Nothing Phone (1) : గతేడాది జులైలో భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లో విడుదలైన నథింగ్ ఫోన్ (1)(Nothing Phone (1)).. క్రమంగా మార్కెట్‌ను పెంచుకుంటోంది. తాజాగా అమెరికన్ మార్కెట్‌లో ఈ డివైజ్‌ను అందుబాటులోకి తెచ్చింది. బీటా మెంబర్‌షిప్ ద్వారా నథింగ్ ఫోన్ (1)ను వినియోగించే సౌలభ్యం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో నథింగ్ ఫోన్ (1) ఫీచర్లు, ఇంటర్‌ఫేస్ అనుభూతి పొంది, ఫోన్‌ను టెస్ట్ చేయడానికి అవకాశం కల్పించినట్లు అయింది. గ్లోబల్ మార్కెట్లో విడుదలైన సమయంలో అమెరికాలో నథింగ్ ఫోన్ (1)ను లాంచ్ చేయలేదు. ఇప్పుడు కంపెనీ నుంచి ప్రకటన రావడంతో అమెరికన్ యూజర్లు ఈ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు.
మెంబర్‌షిప్ ఇలా
నథింగ్ ఫోన్ (1)ను కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఉన్నవారు కచ్చితంగా 299 డాలర్లు చెల్లించి ఫోన్‌తో పాటు బీటా మెంబర్‌షిప్ తీసుకోవాల్సిందేనని నథింగ్ వ్యవస్థాపకుడు కార్ల్ పీ స్పష్టం చేశారు. ‘నథింగ్ ఓఎస్ 1.5 బీటా మెంబర్‌షిప్’గా దీనికి నామకరణం చేశారు. ఈ మెంబర్‌షిప్ ద్వారా 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగిన బ్లాక్ మోడల్ నథింగ్ ఫోన్ (1)ను పొందవచ్చు.
అయితే ఈ ఫోన్‌ను కంపెనీ ఇప్పటికీ అమెరికాలో అధికారికంగా విడుదల చేయట్లేదనే విషయం గుర్తుంచుకోవాలి. పైగా నథింగ్ ఫోన్ (1) అమెరికాలోని అన్ని నెట్‌వర్క్ క్యారియర్స్‌లో పనిచేయలేక పోవచ్చంటూ కంపెనీ వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ T-మొబైల్ ఒక్కటే 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తోంది. AT&T, వెరిజాన్ వంటి కంపెనీలు 4Gకి మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి.
Veer EV: ఇండియన్ ఆర్మీ కోసం స్టార్టప్ కంపెనీ స్పెషల్ వెహికల్..ప్రవైగ్ ‘వీర్ EV’ డిజైన్, ఫీచర్స్ ఇవే..
కొనాలా? వద్దా?
నథింగ్ ఫోన్ కోసం బీటా మెంబర్‌షిప్ విధానాన్ని తీసుకోవాలని నిబంధన విధించడం ద్వారా అమెరికన్ యూజర్లకు కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ వరకు ఈ బీటా మెంబర్‌షిప్ గడువు ఉంటుంది. ఆ తర్వాత పూర్తైపోతుంది. అంటే ఇక నథింగ్ ఫోన్ (1)ని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండదేమో అంటూ ఆలోచనలో పడ్డారు. దీనిపై అనిశ్చితి ఉంది. ఈ ఫోన్‌కు వారంటీ కవరేజీ, సపోర్ట్ కంపెనీ అందించకపోవడం వీటికి మరింత బలం చేకూరుస్తుంది. అయితే, మెంబర్‌షిప్ తీసుకున్న వారు డివైజ్‌ను వినియోగించాక, తిరిగి స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీకి అప్పగించాల్సిన పనిలేదని సంస్థ స్పష్టం చేసింది.
భవిష్యత్తులో తీసుకొస్తాం
అమెరికా తమకు పెద్ద మార్కెట్ అని నథింగ్ వ్యవస్థాపకుడు కార్ల్ పీ స్పష్టం చేశారు. యుఎస్‌లోని అన్ని క్యారియర్స్ సపోర్ట్ చేయకపోవడం వల్లే నథింగ్ ఫోన్ (1)ని అధికారికంగా విడుదల చేయలేదని తెలిపారు. భవిష్యత్తులో ఫోన్‌ను లాంచ్ చేయడానికి యూఎస్ క్యారియర్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
‘టెక్నాలజీ సహాయం తీసుకుని నథింగ్ ఫోన్ (1)ని తీసుకురావడంపై కృషి చేస్తున్నాం. బీటా మెంబర్‌షిప్ కల్పించడం ద్వారా అమెరికన్ వినియోగదారుల అభిప్రాయాలు, సూచనలను స్వీకరించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో తమ స్మార్ట్‌ఫోన్ సేవలను వారికి అందించనట్లు అవుతుంది’ అని కార్ల్ పీ వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nothing mobile, Technolgy, USA