Home /News /technology /

NOTHING LAUNCHER UNVEILED TO GIVE FIRST TASTE OF NOTHING OS FULL DETAILS AND KNOW HOW TO DOWNLOAD GH MKS

Nothing OS: నథింగ్ నుంచి సొంత ఓఎస్.. Nothing Launcher డౌన్‌లోడ్ చేసుకోండిలా..

నథింగ్ ఓఎస్ లాంఛర్

నథింగ్ ఓఎస్ లాంఛర్

నథింగ్ కంపెనీ సెలెక్టెడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల కోసం నథింగ్ లాంచర్ (బీటా) (Nothing Launcher)ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ నథింగ్ లాంచర్‌ను మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ నథింగ్ (Nothing) సరికొత్త నథింగ్ ఫోన్ (1)తో పాటు కొత్త నథింగ్ ఓఎస్ (Nothing OS) త్వరలోనే లాంచ్ చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఓఎస్‌ను ఇతర ఆండ్రాయిడ్ (Android) యూజర్లకు అందుబాటులో తీసుకొస్తామని కూడా తెలిపింది. అయితే తాజాగా ఈ కంపెనీ నథింగ్ ఓఎస్‌ ఎంత బాగుంటుందో తెలిపేందుకు సెలెక్టెడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల కోసం నథింగ్ లాంచర్ (బీటా) (Nothing Launcher)ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ నథింగ్ లాంచర్‌ను మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నథింగ్ ఓఎస్ మొదటి ప్రివ్యూను ఫ్యాన్స్‌కు అందించడానికే కంపెనీ ఈ లాంచర్‌ను విడుదల చేసింది.

మరో మాటలో చెప్పాలంటే, నథింగ్ లాంచర్ యూజర్లను నథింగ్ ఫోన్ (1)లో ఉండే ఎగ్జాక్ట్ గ్రాఫిక్స్, యానిమేషన్లను ప్రివ్యూ చేయడానికి అనుమతిస్తుంది. లాంచర్ బీటా మోడ్ లో అందుబాటులో ఉన్నందున, యూజర్లు కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కోవచ్చని.. కొన్ని ఫీచర్లు సడన్‌గా క్రాష్ కావచ్చని గమనించాలి.

90,000 IT Jobs : వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ కొనసాగింపు.. TCS, Infosys భారీ నియామకాలు


* నథింగ్ లాంచర్‌ను డౌన్‌లోడ్ చేయండిలా
యూజర్లు నథింగ్ లాంచర్‌ను గూగుల్ ప్లే యాప్ స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
స్టెప్ 1: గూగుల్ ప్లే స్టోర్ లింక్ (https://play.google.com/store/apps/details?id=com.nothing.launcher) ద్వారా నథింగ్ లాంచర్ (బీటా)ని డౌన్‌లోడ్ చేయండి.
స్టెప్ 2: ఫోన్ సెట్టింగ్స్> యాప్స్> డిఫాల్ట్ యాప్స్> డిఫాల్ట్ హోమ్ యాప్‌కి వెళ్లండి.
స్టెప్ 3: డిఫాల్ట్ హోమ్ యాప్‌గా నథింగ్ లాంచర్‌ని సెలెక్ట్ చేసుకోండి.
అప్లికేషన్‌ను రన్ చేసిన తర్వాత కొత్త వాల్‌పేపర్‌లు, ఐకాన్స్, అలారం టోన్‌ వంటివి కనిపిస్తాయి.

KCR అనూహ్య వ్యూహం? మోదీ సీటుకు స్పాట్ పెట్టారా? -బీజేపీలో ఏకైక మంచి మనిషి ఆయనే!!


*నథింగ్ లాంచర్‌ కీ ఫీచర్స్*
- మ్యాక్స్ ఐకాన్స్, మ్యాక్స్ ఫోల్డర్లు:
యాప్ ఫోల్డర్లు లేదా ఇండివిడ్యువల్ యాప్‌లను పెద్దగా చేయడానికి వాటిని హోల్డ్ చేసి ప్రెస్ చేయాలి. దీనివల్ల మీరు ఎక్కువగా వాడే యాప్ ఫోల్డర్లు లేదా ఇండివిడ్యువల్ యాప్స్ పెద్ద సైజులో కనిపిస్తాయి. అలా ఫోల్డర్‌ల నుంచి నేరుగా ఏదైనా యాప్‌ని మీరు లాంచ్ చేయొచ్చు.

- బెస్పోక్ క్లాక్ & వెదర్ విడ్జెట్‌లు:  వెదర్ విడ్జెట్‌లు నథింగ్స్ లోగో వలె అదే డాట్ మ్యాట్రిక్స్ ఫాంట్‌ను ఉపయోగిస్తాయి.

- నథింగ్ వాల్‌పేపర్ & స్టైల్స్: నథింగ్ వాల్‌పేపర్ & మ్యాచింగ్ కలర్ ప్యాలెట్‌తో హోమ్ స్క్రీన్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.

- ఒరిజినల్ రింగ్‌టోన్‌లు:  నథింగ్ ఫోన్ (1) కోసం రూపొందించిన మూడు కస్టమ్ రింగ్‌టోన్‌లు యాక్సెస్ చేయవచ్చు.

PM Kisan: రైతులకు డబుల్ బొనాంజా? భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ డబ్బులు తీసుకోవచ్చా? నిబంధనలివే..


నథింగ్ లాంచర్ శాంసంగ్ గెలాక్సీ ఎస్21, గెలాక్సీ ఎస్22, గూగుల్ పిక్సెల్ 5, అంతకంటే హై-ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే రన్ అవుతుందని కంపెనీ తెలిపింది. కంపెనీ త్వరలో లాంచర్‌ను వన్‌ప్లస్ ఫోన్లకు విస్తరించనుంది. బ్లాగ్ పోస్ట్‌లో, ఓఎస్ అనుభవాన్ని మెరుగుపరచడానికి యూజర్లు అభిప్రాయాన్ని అందించాలని నథింగ్ కోరింది. యూజర్లు నథింగ్ లాంచర్ ఈమెయిల్ ఐడీ ద్వారా వివరాలు, ఫోన్ మోడల్, ఓఎస్ వెర్షన్, స్క్రీన్‌షాట్‌లు/రికార్డింగ్‌లు ద్వారా ఫీడ్‌బ్యాక్ అందించవచ్చు .యూజర్ల ఫీడ్‌బ్యాక్ ప్రకారం నథింగ్ టీమ్ ఓఎస్ ని మెరుగు పరుస్తుంది.
Published by:Madhu Kota
First published:

Tags: Nothing, Smart phones, Technolgy

తదుపరి వార్తలు