Home /News /technology /

NOTHING PHONE 1 MAY BE PRICED UNDER RS 30000 UMG GH

Nothing Phone(1): త్వరలో నథింగ్ ఫోన్ (1) లాంచ్.. బెస్ట్ ఫీచర్స్.. అవేంటో చూడండీ..!

నథింగ్ ఫోన్ (1)

నథింగ్ ఫోన్ (1)

నథింగ్ ఫోన్(1) జూలై 12న ఇండియన్‌ మార్కెట్‌లోకి అడుగు పెడుతోంది. దీని ధర రూ.30,000 కంటే తక్కువగా ఉంటుందని అంచనా. లాంచ్ ఆఫర్‌లతో భారతదేశంలో దాదాపు రూ.25,000 వద్ద డివైజ్ ధర ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి.

ప్రస్తుతం ఫోన్‌లలో అందుబాటులో ఉండే స్పెసిఫికేషన్‌లు, దాని ధర నిష్పత్తి ఆధారంగా వినియోగదారులు ఫోన్‌లను సెలక్ట్‌ చేసుకుంటున్నారు. కొత్త ప్రాసెసర్‌ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G ప్లస్‌తో వచ్చే ఫోన్‌ ఇండియన్‌ మార్కెట్‌లో ఒక్కటి మాత్రమే ఉంది. త్వరలోనే ఈ ప్రాసెసర్‌తో నథింగ్ ఫోన్(1) లాంచ్‌ అవుతోంది. ఇది జూలై 12న ఇండియన్‌ మార్కెట్‌లోకి అడుగు పెడుతోంది. దీని ధర రూ.30,000 కంటే తక్కువగా ఉంటుందని అంచనా. లాంచ్ ఆఫర్‌లతో భారతదేశంలో దాదాపు రూ.25,000 వద్ద డివైజ్ ధర ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి.

ప్రస్తుతం క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G ప్లస్ చిప్‌సెట్ భారతీయ మార్కెట్‌లోని మోటో ఎడ్జ్‌ 30 5జీ ఫోన్‌లో మాత్రమే ఉంది. దీని ధర రూ.29,999. మోటో ఎడ్జ్‌ 30 5జీ ప్రపంచంలోనే అత్యంత సన్నని 5G స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు పొందింది. 144Hz రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, 6.5-అంగుళాల pOLED డిస్‌ప్లేతో ఆకట్టుకుంటోంది.

సాధారణంగా ప్రజలు స్మార్ట్‌ఫోన్‌ ధరను బట్టి దాని స్పెసిఫికేషన్‌లను అంచనా వేస్తారు. రూ.30,000 లోపు ఫోన్‌లలో లభించే చిప్‌సెట్‌ను ఉపయోగించి ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడం అసంభవం.
ఇప్పుడు మోటో ఎడ్జ్‌ 30 5జీ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G ప్లస్ చిప్‌సెట్‌తో భారతీయ మార్కెట్లో ఉన్న ఏకైక స్మార్ట్‌ఫోన్. అయితే, దాని ముందు స్నాప్‌డ్రాగన్ 778Gతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉండేవి. ఈ రెండు చిప్స్ మధ్య తేడాలేంటో చూద్దాం.

