైర్లెస్ ఛార్జింగ్‌కు(Wireless Charging) ఇది సపోర్ట్ చేయనుంది. ఇయర్‌బడ్స్ మాదిరిగానే దీన్ని కూడా ట్రాన్సపరెంట్గా తీర్చిదిద్దారు. జర్మన్ పబ్లికేషన్ ఆల్‌రౌండ్ పీసీ రిపోర్ట్ ప్రకారం.. నథింగ్ ఫోన్ 1 ధర దాదాపు EUR 500 (భారత కరెన్సీలో రూ. 41,400) ఉండవచ్చు. ప్రస్తుతానికి ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి కలర్ ఆప్షన్లు, RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ వివరాలు వెల్లడికాలేదు.
నథింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు కార్ల్ పై.. నథింగ్ ఫోన్1 డిజైన్, స్పెసిఫికేషన్ల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు వాల్‌పేపర్ రిపోర్ట్ పేర్కొంది. ఈ ఫోన్‌ను యాపిల్ ఐఫోన్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారని వాల్ పేపర్ వెల్లడించింది. ‘‘ ఇందులో క్వాల్కామ్ ప్రాసెసర్‌ను వినియోగించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఈ నథింగ్ ఓఎస్, ఇతర ఓఎస్‌ల కంటే వేగంగా పనిచేస్తుంది.’’ అని కార్ల్ పై వెల్లడించినట్లు వాల్‌పేపర్ తెలిపింది.
‘నథింగ్ ఫోన్1’ హెడ్ డిజైనర్ హోవార్డ్ కూడా ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను వివరించినట్లు వాల్‌పేపర్ తన నివేదికలో పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 400కు పైగా భాగాలను లేయర్లలో అమర్చినట్లు హోవార్డ్ అన్నట్లు పేర్కొంది.
నథింగ్ ఫోన్ 1ను ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ సంస్థ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుందని సమాచారం. యూజర్లకు అత్యాధునిక సాంకేతికత, మెరుగైన పనితీరు, విభిన్నమైన డిజైన్, కచ్చితమైన ఆండ్రాయిడ్ వినియోగాన్ని అందించడమే లక్ష్యంగా నథింగ్ ఫోన్1ను తీసుకొస్తున్నట్లు కంపెనీ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది.
ఇది ఇలా ఉండగా, ఇటీవల Y సిరీస్‌లో మరో కొత్త మోడల్ 4జీ స్మార్ట్ ఫోన్‌ను ‘వివో‘ భారత్‌లో లాంచ్ చేసింది. మిడ్- రేంజ్ సెగ్మెంట్లో తీసుకొచ్చిన ఈ కొత్త మోడల్ Y75లో మీడియా టెక్ ప్రాసెసర్, ఫాస్ట్ చార్జింగ్, అమోలెడ్ డిస్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇప్పటికే వివో Y75 5జీ మోడల్ అందుబాటులోకి రాగా, తాజాగా ఇదే సిరీస్‌లో 4జీ మోడల్ లాంచ్ కావడం గమనార్హం.
వివో Y75 4G ధరలు
ఈ ఫోన్‌ను సింగిల్ వేరియంట్లో తీసుకొచ్చారు. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ ధర రూ.20,999గా ఉంది. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని వర్చవల్‌గా ర్యామ్ కెపాసిటీని మరో 4 జీబీ వరకు పొడిగించుకోవచ్చు. అలాగే స్టోరేజీ కెపాసిటీని పెంచుకునేందుకు మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ కూడా ఉంటుంది. డ్యాన్సింగ్ వేవ్స్, మూన్ లైట్ షాడో కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఫ్లిప్‌కార్ట్, వివో అధికారిక ఆన్లైన్ ఈ-స్టోర్‌లో పాటు ఆఫ్‌లైన్ స్టోర్‌లోనూ Vivo Y75ను కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్లో భాగంగా కస్టమర్లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులను ఉపయోగించి రూ. 1,500 డిస్కౌంట్ ప్రయోజనాలు పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, 5g technology, Nothing mobile