Home /News /technology /

NOTHING PHONE 1 IS A FLAGSHIP JUST LOOK AT THE PIXEL 5 UMG GH

Nothing Phone 1: ఫ్లాగ్‌షిప్ మొబైల్‌గా రానున్న నథింగ్ ఫోన్ (1).. ఫీచర్లు చూస్తే మతిపోతుందీ..!!

నథింగ్ (1) ఫోన్.

నథింగ్ (1) ఫోన్.

టెక్ స్టార్టప్ నథింగ్ (Nothing) నుంచి లాంచ్ కానున్న నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1)పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. నథింగ్ ఫోన్‌ 1 లాంచింగ్ డేట్ సమీపిస్తున్న నేపథ్యంలో కంపెనీ అధికారికంగా కీలక ఫీచర్లను ప్రకటిస్తోంది.

ఇంకా చదవండి ...
టెక్ స్టార్టప్ నథింగ్ (Nothing) నుంచి లాంచ్ కానున్న నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1)పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. నథింగ్ ఫోన్‌ 1 లాంచింగ్ డేట్ సమీపిస్తున్న నేపథ్యంలో కంపెనీ అధికారికంగా కీలక ఫీచర్లను ప్రకటిస్తోంది. తాజాగా ఈ మొబైల్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 778G+ (Qualcomm Snapdragon 778G+) ప్రాసెసర్‌తో లాంచ్ అవుతుందని నథింగ్ కంపెనీ సీఈవో కార్ల్ పీ తెలిపారు. ఈ చిప్ సాయంతో మొబైల్ పర్ఫామెన్స్ చాలా వేగంగా ఉంటుందని, బ్యాటరీ ఎక్కువగా సేవ్‌ అవుతుందని, ఫోన్ అధికంగా వేడెక్కదని కార్ల్ పీ పేర్కొన్నారు. ఈ ఫోన్ డిజైన్ గ్లిఫ్ ఇంటర్ఫేస్‌తో కూడిన ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్‌తో మెరుస్తున్న ఎల్ఈడీలతో వస్తుందని ఇప్పటికే లీక్స్ పేర్కొన్నాయి. అయితే ఇప్పటివరకు అధికారికంగా తెలిసిన ఫీచర్లు, లీకైన ఫీచర్ల ప్రకారం ఈ మొబైల్ యాపిల్ ఐఫోన్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చే మొబైల్ ఏం కాదని తెలుస్తోంది. టెక్ నిపుణుల ప్రకారం, ఈ ఫోన్ గూగుల్ పిక్సెల్ 5 లాగా ఓ ఫ్లాగ్‌షిప్ మొబైల్‌గా రావచ్చు.

2020లో గూగుల్ లాంచ్ చేసిన పిక్సెల్ 5 ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గానే యూజర్లకు పరిచయమైంది. నథింగ్ ఫోన్ (1) లాగా, పిక్సెల్ 5 స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్ సాయంతో నడిచింది. స్నాప్‌డ్రాగన్ 765G ఇందులో ఉపయోగించగా దీనిని ఎల్‌జీ వింగ్ వంటి ఇతర ఫ్లాగ్‌షిప్ డివైజ్‌లలో కూడా ఉపయోగించారు. దాంతో నథింగ్ ఫోన్ (1)ని కూడా ఫ్లాగ్‌షిప్ మొబైల్‌గా పరిగణించవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. సీఈఓ కార్ల్ పీ మాత్రం నథింగ్ మిడ్‌రేంజ్ ఫోన్‌గా లాంచ్ అవుతుందని స్పష్టం చేశారు. కాకపోతే మిడ్‌రేంజ్ లో ప్రస్తుతం వస్తున్న అన్ని ఫోన్ల డిజైన్, స్పెసిఫికేషన్స్‌కి తలదన్నేలా నథింగ్ ఫోన్ ఉంటుందని పేర్కొన్నారు. ఇన్‌పుట్‌ నిర్వహించిన రీసెంట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్ల్ పీ నథింగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778G+ తో వస్తుందని వెల్లడించారు. తద్వారా పర్ఫార్మెన్స్ పెరగడంతో పాటు బ్యాటరీ వినియోగం, ధర తగ్గుతుందన్నారు. ఈ చిప్‌సెట్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న పవర్‌ఫుల్ ప్రాసెసర్స్ కంటే శక్తిమంతమైనది కాదు. కానీ పవర్‌ఫుల్ ప్రాసెసర్స్‌కి ఏ మాత్రం తీసిపోకుండా యూజర్‌లకు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.



లీక్స్ ప్రకారం, నథింగ్ ఫోన్ 1 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.55-అంగుళాల OLED డిస్‌ప్లే, ముందు, వెనుక భాగంలో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, f/1.8 అపెర్చర్, 4K 60FPS వీడియో రికార్డింగ్‌తో 50MP డ్యూయల్ రియర్ కెమెరాలు, 4500mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత నథింగ్ OS తో వచ్చే ఈ మొబైల్‌లో బ్లోట్‌వేర్ ఉండదని రీసెంట్ లీక్స్ పేర్కొంటున్నాయి. నథింగ్ ఫోన్ (1)తో పాటు నథింగ్ ఇయర్ (1) 8GB+128GB వేరియంట్ రూ.39 వేలు, 8GB+256GB వేరియంట్ రూ.41 వేలు, 12GB+256GB వేరియంట్ రూ. 45 వేల లోపు ధరలతో లాంచ్ కావచ్చని అంచనా. జూలై 12న లాంచ్ ఈవెంట్ జరిగిన తరువాత నథింగ్ ఫోన్ 1 వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ మొబైల్ లాంచ్ సమయంలో ఇన్విటేషన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలానే ప్రీ-ఆర్డర్ పాస్‌లు ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో అందుబాటులోకి వస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: Android, Google, Smart phones, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు