2022 సంవత్సరంలో భారీ అంచనాలతో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్(1). కార్ల్ పీ నేతృత్వంలోని యూకే బేస్డ్ టెక్ సంస్థ నథింగ్ ఫోన్(1)ను లాంచ్ చేసింది. ఫోన్(1) వెనుకవైపు ప్రత్యేకమైన లైట్ స్ట్రిప్స్ ఫోన్‌ను ప్రధాన ఆకర్షణగా నిలిపాయి. దీన్ని Glyph ఇంటర్‌ఫేస్‌గా కంపెనీ పేర్కొంది. ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లకు సమానమైన స్పెసిఫికేషన్‌లను, కెమెరా సిస్టమ్‌ను ఫోన్(1)లో కంపెనీ అందజేసింది. అయితే ఈ లేటెస్ట్ ఫోన్‌ను వినియోగదారులు అతి తక్కువ ధరకే ఇప్పుడు సొంతం చేసుకొనే అవకాశం వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ భారీ డిస్కౌంట్‌లతో ఫోన్‌ను అందిస్తోంది.
రూ.4,750కే నథింగ్ ఫోన్(1)
భారతదేశంలో నథింగ్ ఫోన్ (1)ను ప్రత్యేకంగా ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. నథింగ్ ఫోన్ (1) ప్రారంభ ధర రూ.32,999 కాగా.. కంపెనీ ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్ ధరను రూ.33,999కి పెంచింది. స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లపై కూడా రూ.1,000 ధర పెరిగింది. అయితే ఇప్పుడు ఫోన్(1) కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులకు గుడ్‌న్యూస్. నథింగ్ ఫోన్ (1)ను ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు రూ.4,750కే సొంతం చేసుకొనే అవకాశం అందిస్తోంది. ఫోన్ ధర సాధారణంగా రూ.33,249కాగా అన్ని రకాల ఆఫర్‌లను పొందిన తర్వాత ధర భారీగా తగ్గనుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లు ఇవే..
నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,500 డిస్కౌంట్‌తో రూ.27,499కి లిస్ట్ అయింది. దీనికి అదనంగా IDFC FIRST క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్‌పై 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.5,000 మరియు అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై రూ.3000 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. వీటితో నథింగ్ ఫోన్ (1) ధర రూ.2,749 తగ్గుతుంది. ఇది కాకుండా, పాత స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.20,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అన్ని ఆఫర్‌లను వినియోగించుకుంటే.. ఫోన్ ధరపై మొత్తం రూ.22,749 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో కేవలం రూ.4,750కి ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (1)ని సొంతం చేసుకోవచ్చు.
ఫోన్(1) స్సెసిఫికేషన్‌లు ఇలా
ఫోన్ (1) వినియోగదారుల కోసం ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ను విడుదల చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. అప్‌డేట్ ప్రస్తుతం బీటా దశలో ఉంది. ఇది త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఫోన్(1) స్మార్ట్‌ఫోన్ 10-బిట్ కలర్స్‌తో 6.55-అంగుళాల ఫుల్ హెచ్‌డీ, ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ స్క్రీన్‌తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778G+ SoCతో పని చేస్తుంది. 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. నథింగ్ ఫోన్(1) 4,500 mAh బ్యాటరీని అందిస్తుంది. 15W Qi వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. కంపెనీ బాక్స్‌లో ఛార్జర్ అందించదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nothing mobile, Smartphones