* క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G వర్సెస్‌ స్నాప్‌డ్రాగన్ 778G ప్లస్
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G ప్లస్ అనేది స్నాప్‌డ్రాగన్ 778Gకి అప్‌డేట్. రెండు స్మార్ట్‌ఫోన్ చిప్‌సెట్‌లు క్వాల్‌కామ్ నుంచి నాలుగో తరం మొబైల్ చిప్‌లు, అదే క్రియో 670 ఆర్కిటెక్చర్‌తో ఒకే 6nm ప్రాసెస్‌లో రూపొందాయి. రెండూ ఒకే మొత్తంలో కోర్లు, థ్రెడ్‌లను కలిగి ఉన్నాయి. అయితే స్నాప్‌డ్రాగన్ 778G ప్లస్ అధిక ఫ్రీక్వెన్సీలో క్లాక్ చేశారు. అంటే ఇది ప్రామాణిక స్నాప్‌డ్రాగన్ 778G కంటే చాలా వేగంగా ఉంటుంది. క్లాకింగ్ ఫ్రీక్వెన్సీ రెండు చిప్‌ల మధ్య ప్రధాన వ్యత్యాసం. ఎందుకంటే అవి రెండూ ఒకే GPU, ఒకే విధమైన కోడెక్‌లు, గరిష్ట RAM సామర్థ్యం, మరిన్నింటిని పంచుకుంటాయి. రెండు చిప్‌లకు చిన్న తేడాలు ఉన్నాయి. దేశంలో నథింగ్ ఫోన్ 1 పోటీ గురించి తెలియజేసేందుకు.. భారతదేశంలోని అన్ని క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G బేస్డ్ స్మార్ట్‌ఫోన్‌లను పరిశీలిద్దాం.

* VIVO T1 PRO 5G
భారతదేశంలో వివో టీ1 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ రూ.23,999కి లభిస్తుంది. ఒది 6.44-అంగుళాల ఫుల్‌-HD+ AMOLED డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 128GB స్టోరేజ్‌ను అందిస్తుంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్‌తో వస్తుంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4,700mAh బ్యాటరీ ఉంది.

* IQOO Z6 PRO
ఐక్యూ జెడ్6 ప్రో 5జీ భారతదేశంలో కూడా రూ.23,999 ధరకే అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ 6.44-అంగుళాల ఫుల్‌-HD+ AMOLED డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 778G చిప్‌సెట్, 12GB వరకు RAM, 256GB వరకు స్టోరేజ్‌ ఫీచర్‌లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ 66W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 4,700mAh బ్యాటరీతో వస్తుంది.

* REALME 9 SE 5G
భారతదేశంలోని అనేక స్నాప్‌డ్రాగన్ 778G-బేస్డ్‌ డివైజ్‌లలో రియల్మీ 9 ఎస్‌ఈ కూడా ఒకటి. దీని ధర రూ.19,999గా ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్‌తో వస్తుంది, దీనితో పాటు 8GB RAM, 128GB స్టోరేజ్‌ ఫీచర్‌లు ఉన్నాయి. 30W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేసే 5000mAh బ్యాటరీతో వస్తుంది.

* REALME GT Master Edition
రియల్మీ జీటీ మాస్టర్‌ ఎడిషన్‌ స్నాప్‌డ్రాగన్ 778G-బేస్డ్‌ డివైజ్‌. భారతదేశంలో దీని ధర రూ.25,999గా ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.43-అంగుళాల ఫుల్-HD+ సూపర్ AMOLED డిస్‌ప్లే ఫీచర్‌ ఉన్నాయి. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 778 SoC చిప్‌సెట్‌, 8GB RAM, 256GB స్టోరేజ్‌, 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4,300mAh బ్యాటరీ ఫీచర్‌లు ఉన్నాయి.

* SAMSUNG GALAXY A73 5G
భారతదేశంలో శాంసంగ్‌ గెలాక్సీ ఏ73 5జీ డివైజ్‌ ధర రూ.41,999గా ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778G 5G ప్రాసెసర్‌తో రన్‌ అవుతుంది. ర్యామ్ ప్లస్ ఫీచర్లతో ర్యామ్‌ను 16GB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో OISతో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 12-మెగాపిక్సెల్ షూటర్ మరియు రెండు 5-మెగాపిక్సెల్ షూటర్‌లు ఉన్నాయి.

* XIAOMI 11 Lite NE 5G
షియోమి 11 లైట్‌ ఎన్‌ఈ 5జీ ఇండియాలో రూ.28,999కు లభిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్‌తో వస్తుంది. అంతే కాకుండా, స్మార్ట్‌ఫోన్ HDR10+ సపోర్ట్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల డిస్‌ప్లే అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసేఊ 4,250mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంది.
Published by:Mahesh
First published:

Tags: 5g smart phone, Android, Smart phone, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు