ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఫెస్టివల్ సీజన్ సందర్భంగా బిగ్ బిలియన్ డేస్ (Big Billion Days) పేరుతో మెగా సేల్ నిర్వహించనుంది. సెప్టెంబర్ 23 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఈ బిగ్ ఈవెంట్‌లో స్మార్ట్ ఫోన్ మొదలుకొని హోమ్ యాక్సెసరీస్ వరకు అన్ని రకాల ప్రాడక్ట్స్‌పై ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ ఫోన్(1) (Nothing Phone 1)పై కూడా అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఆ వివరాలు చూద్దాం.
పండుగ ఆఫర్‌లో భాగంగా నథింగ్ ఫోన్ (1) మోడల్స్ రూ.28,999నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8+256జీబీ వేరియంట్ ప్రస్తుత ధర రూ. 34,999. అయితే ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులు ఉంటే రూ. 3000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. దీంతో ఈ మోడల్‌ను రూ. 31,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.
* ఎంత ధర తగ్గుతుంది?
నథింగ్ ఫోన్ (1) 12+256GB వేరియంట్ ప్రస్తుత ధర రూ.37,999. ఈ మోడల్‌పై కూడా ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.3000 క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. దీంతో దీన్ని రూ.34,999కు సొంతం చేసుకోవచ్చు. 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుత ధర రూ.31,999. అయితే కొన్ని సెలక్ట్ బ్యాంకుల కార్డులపై రూ.3000 క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. దీంతో ఈ వేరియంట్‌ను రూ.28,999కు సొంతం చేసుకోవచ్చు.
* నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్స్
నథింగ్ ఫోన్ (1) ట్రాన్స్‌ఫరెంట్ బ్యాక్ ప్యానెల్ అందించే ప్రత్యేకమైన డిజైన్‌తో అందుబాటులో ఉంది. ఈ డివైజ్ వెనుక భాగంలో కూడా 900 LEDలు ఉంటాయి. ఈ ఫోన్‌కు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడల్లా ఇవి బ్లింక్ అవుతాయి. దాదాపు మూడు వేరియంట్లలో ఫీచర్స్ ఒకేలా ఉన్నాయి.
* 50MP సోనీ IMX766 ప్రైమరీ లెన్స్ డ్యూయల్-కెమెరా సెటప్..
నథింగ్ ఫోన్ (1) మోడల్స్‌లో 50MP సోనీ IMX766 ప్రైమరీ లెన్స్‌తో డ్యూయల్-కెమెరా సిస్టమ్ ఉంటుంది. ఈ ప్రధాన లెన్స్ F/1.8 ఎపర్చర్‌తో 10-బిట్ కలర్ వీడియోలకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 50MP Samsung JN1 అల్ట్రా-వైడ్ లెన్స్ ను అమర్చారు. ఇక ఫోన్ ముందు భాగంలో 16MP సోనీ IMX 471 సెల్ఫీ లెన్స్ ఉంటాయి. ఈ డివైజ్ Android 12 OSలో రన్ అవుతుంది.
* 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ ..
ఈ డివైజ్ 6nm క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G+ octa-core SoC ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇందులో 4,500mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 33W వైర్డు, 15W వైర్‌లెస్, 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రతి ఛార్జ్‌తో 18 గంటలు, స్టాండ్‌బైలో రెండు రోజుల పాటు మొబైల్ ఉపయోగించుకోవచ్చు. కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది.
* గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫుల్-HD+ రిజల్యూషన్,120Hz రిఫ్రెష్ రేట్/240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.55-అంగుళాల పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంది. దీని స్క్రీన్ 1 బిలియన్ కలర్స్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌గా డిస్‌ప్లేకు అదనపు భద్రతను అందిస్తుంది. ఫోన్ ముందు, వెనుక భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ ఫ్రేమ్ అల్యూమినియంతో రూపొందించారు.
* ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా..
కస్టమర్ల కోసం ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌పై మరో ఆఫర్‌ను కూడా ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా వీటిపై మరో రూ. 3000ను అందనపు డిస్కౌంట్‌గా పొందవచ్చు. ఇక యాక్సెసరీస్ విషయానికొస్తే నథింగ్ ఫోన్ (1) పవర్ ఛార్జర్ ప్రత్యేక ధర రూ.1,799 వద్ద అందుబాటులో ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flipkart, Flipkart Big Billion Days, Nothing, Tech news