హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Nothing Phone 1 Launch: మరికొన్ని గంటట్లో నథింగ్ ఫోన్ లాంచ్.. హాట్‌కేక్‌ల్లా అమ్ముడయిన ప్రీ-ఆర్డర్ పాస్‌లు..

Nothing Phone 1 Launch: మరికొన్ని గంటట్లో నథింగ్ ఫోన్ లాంచ్.. హాట్‌కేక్‌ల్లా అమ్ముడయిన ప్రీ-ఆర్డర్ పాస్‌లు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ కొత్త కంపెనీ నథింగ్ నుంచి తన మొదటి స్మార్ట్‌ఫోన్ ను ఈరోజు రాత్రి 8.30 గంటలకు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ కొత్త కంపెనీ నథింగ్(Nothing) నుంచి తన మొదటి స్మార్ట్‌ఫోన్(Smartphone) ను ఈరోజు రాత్రి 8.30 గంటలకు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డ్యూయల్ కెమెరా సెటప్‌తో(Dual Camera Setup) పాటు Qualcomm Snapdragon ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. లాంచ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి, టైమ్, అంచనా ధర, స్పెసిఫికేషన్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. నథింగ్ ఫోన్‌ 1 మరికొన్ని గంటల్లో లాంచ్ కానుంది. ఎప్పటి నుంచో వేచిచూస్తున్న ఈ మొబైల్‌ నేడు (జూలై 12 ) భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వన్‌ప్లస్‌ మాజీ సీఈవో కార్ల్ పీ స్థాపించిన నథింగ్ కంపెనీ నుంచి వస్తున్న తొలి మొబైల్‌ కావడంతో ప్రారంభం నుంచి ఈ ఫోన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే భిన్నంగానే ఈ మొబైల్ డిజైన్ కూడా మిగతా ఫోన్ల కంటే కూడా డిఫరెంట్ గా కనిపిస్తోంది.

Jio Daily 2GB Plans: రోజూ 2జీబీ డేటా, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్... జియో ప్లాన్స్ ఇవే

రిటర్న్ టు ఇన్‌స్టింక్ట్ (Return to Instinct) పేరుతో నథింగ్ ఫోన్‌ 1 లాంచ్ ఈవెంట్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 8.30 గంటలకు ఈ ఈవెంట్ మొదలువుతుంది. నథింగ్ అధికారిక యూట్యూబ్ చానెల్‌లో ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ అవుతుంది. నథింగ్ ఫోన్ 1 లాంచ్ కంపెనీ వెబ్‌సైట్ మరియు అధికారిక YouTube ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అంతే కాకుండా నథింగ్ సోషల్ మీడియా అకౌంట్స్ లోనూ ఈ లైవ్ ఉంటుంది.

నథింగ్ ఫోన్ 1 Qualcomm Snapdragon 778G ప్లస్ ప్రాసెసర్ తో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో వెనుక రెండు కెమెరాలు ఉంటాయి. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే 6.55 ఇంచుల OLED డిస్‌ప్లేను Nothing Phone 1 కలిగి ఉంటుందని తెలుస్తోంది. నథింగ్ ఫోన్ ఒన్ 4,500mAh బ్యాటరీతో వస్తుంది. దీనిలో ఆండ్రాయిడ్ 12-ఆధారిత నథింగ్ OSపై రన్ అవుతుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరో అల్ట్రా వైడ్ కెమెరా ఉండనున్నాయని తెలుస్తోంది.

ఈ ఫోన్ భారత్ లో 8జీబీ + 128జీబీ బేస్ మోడల్ ప్రారంభ ధర రూ.30,000 నుంచి రూ.36,000 మధ్య ఉండనుందని తెలుస్తోంది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.34,999గా ఉండనుందని సమాచారం. గ్లోబల్ గా దీని ధర 37,900గా ఉంటుందని కొన్ని లీక్ ల ద్వారా తెలుస్తోంది. ఇవన్నీ అంచనాలు మాత్రమే.దీని అసలు ధర తెలియాంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే. 8GB RAM + 128 GB స్టోరేజీ, 8GB RAM + 256 GB స్టోరేజీ, 12 GB RAM + 256 GB స్టోరేజీతో రానుంది. మొబైల్ ఫోన్‌ను ముందస్తుగా కొనుగోలు చేయడానికి ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రీ-ఆర్డర్ పాస్‌లను విక్రయించగా.. హాట్‌కేక్‌ల్లా అమ్ముడయ్యాయి. ప్రీ-ఆర్డర్ పాస్‌లను కొనుగోలు చేసిన వినియోగదారులంతా జూలై 18లోపు ఈ నథింగ్ (1) ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ పాస్ లను ఫ్లిప్‌కార్ట్ లో ఒక్కోటి రూ.2వేలకు విక్రయించారు.

First published:

Tags: 5g smart phone, 5G Smartphone, Nothing, Nothing mobile

ఉత్తమ కథలు