హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Nothing Phone 1 Released: నథింగ్ ఫోన్ 1 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్స్ పూర్తి వివరాలిలా..

Nothing Phone 1 Released: నథింగ్ ఫోన్ 1 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్స్ పూర్తి వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ కొత్త కంపెనీ నథింగ్ నుంచి తన మొదటి స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేశారు. డ్యూయల్ కెమెరా సెటప్‌తో పాటు Qualcomm Snapdragon ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ కొత్త కంపెనీ నథింగ్ నుంచి తన మొదటి స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేశారు. డ్యూయల్ కెమెరా సెటప్‌తో పాటు Qualcomm Snapdragon 778G Plus ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది.  హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.2వేల వరకు రాయితీని ప్రకటించారు.

భారత్ లో ఈ ఫోన్ మూడు వేరియంట్లోలో లభిస్తాయని కార్ల్ పీ తెలిపారు. 8GB+128GB వేరియంట్ ధర రూ. 32,999, 8GB+256GB వేరియంట్ ధర రూ. 35,999, 12GB+256GB వేరియంట్ ధర రూ.38,999గా పేర్కొన్నారు.  నథింగ్ ఫోన్(1)  స్నాప్‌డ్రాగన్ 778G+ ప్రాసెసర్, 120 HZ OLED స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటాయని పేర్కొన్నారు.

గ్లిఫ్(Glyph) ఇంటర్‌ఫేస్ తో ఈ ఫోన్ ఉంటుంది.  స్మార్ట్‌ఫోన్‌లో వెనుక రెండు కెమెరాలు(50MP+50MP) ఉంటాయి. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే 6.55 ఇంచుల OLED డిస్‌ప్లేను Nothing Phone 1 కలిగి ఉంది. నథింగ్ ఫోన్ ఒన్ 4,500mAh బ్యాటరీతో కలిగి ఉంది. దీనిలో ఆండ్రాయిడ్ 12-ఆధారిత నథింగ్ OSపై రన్ అవుతుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరో అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16మెగా ఫిక్సల్ తో కలిగి ఉంది. 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 33W ఛార్జింగ్ కలదు.

First published:

Tags: 5g smart phone, Nothing, Nothing mobile, Smart phones

ఉత్తమ కథలు