హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Nothing Phone (1): నథింగ్ ఫోన్ (1) పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్.. 50 శాతం పైగా డిస్కౌంట్.. ఆఫర్ల వివరాలు..

Nothing Phone (1): నథింగ్ ఫోన్ (1) పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్.. 50 శాతం పైగా డిస్కౌంట్.. ఆఫర్ల వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నథింగ్ ఫోన్ (1) బేస్ వేరియంట్ (8GB+128GB) ప్రస్తుత ధర రూ.33,999గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌లో భాగంగా దీన్ని రూ.29,999కు కొనుగోలు చేసుకోవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఫెస్టివల్ సీజన్ ముగిసిన తరువాత కూడా ఇ-కామర్స్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి టాప్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్స్‌పై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సేల్స్ పెంచుకునేందుకు కొన్ని మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తున్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్, నథింగ్ ఫోన్ (1) పై బంపరాఫర్ ప్రకటించింది. ఏకంగా 50శాతం పైగా డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. నథింగ్ ఫోన్ (1) బేస్ వేరియంట్ (8GB+128GB) ప్రస్తుత ధర రూ.33,999. అయితే ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌లో భాగంగా దీన్ని రూ.29,999కు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఫోన్ మిగతా రెండు వేరియంట్లు (8GB/256GB), (12GB/256GB) కూడా డిస్కౌంట్ ధరలతో వరుసగా రూ.31,999, రూ.34,999కు అందుబాటులో ఉన్నాయి.

ఆఫర్స్ పూర్తి వివరాలు

ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (1) బేస్ వేరియంట్ రూ.29,999 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంది. అయితే ఈ మోడల్‌పై రూ.17,500 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్‌‌ను అందిస్తోంది. కస్టమర్లు మంచి కండిషన్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకొని పూర్తి వ్యాల్యూ పొందితే.. బేస్ వేరియంట్ నథింగ్ ఫోన్ (1) ధర రూ.12,499కు తగ్గుతుంది. యాక్సిస్ బ్యాంక్ కార్డులపై ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. కాగా, మరో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ప్రస్తుతం నథింగ్ ఫోన్ (1) బేస్ వేరియంట్‌ రూ.20,000 పైగా డిస్కౌంట్‌తో లభిస్తుంది.

లాంచ్ సమయంలో ధరలు ఇలా..

నథింగ్ ఫోన్ (1) మోడల్స్ లాంచ్ అయినప్పుడు కూడా ఇంత చౌకగా లభించలేదు. లాంచ్ సమయంలో నథింగ్ ఫోన్ (1) మూడు వేరియంట్స్ ధరలు వరుసగా రూ.32,999, రూ. 35,999, రూ. 38,999గా కంపెనీ నిర్ణయించింది. ఆ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ ధరలను వరుసగా రూ.33,999, రూ.36,999, రూ.39,999కు పెంచింది.

స్పెసిఫికేషన్స్

నథింగ్ ఫోన్ (1).. 120Hz రిఫ్రెష్ రేట్‌, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ ఉండే 6.55-అంగుళాల OLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 778G+ చిప్‌సెట్‌తో డివైజ్ రన్ అవుతుంది. నథింగ్ ఫోన్ (1) ఆండ్రాయిడ్ బేస్డ్ నథింగ్ ఓఎస్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,500 mAh బ్యాటరీ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ సెన్సార్‌తో డ్యుయల్ కెమెరా సెటప్‌ ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్‌ ఉంటుంది.

First published:

Tags: Nothing mobile, Smartphone

ఉత్తమ కథలు